Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎమ్‌పివి టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) లో ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ను విడుదల చేసింది. స్టాండర్డ్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివితో పోల్చుకుంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లు మరియు రిఫ్రెష్డ్ లుక్స్ ని కలిగి ఉంటుంది.

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

భారతదేశంలో ప్రస్తుత పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని టొయోటా ఈ కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ (Toyota Innova Crysta Limited Edition) ధరలు ఇలా ఉన్నాయి:

* పెట్రోల్ వేరియంట్ - రూ. 17.18 లక్షలు

* డీజిల్ వేరియంట్ - రూ. 18.99 లక్షలు

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

(రెండు ధరలు, ఎక్స్-షోరూమ్)

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను జోడించింది. వేరియంట్ ఇప్పుడు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లతో కూడిన కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ తో వస్తుంది మరియు ఇది అధునాతన కనెక్టివిటీ ఫంక్షన్లతో లోడ్ చేయబడి ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఇన్నోవా క్రిస్టా లో సుమారు 100 ఫీచర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లో కొత్తగా..

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ లో కొత్తగా జొడించిన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 360 డిగ్రీ కెమెరాతో కూడిన మల్టీ-టెర్రైన్ మోనిటర్‌ ఉంటుంది. ఇది పార్కింగ్ మరియు నావిగేషన్ కోసం డ్రైవర్‌కు 'బర్డ్ ఐ వ్యూ' ని ఇస్తుంది. ఇంకా ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ఐయానైజర్ మరియు 16 ప్రకాశవంతమైన రంగులతో కూడిన డోర్ ఎడ్జ్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

అంతేకాకుండా, సేఫ్టీ పరంగా చూస్తే కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లో 7 SRS ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎకో మరియు పవర్ డ్రైవ్ మోడ్‌లు మరియు క్రూయిజ్ కంట్రోల్ తో పాటుగా ఈబిడితో కూడిన ఏబిఎస్, చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మార్పుల మినహా, ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లో డిజైన్ మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు.

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ఇంజన్..

ఇంజన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ ఇన్నోవా క్రిస్టాలో ఉపయోగిస్తున్న అదే ఇంజన్ నే ఈ కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లోనూ ఉపయోగించారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 2.7 లీటర్ పెట్రోల్ మరియు 2.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 166 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు డీజిల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్‌ లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

పండుగ సీజన్ లో ఆకర్షణీయమైన ఆఫర్లు..

ఇదిలా ఉంటే, ప్రస్తుత పండుగ సీజన్ ను పురస్కరించుకొని, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) తమ వాహనాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. దక్షిణ భారతదేశంలో కస్టమర్లకు టొయోటా కార్ల కొనుగోలు సులభతరం చేయడానికి కంపెనీ 'విక్టోరియస్ అక్టోబర్' అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పండుగ సీజన్‌లో అక్టోబర్ 31, 2021 వరకు ఐదు రాష్ట్రాల్లోని అధీకృత డీలర్‌షిప్‌లలో అన్ని టొయోటా మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

టొయోటా కార్లపై అందించే ప్రయోజనాలు..

మీరు కూడా ఒకవేళ ఈ పండుగ సీజన్‌లో టొయోటా కారు కొనాలని చూస్తున్నట్లయితే, కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాల ద్వారా భారీగా నగదు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లలో భాగంగా, కంపెనీ తమ కొత్త కారు ధరలో 90 శాతం వరకూ ఫండింగ్ చేస్తోంది. అంటే, కారు ధరలో మీరు కేవలం 10 శాతం మాత్రమే డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. అంతే కాకుండా, ఇప్పుడు కారు కొన్న వారికి కంపెనీ 2022 నుండి ఈఎమ్ఐ చెల్లించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.

దీనికి అధనంగా, ప్రత్యేక ఆఫర్ లో భాగంగా, టొయోటా గ్లాంజా మరియు అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్ల కొనుగోలుపై కంపెనీ నిర్దిష్ట బైబ్యాక్ ఆఫర్ ను కూడా అందించనుంది. ఇవే కాకుండా, టొయోటా గ్లాంజా మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్ మోడళ్లను కూడా కంపెనీ తమ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ క్రింద అందిస్తోంది. కస్టమర్లు ఇప్పుడు ఈ ప్లాన్ పై కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత డీలర్‌ను సంప్రదించండి.

Toyota Innova Crysta లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

మరొక కస్టమర్-సెంట్రిక్ చొరవలో భాగంగా, టొయోటా భారతదేశంలో సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (SHEV) కోసం బ్యాటరీ వారంటీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 1, 2021 వ తేదీ నుండి విక్రయించబడే టొయోటా క్యామ్రీ మరియు వెల్‌ఫైర్ మోడళ్ల కోసం వారంటీ కవరేజ్ మూడు సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల నుండి ఎనిమిది సంవత్సరాలు లేదా 1,60,000 కిమీలకు పొడిగించబడింది.

Most Read Articles

Read more on: #టొయోటా
English summary
Toyota Innova Crysta Limited Edition Launched: Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X