2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీదారులలో టయోటా (Toyota) ఒకటి. టయోటా కంపెనీ తన సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్ విభాగంలో అర్బన్ క్రూయిజర్ (Urban Cruiser) ను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ SUV అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందగలిగింది. టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-కాంపాక్ట్ SUV అనేది మారుతి సుజుకి విటారా బ్రెజ్జా యొక్క రీబ్యాడ్జ్ మోడల్. ఇటీవల కంపెనీ ఈ SUV యొక్క అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-కాంపాక్ట్ SUV మొత్తం 2,100 యూనిట్లను అమ్మగలిగింది. ఈ SUV కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన మూడవ మోడల్. ఈ అమ్మకాల్లో టయోటా గ్లాంజా, ఇన్నోవా క్రిస్టా మరియు అర్బన్ క్రూయిజర్ ఉన్నాయి.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

ఇదివరకు చెప్పుకున్నట్లుగా టయోటా అర్బన్ క్రూయిజర్ అనేది మారుతి సుజుకి విటారా బ్రజా యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్, మారుతి సుజుకి బ్రజ్జా వలె కాకుండా, కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ SUV ముందు భాగంలో ట్విన్ స్లాట్ గ్రిల్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ SUV ముందు భాగంలో బంపర్ కట్‌లు మరియు క్రీజులు ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ SUVలోని ట్వీక్‌లు బ్రెజ్జా కంటే భిన్నంగా కనిపించడంలో సహాయపడతాయి.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. అంతే కాకూండా ఈ కాంపాక్ట్ SUVలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రైల్, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు మరియు 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్ వంటివి కూడా ఉన్నాయి.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ SUV లోపలి భాగం చాలా ఆకర్షణీయంగా ఉండి, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ మరియు పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు రెయిన్ సెన్సింగ్ వైపర్ మరియు కీలెస్ ఎంట్రీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ SUV అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి. ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ ఆడియో, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, విటారా బ్రెజ్జా మరియు అర్బన్ క్రూయిజర్‌లో ఒకే రకమైన ఇంజన్ ఉంటుంది. ఇందులో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్‌ (ఎస్‌విహెచ్ఎస్)తో కూడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300 మరియు కొత్త కియా సోనెట్ కాంపాక్ట్ SUV వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. టొయోటా తమ అర్బన్ క్రూయిజర్ మోడల్‌ను మొత్తం మూడు వేరియంట్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో విడుదల చేసింది. మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.8.40 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.30 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ, ఇండియా).

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల తన అక్టోబర్ 2021 అమ్మకాల నివేదికను ప్రకటించింది. నివేదికల ప్రకారం, టయోటా గత నెలలో 12,440 యూనిట్లను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌లో టయోటా 12,373 యూనిట్లను విక్రయించింది. గత నెల విక్రయాలతో పోలిస్తే ఇది 1% పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ 9,284 యూనిట్లను విక్రయించింది. గత నెల విక్రయాలతో పోలిస్తే నెలవారీ విక్రయాల్లో ఇది 34% పెరుగుదలను నమోదు చేయగలిగింది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో భేష్ అనిపించుకున్న 'Toyota Urban Cruiser': పూర్తి వివరాలు

కంపెనీ నెలవారీ కార్ల విక్రయాల్లో టయోటా భారీ విజయాన్ని సాధించింది. 2021 సంవత్సరంలో, టయోటా జనవరి నుండి అక్టోబర్ 2021 వరకు మొత్తం 1,06,993 యూనిట్లను విక్రయించగలిగింది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 60,116 యూనిట్లతో పోలిస్తే 78 శాతం వృద్ధిని సాధించింది. ఏది ఏమైనా కంపెనీకి భారతదేశంలో ప్రారంభమైన పండుగ సీజన్ చాలా వరకు కలిసి వచ్చింది అనే చెప్పాలి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota sells 2100 units of urban cruiser in october 2021 details
Story first published: Monday, November 8, 2021, 12:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X