2021 చివరి నెలలో Toyota కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

2021 సంవత్సరం చివరి నెల కూడా దాదాపు ముగిసే దశలో ఉంది. అయితే ఈ సమయంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ఈ నెలలో తన బ్రాండ్స్ అయిన టయోటా గ్లాంజా, టయోటా అర్బన్ క్రూయిజర్, టయోటా ఇన్నోవా క్రిస్టా మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

కంపెనీ ఈ కార్లపైన రూ. 22,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ టయోటా కార్లపైన కొనుగోలుదారులకు EMI వంటి సర్వీస్ కూడా అందిస్తుంది. అయితే ఇది వాహనం యొక్క వేరియంట్, ఇంజిన్ మరియు కలర్ ఆప్సన్స్ వంటి వాటిపైన కూడా ఆధారపడి ఉంటాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

టయోటా గ్లాంజా (Toyota Glanza):

కంపెనీ యొక్క ప్రముఖ వాహనమైన Toyota Glanza కారుపైన కంపెనీ దాదాపు రూ. 22,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అంతే కాకుండా ఈ కారు కొనుగోలుపైన కంపెనీ రూ. 4,999 ఆకర్షణీయమైన EMI కూడా అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ కారు ధర రూ. 7.49 లక్షలు.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

టయోటా గ్లాంజా ప్రస్తుతం మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

టయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser):

టయోటా కంపెనీ తన అర్బన్ క్రూయిజర్ కారుపైన ఇప్పుడు రూ. 15,000 వరకు తగ్గింపును అందిస్తుంది. అంతే కాకుండా దీని కొనుగోలుపైన కంపెనీ రూ. 5,699 వరకు EMI వంటివాటిని కూడా అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ధర రూ. 8.72 లక్షలు.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

టయోటా అర్బన్ క్రూయిజర్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి మిడ్, హై మరియు ప్రీమియం వేరియంట్లు. ఈ మూడు వేరియంట్లు మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ఈ మూడు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉంటాయి.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta):

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాయోటా కంపెనీ యొక్క కార్లలో టయోటా ఇన్నోవా క్రిస్టా ఒకటి. కంపెనీ యొక్క ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఈ కారుపైన ఇప్పుడు ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తుంది. దీనితోపాటు ఇది ఆకర్షణీయమైన EMI కూడా అందిస్తుంది.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

కంపెనీ యొక్క ఈ కారు ధర దేశీయ మార్కెట్లో ప్రస్తుతం రూ. 17.18 లక్షలు వరకు ఉంటుంది. టయోటా కంపెనీ దీనిని 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి G, GX, GX లిమిటెడ్ ఎడిషన్, VX మరియు ZX వేరియంట్లు. ఇవన్నీ కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్లన్నీ కూడా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది. కావున కంపెనీ యొక్క 2021 డిసెంబర్ నెల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, అని భావిస్తున్నాము.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల 2021 నవంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ 13,003 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. 2020 సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది నవంబర్‌లో కంపెనీ యొక్క అమ్మకాలు 53 శాతం పెరిగాయి.

2021 చివరి నెలలో టయోటా కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. త్వరపడండి.. మీదే ఆలస్యం

2020 నవంబర్ నెలలో, కంపెనీ మొత్తం 8,508 యూనిట్ల కార్లను విక్రయించింది. అయితే నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, ఇందులో కూడా కంపెనీ యొక్క అమ్మకాలు 5 శాతం పెరిగాయి. అయితే ఇప్పుడు కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వల్ల ఈ నెల అమ్మకాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కావున 2021 లో మరింత మంచి వృద్ధి సాధించడానికి ఈ ఆఫర్స్ ఉపయోగపడతాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 10, 2021, 11:33 [IST]
English summary
Toyota car offers december 2021 glanza urban cruiser innova crysta details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+