2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

2021 సంవత్సరం ముగియడానికి ఇంకా ఎన్నిరోజులో లేదు. ఈ 2021 వ సంవత్సరంలో భారతీయ మార్కెట్లో చాలా కార్లను విడుదలై అత్యంత ప్రజాదరణ పొందగలిగాయి, కొన్ని మాత్రమే విజయవంతమైన మోడల్స్ గా నిలిచాయి.

2021 లో మహీంద్రా XUV700, టాటా పంచ్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు ఎంజి ఆస్టర్ వంటివి ఆశించిన ఫలితాలను పొంది, మార్కెట్లో తిరుగులేని అమ్మకాలను పొందాయి. 2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన మోడల్స్ గా నిలిచిన ఈ కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యువి700 ఇప్పటికే తిరుగులేని బుకింగ్స్ స్వీకరించింది. అతి తక్కువ కాలంలోనే కంపెనీ దాదాపు 70,000 బుకింగ్స్ స్వీకరించింది. అయితే కంపెనీ ఈ SUV ని దీపావళి సమయంలో 700 కంటే ఎక్కువ యూనిట్లను డెలివరీ చేసింది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం, 2022 జనవరి 14 లోపు 14,000 యూనిట్లను డెలివరీ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఈ లక్ష్యం దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నవంబర్ నెలలో కంపెనీ 3207 యూనిట్ల వాహనాలను డెలివరీ చేసిందని, అలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో కూడా అదే వేగంతో వాహనాలను డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం కంపెనీ సగటున 3,200 నుంచి 3,300 నుంచి యూనిట్లను డెలివరీ చేయబోతోంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

టాటా పంచ్ (Tata Punch):

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో ఇటీవల కాలంలో టాటా పంచ్ అనే మైక్రో SUV ని విడుదల చేసింది. ఇది దేశీయ మారేట్లో అతి తక్కువ సమయంలో మంచి అమ్మకాలను పొందింది. విడుదలైన మొదటి నెలలోనే 8,453 యూనిట్లను విక్రయించగలిగింది. ఈ కారణంగా ఈ మైక్రో SUV అమ్మకాల పరంగా మొదటి స్థానంలో ఉంది. టాటా పంచ్ ఇప్పటికే మొదటి నెలలో టియాగో, ఆల్ట్రోజ్‌ అంటి వాటిని సైతం అధిగమించి ముందువరుసలోకి చేరిపోయింది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

రెనాల్ట్ కైగర్ (Renault Kiger):

రెనాల్ట్ కంపెనీ యొక్క అమాంకాలను పెంచడంలో రెనాల్ట్ కైగర్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ కారు మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలను పొందగలిగింది. రెనాల్ట్ కైగర్ కంపెనీ యొక్క ఉత్తమ మోడల్ అయినప్పటికి క్రమంగా అమ్మకాలు తగ్గుదల వైపు వెళ్లాయి.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

రెనాల్ట్ కిగర్ దేశీయ మార్కెట్లో రూ. 5.64 లక్షల ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ SUV AMT మరియు CVT మరియు మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లతో (ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్) వస్తుంది. ఈ SUV ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి RXE, RXL, RXT, RXT (O) మరియు RXZ. మొత్తానికి ఇది కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ SUV గా నిలిచింది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun):

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగన్ ను రూ. 10.54 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. కంపెనీ ఈ కారుకి ఇప్పటివరకు దాదాపుగా 20,000 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించింది. వోక్స్‌వ్యాగన్ ఇండియా కొత్త టైగన్ విడుదలకు ముందే 12,000 యూనిట్ల ప్రీ-బుకింగ్‌లను పొందింది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

Volkswagen Taigun అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందుభాగంలో, ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

ఎమ్‌జి మోటార్ (MG Motor) దేశీయ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor). ఈ SUV ఇప్పటికి మంచి బుకింగ్స్ పొందుతూ ముందుకు సాగుతోంది. కొత్త ఎమ్‌జి ఆస్టర్ యొక్క పరిచయం ప్రారంభ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది.

ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన కార్లు.. వివరాలు

భారతీయ మార్కెట్లో ఆటోమొబైల్ పరిశ్రమకు 2021 సంవత్సరం చాలా వరకు కలిసి వచ్చింది. అయితే రానున్న 2022 కూడా మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. 2022 లో విడుదలవ్వడానికి చాలా మోడల్స్ వేచి వున్నాయి. ఇవి కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతాయి.

Most Read Articles

English summary
Top successful cars 2021 mahindra xuv700 tata punch renault kiger details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X