స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) తో భాగస్వామ్యం ఏర్పరచుకున్నప్పటి నుంచి, తన పోర్ట్‌ఫోలియోలో మారుతి సుజుకి యొక్క రీ-బ్యాడ్జ్ మోడల్‌లను చేర్చింది. ఇందులో టయోటా గ్లాంజా (Toyota Glanza) మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser) ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో టయోటా రూమియన్ (Toyota Rumion) పేరును ట్రేడ్‌మార్క్ చేసింది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

కంపెనీ కొంతకాలం క్రితం, అదే పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్‌ను వెల్లడించింది. టయోటా ఈ ఎమ్‌పివిని భారత మార్కెట్‌లో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి టయోటా కిర్లోస్కర్ నుంచి మరో ఎస్‌యూవీ గురించిన సమాచారం తెరపైకి వస్తోంది. ఈ కొత్త SUV విషయానికి వస్తే, ఇది భారతదేశంలో కంపెనీ యొక్క కొత్త మోడల్ కానుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, టయోటా కిర్లోస్కర్ యొక్క మిడ్-సైజ్ SUV అయిన టయోటా RAV4 టెస్టింగ్ సమయంలో కనిపించింది. టయోటా కిర్లోస్కర్ నుండి ఈ మిడ్ సైజ్ SUV చాలా కాలం తర్వాత ఇప్పుడు భారతీయ రోడ్లపై పరీక్షించబడటం గమనించదగ్గ విషయం.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం, టయోటా RAV4 SUV కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు రోడ్లపై పరీక్షిస్తున్నట్లు కనిపించింది. ఇక్కడ కనిపించిన ఈ కారుకు సంబంధించిన ఈ చిత్రాలలో, ఈ SUV మభ్యపెట్టకుండా చూపబడింది. ఈ కారు చూడటానికి బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ SUV బహిర్గతంగా రోడ్లపై టెస్ట్ చేయబడుతోంది. ఈ టెస్ట్ మ్యూల్ కారు యొక్క టాప్-ఎండ్ వేరియంట్ లాగా కనిపిస్తుంది. ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించబడుతోంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

ఈ SUV అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే మోడల్‌ను పోలి ఉండటం మీరు ఈ ఫోటోల ద్వారా గుర్తించవచ్చు. టయోటా త్వరలో ఈ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంటుంది. కావున ఇది ఇప్పుడు టెస్టింగ్ దశలో ఉంది. అంతే కాకుండా ఇది త్వరలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ టెస్ట్ మ్యూల్ టయోటా RAV4 యొక్క ఐదవ-తరం మోడల్, ఇది కంపెనీ TNGA-K ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై టయోటా క్యామ్రీ (Toyota Camry) కూడా నిర్మించబడింది. మీరు ఈ ఫోటోలలో ఈ కారు యొక్క బూట్ యొక్క కుడి వైపున ఒక బ్యాడ్జ్ ఉంచబడింది. ఈ బ్యాడ్జ్ ఇప్పటికే టయోటా యొక్క హైబ్రిడ్ వాహనాలపై కనిపించింది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

టయోటా RAV4 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో భారతదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో, టయోటా RAV4 ని పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే విక్రయిస్తోంది. అయితే భారతదేశంలో విడుదలయ్యే ఈ కొత్త మోడల్ కి సంబంధించిన పెట్రోల్ ఇంజన్ వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

టయోటా RAV4 హైబ్రిడ్ ఇంజన్ విషయానికి వస్తే, దీనికి 2.5 లీటర్, ఫోర్ సిలిండర్, అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వవచ్చు. ఎలక్ట్రిక్ మోటార్ ఈ పెట్రోల్ ఇంజన్‌తో జత చేయబడుతుంది. ఇంజిన్ మరియు మోటార్ రెండూ కలిసి 2-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో 218 బిహెచ్‌పి పవర్‌ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో 222 బిహెచ్‌పి పవర్‌ ఉత్పత్తి చేస్తాయి.

టయోటా కిర్లోస్కర్ భారతదేశంలో 2,500 యూనిట్ల దిగుమతి కోటా కింద టయోటా RAV4ని కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా పరిహాయం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే దీని ధర దేశీయ మార్కెట్లో ఎక్కువుగానే ఉండే అవకాశం ఉంటుంది. దీని హైబ్రిడ్ వెర్షన్ ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. ఇది ధర ఎక్కువగా ఉన్న కారణంగా దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Toyota RAV4: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో టయోటా ఒకటి. టయోటా కంపెనీ యొక్క అన్ని మోడల్స్ కూడా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది. ఇప్పుడు కంపెనీ మారుతి సుజుకి భాగస్వామ్యంతో కొత్త మోడల్ విడుదల చేయనుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో ఎంతవరకు విజయవంతం అవుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

టయోటా కంపెనీ గత నెలలో దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను కైవసం చేసుకుంది. కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి కంపెనీ యొక్క కొత్త టాటా పంచ్ చాలా సహకరించింది. ఈ నెలలో కూడా కంపెనీ మంచి అమ్మకాలను సొంతం చేసుకుంటుందని భావితున్నాము.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota rav4 mid size suv spotted testing in bangalore rear profile revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X