భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

ప్రముఖ వాహన తయారీదారు Toyota (టొయోటా) మార్కెట్లో తన బ్రాండ్ కార్ల ధరలను పెంచినట్లు తెలిసింది. ఈ ధరల పెరుగుదల 2021 అక్టోబర్ నుండి అమలులో ఉంటాయి. ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు తమ వాహన ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే Toyota ఇప్పుడు తన మోడళ్ల ధరను దాదాపు రూ. 61,000 వరకు పెంచింది.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

Toyota ఇప్పుడు టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మరియు టొయోటా క్యామ్రీ ధరలను పెంచింది. అయితే కంపెనీ యొక్క టొయోటా వెల్‌ఫైర్ ధరను మాత్రం పెంచలేదు. ఇందులో కూడా కంపెనీ యొక్క క్యామ్రీ ధరను ఏకంగా 61,000 రూపాయలు పెంచింది.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

Toyota Glanza (టయోటా గ్లాంజా):

Toyota కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ లో Glanza ఒకటి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క అన్ని వేరియంట్‌ల ధరలు ఇప్పుడు రూ. 15,000 పెరిగాయి. Toyota Glanza యొక్క ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు కాగా, Glanza టాప్ వేరియంట్ ధర రూ. 9.45 లక్షలకు చేరుకుంది.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

Toyota Urban Cruiser (టయోటా అర్బన్ క్రూయిజర్):

Toyota కంపెనీ ఇప్పుడు తన Urban Cruiser SUV ధరలను రూ. 10,000 వరకు పెంచింది. అయితే ఇందులోని ప్రీమియం మాన్యువల్ ధర రూ. 5,000 పెరిగింది. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇందులోని ఆటోమేటిక్ వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. Urban Cruiser ప్రారంభ ధర రూ. 8.73 లక్షలకు పెరిగింది, టాప్ మోడల్ ధర రూ. 11.41 లక్షలు.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

Urban Cruiser ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. కావున మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

Toyota Innova Crysta (టయోటా ఇన్నోవా క్రిస్టా):

Toyota Innova Crysta కంపెనీ యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటి. ఈ MPV యొక్క పెట్రోల్ వేరియంట్ యొక్క జిఎక్స్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్‌ల ధర ఇప్పుడు రూ. 36,000 పెరిగింది. కావున దీని ప్రారంభ ధర రూ .17.18 లక్షలు. అదేవిధంగా డీజిల్ వేరియంట్లయిన G, G+, GX మాన్యువల్ మరియు GX ఆటోమేటిక్ వెర్షన్‌ల ధరలు కూడా రూ. 36,000 పెరిగాయి. కావున వీటి ప్రారంభ ధర ఇప్పుడు రూ .17.94 లక్షలు.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

Toyota Fortuner (టయోటా ఫార్చ్యూనర్):

Toyota Fortuner కూడా కంపెనీ యొక్క మంచి డిమాండ్ ఉన్న SUV. ఇప్పుడు ఈ SUV యొక్క పెట్రోల్, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ. 39,000 పెరిగింది. దరల పెరుగుదల వల్ల దీని ధర ఇప్పుడు రూ. 30.73 లక్షలకు చేరింది.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

ఇక డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, ఇందులోని 4x2 మాన్యువల్, 4x4 మాన్యువల్ మరియు 4x4 ఆటోమేటిక్ ధరలు రూ. 39,000 వరకు పెరిగాయి. అదే సమయంలో 4x2 ఆటోమేటిక్, లెజెండ్ 4x2 ఆటోమేటిక్ ధరలు రూ. 31,000 పెరిగాయి. దరల పెరుగుదల తర్వాత డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 33.23 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ. 38.61 లక్షలకు చేరింది.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

Toyota Camry (టొయోటా క్యామ్రి):

టొయోటా కంపెనీ తన క్యామ్రి ధరను అత్యధికంగా రూ. 61,000 పెంచింది. ధరల పెరుగుదల కారణంగా దీని ధర రూ. 41.20 లక్షలకు చేరింది. టొయోటా క్యామ్రి ప్రస్తుతం కేవలం ఒక మోడల్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపట్టిన మోడల్ ఈ టొయోటా క్యామ్రి.

భారీగా పెరిగిన Toyota కార్ల ధరలు; ఏ మోడల్ పై ఎంతంటే?

దేశవ్యాప్తంగా పండుగగా సీజన్ ప్రారంభం కానుంది. కావున ఈ నేపథ్యంలో చాలా మంది కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను పండుగ సీజన్లలో పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ధరల పెరుగుదల కొనుగోలుదారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపకూడనే కారణంగా కంపెనీ తక్కువ మొత్తంలో ధరలను పెంచుతుంది. అయినప్పటికి ధరల పెరుగుదల కొనుగోలుదారులపైన తప్పకుండా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Toyota india cars price hiked up to rs 61000 details
Story first published: Tuesday, October 5, 2021, 16:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X