మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

2021 వ సంవత్సరం ఎట్టకేలకు చివరి నెలలో ఉంది, 2022 రావడానికి మరెన్నో రోజులు లేవు. చాలామంది 'న్యూ ఇయర్ సెలబ్రేషన్స్' చేసుకోవానికి మరియు కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలను కొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ ఆటో మొబైల్ కంపెనీలు చాలా వరకు కొత్త సంవత్సరంలో వాహనాల ధరలను పెంచనున్నాయి. ఇందులో టయోటా కంపెనీ కూడా ఉంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

టయోటా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 జనవరి 1 నుండి తన వాహనాల ధరలను పెంచనుంది. ప్రస్తుతం మార్కెట్లో ముడిసరుకుతో సహా ఇతర ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన కారణంగా కంపెనీ తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కానీ వినియోగదారులపై ఎక్కువ ప్రభావం కలగకుండా చూసుకుంటామని కంపెనీ తెలిపింది. కానీ ఏ కారుమీద ఎంత ధర పెంచనున్నారో ఇంకా అధికారికంగా తెలియదు. త్వరలో తెలుస్తుంది.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

ఇప్పటికే చాలా కంపెనీలు ఈ బాటలో ఉన్నాయి. అయితే ఇప్పుడు టయోటా ఈ జాబితాలో చేరింది. కానీ ధరల గురించి సమాచారం అందుబాటులో లేనప్పటికీ,కొత్త ధరలన్నీ కూడా రాబోయే నెలల్లో డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటాయి.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

ఆటో మొబైల్ కంపెనీలు దాదాపుగా కొత్త సంవత్సరం ప్రారంభంలో తమ వాహన ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే, ఈ సంవత్సరం కూడా ధరల పెరుగుదల జరుగుతుంది. ఈ ఏడాది ముడిసరుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహనాల ధరలను చాలాసార్లు పెంచాయి. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరింత పెంచే అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

దేశీయ మార్కెట్లో చాలా కంపెనీ ధరలు పెంచుతున్న సమయంలో టయోటా కంపెనీ మాత్రం తమ వాహనాల ధరల్లో చాలా తగ్గింపులను అందిస్తుంది. కంపెనీ ఈ కార్లపైన రూ. 22,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ టయోటా కార్లపైన కొనుగోలుదారులకు EMI వంటి సర్వీస్ కూడా అందిస్తుంది. అయితే ఇది వాహనం యొక్క వేరియంట్, ఇంజిన్ మరియు కలర్ ఆప్సన్స్ వంటి వాటిపైన కూడా ఆధారపడి ఉంటాయి.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

టయోటా గ్లాంజా:

కంపెనీ యొక్క ప్రముఖ వాహనమైన Toyota Glanza కారుపైన కంపెనీ దాదాపు రూ. 22,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అంతే కాకుండా ఈ కారు కొనుగోలుపైన కంపెనీ రూ. 4,999 ఆకర్షణీయమైన EMI కూడా అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ కారు ధర రూ. 7.49 లక్షలు. టయోటా గ్లాంజా ప్రస్తుతం మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

టయోటా అర్బన్ క్రూయిజర్:

టయోటా కంపెనీ తన అర్బన్ క్రూయిజర్ కారుపైన ఇప్పుడు రూ. 15,000 వరకు తగ్గింపును అందిస్తుంది. అంతే కాకుండా దీని కొనుగోలుపైన కంపెనీ రూ. 5,699 వరకు EMI వంటివాటిని కూడా అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ధర రూ. 8.72 లక్షలు.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

టయోటా ఇన్నోవా క్రిస్టా:

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాయోటా కంపెనీ యొక్క కార్లలో టయోటా ఇన్నోవా క్రిస్టా ఒకటి. కంపెనీ యొక్క ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఈ కారుపైన ఇప్పుడు ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తుంది. దీనితోపాటు ఇది ఆకర్షణీయమైన EMI కూడా అందిస్తుంది. కంపెనీ యొక్క ఈ కారు ధర దేశీయ మార్కెట్లో ప్రస్తుతం రూ. 17.18 లక్షలు వరకు ఉంటుంది. టయోటా కంపెనీ దీనిని 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి G, GX, GX లిమిటెడ్ ఎడిషన్, VX మరియు ZX వేరియంట్లు. ఇవన్నీ కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్లన్నీ కూడా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది. కావున కంపెనీ యొక్క 2021 డిసెంబర్ నెల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, అని భావిస్తున్నాము.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల 2021 నవంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ 13,003 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. 2020 సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది నవంబర్‌లో కంపెనీ యొక్క అమ్మకాలు 53 శాతం పెరిగాయి.

మీకు తెలుసా.. 2022 జనవరి నుంచి పెరగనున్న Toyota ధరలు

2020 నవంబర్ నెలలో, కంపెనీ మొత్తం 8,508 యూనిట్ల కార్లను విక్రయించింది. అయితే నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, ఇందులో కూడా కంపెనీ యొక్క అమ్మకాలు 5 శాతం పెరిగాయి. అయితే ఇప్పుడు కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వల్ల ఈ నెల అమ్మకాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కావున 2021 లో మరింత మంచి వృద్ధి సాధించడానికి ఈ ఆఫర్స్ ఉపయోగపడతాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota car price hike from january details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X