భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ (Fortuner) లో కంపెనీ ఓ కొత్త 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..రండి.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఎస్‌యూవీని కంపెనీ మొదటిసారిగా 2009 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ కారు ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో భారతీయుల నుండి అత్యంత ప్రజాదరణ పొందింది. ధర అధికంగా ఉన్నప్పటికీ, దాని గంభీరమైన రోడ్ ప్రజెన్స్ మరియు హై-ఎండ్ కంఫర్ట్ అండ్ లగ్జరీ ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

ఫార్చ్యూనర్ మోడల్ లో రెండవ తరం మోడల్ ని కంపెనీ 2016 లో భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఏడాది (2021) ప్రారంభంలో టొయోటా కారుకి మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ను అందించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కొత్తగా వచ్చిన 2021 టొయోటా ఫార్చ్యూనర్ (2021 Toyota Fortuner)తో పాటుగా కంపెనీ ఇందులో ఫార్చ్యూనర్ లెజెండర్, (Fortuner Legender) అనే కొత్త టాప్-స్పెక్ ట్రిమ్ ను కూడా ప్రవేశపెట్టింది.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ స్టాండర్డ్ ఫార్చ్యూనర్ కన్నా ప్రీమియం స్టైల్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ మోడల్ ని ప్రవేశపెట్టిన సమయంలో కంపెనీ దీనిని టూవీల్ డ్రైవ్ (2x4) ఆప్షన్ తో మాత్రమే అందించింది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ (4×4) డ్రైవ్‌ట్రెయిన్ ని అందించేందుకు ప్లాన్ చేస్తోంది.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

ఆల్-వీల్ డ్రైవ్ ఫీచర్ తో రానున్న కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 4×4, ఈ మోడల్ ని దాని ప్రత్యర్థుల కన్నా బలంగా చేయడంలో సహాయపడుతుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ కొత్త వేరియంట్ ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీని అక్టోబర్ 8, 2021 వ తేదన మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. అదే సమయంలో దాని ధర మరియు ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

టొయోటా ఈ నెలాఖరు (సెప్టెంబర్ చివరి) నాటికి తమ 4-వీల్ డ్రైవ్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని డీలర్‌షిప్ లకు పంపిణీ చేయటం ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కొత్త వేరియంట్ లో డ్రైవ్‌ట్రైన్ మార్పు మినహా ఫీచర్లు మరియు మెకానికల్స్ పరంగా వేరే మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ (4×2) వేరియంట్ ధర రూ. 38.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే Toyota Fortuner Legender 4×4 వేరియంట్ ధర సుమారు రూ. 40 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో ఉండొచ్చని అంచనా. ఈ ధర వద్ద ఫార్చ్యూనర్ లెజెండర్ 4x4 భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ అవుతుంది. అయినప్పటికీ, ఈ కొత్త వేరియంట్ రాకతో రానున్న పండుగ సీజన్ లో ఈ మోడల్ అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

రెగ్యులర్ టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీతో పోలిస్తే ఈ కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ డిజైన్‌లో కొద్దిపాటి ఎక్స్టీరియర్ మార్పులు ఉన్నాయి. లెజెండర్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్‌తో పూర్తిగా సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉంటాయి.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

క్యాబిన్ లోపల 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు టొయోటా కనెక్ట్ వంటి లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, టిఎఫ్‌టి మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఈ ఎస్‌యూవీలో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ (ఆటో ఎమర్జెన్సీ అన్‌లాక్‌తో), మరియు అత్యవసర బ్రేక్ సిగ్నల్ మొదలైనవి ఉన్నాయి. భారత మార్కెట్లో ఫార్చ్యూనర్ లెజెండర్ ఒకే కలర్ ఆప్షన్‌లో (బ్లాక్ రూఫ్ విత్ వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్) మాత్రమే లభిస్తుంది.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

ఇంజన్ విషయానికి వస్తే, టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ కేవలం 2.8 లీటర్ టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-4 డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 201 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు.

భారత మార్కెట్లో Toyota Fortuner Legender 4x4 లాంచ్ ఎప్పుండంటే..?

అయితే, పెట్రోల్ వెర్షన్ టొయోటా ఫార్చ్యూనర్ కావాలనుకునే వారు లెజెండర్ వేరియంట్ ను కాకుండా స్టాండర్డ్ వెర్షన్ ఫార్చ్యూనర్ ను ఎంచుకోవచ్చు. ఇది 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 164 బిహెచ్‌పి పవర్ ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Toyota fortuner legender all wheel drive variant launch date revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X