అలెర్ట్.. అక్టోబర్ 01 నుంచి పెరగనున్న Toyota ధరలు
భారతీయ మార్కెట్లో చాలా వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే తమ వాహనాల ధరలను పెంచిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో భాగంగా ప్రముఖ వాహన తయారీ సంస్థ Toyota (టయోటా) కూడా తన బ్రాండ్ యొక్క వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరల పెరుగుదల అనేది 2021 అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం Toyota కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే భారతదేశంలో ప్రారంభం కానున్న పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా చాలా మంది కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను పెంచే అవకాశం కనిపిస్తుంది. Toyota కంపెనీ ఏ మోడల్ పై ఎంత ధరను పెంచుతుంది అనే విషయంపై అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ దీనికి సంబంధించిన సమాచారం త్వరలో విడుదలవుతుంది.

కంపెనీ తమ కస్టమర్లపైన వీలైనంత తక్కువ భారాన్ని మోపడానికి తగిన ప్రయత్నాలు చేస్తుంది. ఈ కారణంగానే కంపెనీ తమ వాహనాల ధరలను తక్కువ మొత్తంలో మాత్రమే పెంచుతుంది. ఎందుకంటే భారీగా పెరిగే ధరల కంపెనీ యొక్క అమ్మకాలపై ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటి ప్రభావాన్ని నివారించడానికి కంపెనీ తగిన ఏర్పాట్లు చేస్తుంది.

కంపెనీ నివేదికల ప్రకారం తమ బ్రాండ్ అయిన Toyota Yaris మోడల్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేశీయ మార్కెట్లో Toyota Yaris అత్యంత ఆకర్షణీయమైన మోడల్ అయినప్పటికీ, ఎక్కువ ప్రజాదరణ పొందటంలో విఫలం అయ్యింది. కావున ఈ కారణంగా కంపెనీ ఈ మోడల్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Toyota గత 2021 ఆగస్టులో తన ప్రసిద్ధ MPV అయిన Innova Crysta ధరను కూడా పెంచింది. అధిక ధరల ప్రభావాన్ని తగ్గించడానికి తక్కువ మొత్తంలో మాత్రమే ధరలను పెంచినట్లు తెలిపింది. తక్కువ మొత్తంలో ధరల పెరుగుదల కస్టమర్‌లపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉండదు.

భారత మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి వంటి పెద్ద కంపెనీతో సహా అనేక కంపెనీలు వాహనాల ధరలను దాదాపు మూడు రెట్లు పెంచాయి. అధిక ధరల పెరుగుదల మార్కెట్లో అమ్మకాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. కావున Toyota కంపెనీ ఈ మార్గాన్ని అనుసరించలేదు.

ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, కంపెనీ యొక్క అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గత నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 12,772 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. నివేదికల ప్రకారం 2020 ఆగష్టు నెలతో పోలిస్తే 2021 ఆగస్టు నెలలో కంపెనీ జరిపిన అమ్మకాలు దాదాపు 130% పెరుగుదలను నమోదు చేయగలిగింది.

2020 ఆగస్టులో, Toyota కంపెనీ దేశీయ మార్కెట్లో కేవలం 5,555 కార్లను మాత్రమే విక్రయించినట్లు తెలిసింది. ఏవిధంగా టయోటా మొత్తం అమ్మకాల విషయానికి వస్తే, ఈ సంవత్సరం జనవరి మరియు ఆగస్టు మధ్య, కంపెనీ దేశీయ మార్కెట్లో 85,209 యూనిట్ల కార్లను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో 39,627 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 115 శాతం పెరుగుదలను చేయగలిగింది. రాబోయే రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

భారతదేశంలో అమ్మకాల ప్రక్రియను మరింత పెంచడానికి మరియు సులభతరం చేయడానికి, కంపెనీ ఇటీవల మొదటి వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో ఫైనాన్స్ ఆఫర్లు మరియు లోన్ వంటివి కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచబడ్డాయి.
కంపెనీ ప్రారంభించిన ఈ వర్చువల్ షోరూమ్‌ను ఆస్వాదించడానికి, టయోటా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ వర్చువల్ షోరూమ్‌లో వాహనాన్ని ఎంచుకోవడంతో పాటు, వాహనాన్ని 360 డిగ్రీల కోణంతో పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.

వర్చువల్ షోరూమ్‌లో కారులోని అన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. కారు బయట, లోపల మరియు వెనుక భాగాలను కూడా పూర్తిగా మరియు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఇది వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటూ మంచి అనుభవాన్ని అందిస్తుంది. అక్టోబర్ 01 నుంచి కంపెనీ యొక్క కొత్త ధరలు అమలులోకి రానున్నాయి, అయితే ఈ ధరల పెరుగుదల కంపెనీ యొక్క అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా.. లేదా అనే విషయం త్వరలో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








