2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్: వివరాలు

దేశీయా మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందించ వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా తన థార్ విజయవంతం తరువాత, మరో కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇందులో ప్రముఖ మహీంద్రా బొలెరో నియో, ఎక్స్‌యూవీ 500, స్కార్పియో ఎస్‌యూవీలు ఉన్నాయి.

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

మహీంద్రా కంపెనీ ఇటీవల తన టియువి 300 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. కానీ ఇప్పుడు దీనికి బొలెరో నియో అని పేరు పెట్టింది. ఈ సిరీస్‌లో బొలెరో యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. అత్యధికంగా అమ్ముడైన యుటిలిటీ వాహనాల జాబితాలో బొలెరో అగ్రస్థానంలో ఉంది. అదే కారణంతో, దాని టియువి 300 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీకి బొలెరో నియో అని పేరు పెట్టి ఉండవచ్చు.

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

మహీంద్రా బొలెరో నియో యొక్క డిజైన్ విషయానికి వస్తే, దాని ముందు గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్ మరియు సొగసైన హెడ్‌ల్యాంప్‌తో మునుపటి టియువి 300 మోడల్ నుండి కొన్ని మార్పులను పొందుతుంది. బాక్సీ సిల్హౌట్‌లో స్క్వేర్-ఇష్ వీల్ ఆర్చర్ మరియు సైడ్-హింగ్డ్ టెయిల్‌గేట్ ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ మారదు.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

ఈ కొత్త ఎస్‌యూవీ సైడ్ స్టెప్స్, రియర్ స్టెప్, రూఫ్ రైల్స్, రూఫ్ మౌంటెడ్ రియర్ స్పాయిలర్ మరియు టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ కూడా ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన మోడల్‌లో స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇటీవల దీని టెస్టింగ్ సమయంలో బ్యాడ్జ్ మరియు టెయిల్‌గేట్‌లో కనిపిస్తుంది. బోనెట్ డిజైన్ కూడా అదే. బోలెరో నియో యొక్క సైడ్ ప్రొఫైల్ మార్చబడింది.

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

ఈ ఎస్‌యూవీ మొత్తం బాక్సీ డిజైన్ కొత్త మోడల్‌లో మారదు. కొత్త బొలెరో నియో ఇంటీరియర్ మునుపటి మోడల్‌తో పోలిస్తే కొన్ని నవీకరణలను కలిగి ఉంటుంది. కానీ ఇది మునుపటికంటే చాలా ఆకర్షణీయంగా ఉంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయనున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ; పూర్తి వివరాలు

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

క్యాబిన్‌కు కొత్త రూపాన్ని మరియు ప్రీమియం అనుభూతిని ఇవ్వడానికి బొలెరో నియో చాలా మార్పులు చేసి ఉండే అవకాశం ఉంది. ఇది ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్‌తో అప్‌డేట్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది కీలెస్ ఎంట్రీ, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్‌ విత్ ఇబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

మహీంద్రా యొక్క ఈ కొత్త కాంపాక్ట్-ఎస్‌యూవి మునుపటి మోడల్ మాదిరిగానే 1.5-లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని, 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని పవర్ మరియు టార్క్ గణాంకాలు దాదాపుగా మారే అవకాశం ఉండదని మేము ఆశిస్తున్నాము.

MOST READ:దుమ్మురేపుతున్న హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ వీడియో

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

మహీంద్రా కంపెనీ యొక్క బోలెరోకి మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఇది నిజంగా జనాదరణ పొందిన బ్రాండ్. కావున ఈ పేరును ఉపయోగించి అమ్మకాలను పెంచడానికి 300 ను బొలెరో నియో పేరుతో లాంచ్ చేస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది. ఈ ఎస్‌యూవీని త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలోని టాప్ ఫీచర్స్ : వివరాలు

భారతదేశంలో కొత్త మహీంద్రా బొలెరో నియో కాంపాక్ట్-ఎస్‌యూవీని విడుదలైన తర్వాత, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ వెన్యూ, హోండా డబ్ల్యూఆర్-వి మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది చూడటానికి కొంత చిన్నదిగా అనిపించినప్పటికీ మంచి పనితీరుని కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాము.

MOST READ:హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Most Read Articles

English summary
2021 Mahindra Bolero Neo 7 Things To Know. Read in Telugu.
Story first published: Monday, March 29, 2021, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X