మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

భారత ఆటో పరిశ్రమలోని దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ 2021 ఏప్రిల్ అమ్మకాల నివేదికను వెల్లడించాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీదారు టయోటా కూడా తన ఏప్రిల్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

కంపెనీ విడుదల చేసిన నివేదికలో ఏప్రిల్ నెలలో 9,622 కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ ఒక్క కారును కూడా అమ్మలేకపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. మార్చి నెలలో కంపెనీ 14,997 యూనిట్లను విక్రయించింది.

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

అదే ఏప్రిల్ నెలలో మంచి అమ్మకాలను సాగించింది. గత మార్చి అమ్మకాలు ఏప్రిల్ అమ్మకాలకంటే 35.84 శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా బిడాడి ప్లాంట్‌ను కంపెనీ మూసివేయాల్సి వచ్చిందని టయోటా పేర్కొంది. ఈ సమయంలో కంపెనీ ప్లాంట్ లో మరమ్మత్తు మరియు నిర్వహణ పనులు చేస్తోంది.

MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

అయితే కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రానిక్ చిప్ మరియు సరఫరా కొరతతో కొంత ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ కారణంగా, యుఎస్ మరియు కెనడాలోని కొన్ని ప్లాంట్లను కూడా కంపెనీ మూసివేసింది.

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

దీని గురించి కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రస్తుతం కంపెనీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, మార్కెట్లో వాహనాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ సమయంలో కస్టమర్లకు అనుకూలంగా ఉత్పత్తులు మొదలైనవి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

భారతదేశంలో కరోనా వేగంగా విస్తరిస్తూ ఎంతోమంది ప్రాణాలను హరిస్తోంది. ఈ కారణంగా టయోటా కంపెనీ ఏప్రిల్ 26 నుండి మే 14 వరకు వార్షిక నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కావున ఈ సమయంలో ఉత్పత్తి నిలిపివేయబడుతుంది.

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

అయితే దీనివల్ల కార్ల ఉత్పత్తి మరియు సరఫరా దెబ్బతింటుంది కావున టయోటా ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని బిడారీ వద్ద ఉన్న రెండు ప్లాంట్లలో కార్లను తయారు చేస్తుంది. ఇక్కడ ఒక ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 100,000 యూనిట్లు కాగా, రెండవ ప్లాంట్ యొక్క సామర్థ్యం సంవత్సరానికి 2,10,000 యూనిట్లు.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

ప్రస్తుతం టయోటా కంపెనీతోపాటు దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి గురుగ్రామ్ మరియు మనేసర్ వద్ద తన రెండు ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తోంది. ఇందుకోసం కంపెనీ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేసింది.

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

ఉత్పత్తి నిలిపివేసి, ఇక్కడ మెడికల్ ఆక్సిజన్ తయారు చేయడం ప్రారంభించింది. ఈ కంపెనీలో కార్ల తయారీ ప్రక్రియ సమయంలో తక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుందని, కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సాపేక్షంగా అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుందని మారుతి ఒక ప్రకటనలో తెలిపారు.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల హవా

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

ప్రస్తుతం దేశం చాలా కఠినమైన సమస్యను ఎదుర్కుంటున్న తరుణంలో, ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి కంపెనీలో ఆక్సిజన్ వినియోగించడానికి సన్నాహాలు సిద్ధం చేసారు. అందువల్ల మారుతి సుజుకి తన ఫ్యాక్టరీలను నిర్వహణ కోసం ముందే మూసివేయాలని నిర్ణయించింది.

మళ్ళీ పెరిగిన టయోటా 2021 ఏప్రిల్ సేల్స్.. పూర్తి వివరాలు

ఈ కంపెనీలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా కంపెనీలు ఉత్పత్తి నిలిపివేశాయి. ఇందులో సుజుకి మోటార్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం కరోనా నివారణలో నడుం బిగించిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Car Sales 2021 April. Read in Telugu.
Story first published: Tuesday, May 4, 2021, 9:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X