ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న టాకోమా (Tacoma) పికప్ ట్రక్ ఆధారంగా చేసుకొని రూపొందించిన కస్టమైజ్డ్ క్యాంపర్ మోటార్ హోమ్ టాకోజిల్లా (Tacozilla) ను సెమా ఆటో షో 2021 (SEMA) లో ఆవిష్కరించింది. టొయోటా 1970-80 మధ్య కాలంలో అందించిన క్యాంపర్ మోడల్‌లకు నివాళులు అర్పిస్తూ, అవుట్‌డోర్ అడ్వెంచర్‌ల కోసం కదిలే మినీ హోమ్ లా డిజైన్ చేయబడింది.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

ఈ మోటార్ హోమ్ ను నిర్మించడానికి టొయోటా టాకోమా (Toyota Tacoma) ఒరిజినల్ పికప్ ట్రక్కును కంపెనీ ఉపయోగించింది. టొయోటా బ్రాండ్ యొక్క గో-ఎనీవేర్ బ్రాండ్ వాగ్దానానికి సరైన చిహ్నం, ఇది ఓవర్‌ల్యాండింగ్ మరియు అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్టపడే కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడింది. సెమాలో ప్రదర్శించబడిన టొయోటా టాకోజిల్లా (Toyota Tacozilla) ను రూపొందించడంలో ఆ బ్రాండ్ యొక్క పెర్ఫార్మెన్స్ విభాగం అయిన టిఆర్‌డి (టొయోటా రేసింగ్ డిపార్ట్‌మెంట్) కూడా కలిసి పనిచేసింది.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

టొయోటా టాకోజిల్లా క్యాంపర్ లో ఇద్దరు వ్యక్తులు హాయిగా జీవించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇందులో పూర్తిగా ఇన్సులేట్ చేయబడిన ఇంటీరియర్‌, టేకుతో రూపొందించిన సానా-స్టైల్ ఫ్లోరింగ్, స్నానం మరియు వాష్‌రూమ్ అవసరాల కోసం షవర్‌తో కూడిన బాత్రూమ్, వంట చేసుకోవడానికి స్టవ్ మరియు రిఫ్రిజిరేటర్, అంట్లు కడుక్కోవడానికి డిష్‌వాషర్‌, భోజనం చేయడానికి డైనింగ్ రూమ్ మరియు కూర్చోవడానికి రెండు సోఫాలు కూడా ఉంటాయి.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

అంతేకాకుండా, పికప్ ట్రక్ పైభాగంలో ఇద్దరు వ్యక్తులు హాయిగా నిద్రించడానికి అవసరమైన బెడ్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో 3డి టెక్నాలజీతో ప్రింట్ చేయబడిన డైనింగ్ రూమ్, క్యాబిన్ పైన ఉంచిన స్థలంలో అమర్చిన బెడ్ మరియు రెండు సోఫాలు అన్నీ కూడా 1.83 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ క్యాంపర్ కేవలం వీకెండ్ వెకేషన్స్ కోసం మాత్రమే కాకుండా, ఆఫ్-రోడింగ్ కోసం ఉపయోగించేలా కూడా కంపెనీ డిజైన్ చేసింది.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

ఈ క్యాంపర్ లో 51 మిమీ లిఫ్ట్ కిట్, వించ్ మరియు 17 ఇంచ్ వీల్స్‌ మరియు వాటిపై ప్రత్యేకమైన ఆఫ్-రోడ్ టైర్లతో వస్తుంది. ఇందులో వాటర్ వేడింగ్ సామర్థ్యం కోసం ఎత్తులో అమర్చిన స్నార్కెల్ మరియు ప్రత్యేకంగా టిఆర్‌డి డిజైన్ చేసిన ఎగ్జాస్ట్‌ కూడా ఉంటుంది.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

ఇంజన్ విషయానికి వస్తే, టొయోటా టాకోజిల్లా క్యాంపర్, దాని పికప్ ట్రక్ వెర్షన్ మాదిరిగానే శక్తివంతమైన 3.5 లీటర్ వి6 ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 278 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

టొయోటా టాకోజిల్లా క్యాంపర్ ను ఆవిష్కరించిన సందర్భంగా, టొయోటా డివిజన్ మార్కెటింగ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ లిసా మాటెరాజో మాట్లాడుతూ, "ఓవర్‌ల్యాండింగ్ మరియు అవుట్‌డోర్ ఫన్‌ను ఇష్టపడే మా కస్టమర్ల కోసం టొయోటా గో-ఎనీవేర్ బ్రాండ్ వాగ్దానానికి టాకోజిల్లా ఒక అద్భుతమైన చిహ్నంగా నిలుస్తుంది. SEMA షో లేదా నడుస్తున్నా లేదా క్యాంప్‌సైట్ లో క్యాంపింగ్ చేస్తున్నా లేదా ఆఫ్-రోడింగ్ లో ట్రయిల్‌ చేస్తున్నా ఈ టాకోజిల్లాను మిస్ అవడం చాలా కష్టంగా అనిపిస్తుంది" అని అన్నారు.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

ఇదే విషయంపై టొయోటా మోటార్‌స్పోర్ట్స్ గ్యారేజ్ డిజైనర్ మార్టి ష్వెర్టర్ మాట్లాడుతూ, "సరిగ్గా ఇంజినీరింగ్ చేయబడి నిజంగా కూల్‌గా కనిపించేలా ఈ క్యాంపర్ ను తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యం. నా జీవితమంతా రేస్ కార్ల చుట్టూ ఉండటం, రేస్ కార్లు చూడటం చాలా బాగుంది. కానీ నేను క్యాంపర్లు కూడా చాలా కూల్ గా కనిపించాలని కోరుకుంటున్నానని" చెప్పారు. ఈ క్యాంపర్ వెహికల్ డిజైన్ లో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

టొయోటా బ్రాండ్ కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, టొయోటా భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడంపై పనిచేస్తోంది. ఇప్పటికే, ఈ బ్రాండ్ మారుతి సుజుకితో కలిగి ఉన్న ఒప్పందంలో భాగంగా బాలెనో ఆధారంగా రూపొందించిన గ్లాంజా మరియు విటారా బ్రెజ్జా ఆధారంగా రూపొందించిన అర్బన్ క్రూయిజర్ మోడళ్లను విక్రయిస్తోండగా, తాజాగా మరొక ఉత్పత్తిని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

ఇటీవల టొయటా తమ ఎంట్రీ లెవల్ సెడాన్ 'యారిస్' ను భారత మార్కెట్ నుండి తొలగించిన వేసిన నేపథ్యంలో, కంపెనీ దాని స్థానంలో మరొక కొత్త సెడాన్ ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. మారుతి సుజుకి - టొయోటా కంపెనీల మధ్య ఉన్న ఒప్పందంలో భాగంగా, సియాజ్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ ను టొయోటా బెల్టా అనే పేరుతో కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

ఇదొక కదిలే ఇల్లు... 'Toyota Tacozilla' క్యాంపర్ మోటార్ హోమ్ ఆవిష్కరణ

టొయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ (Toyota Camry Facelift)

టొయోటా బెల్టా సెడాన్ ను మాత్రమే కాకుండా, ప్రస్తుతం విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ క్యామ్రీలో కంపెనీ ఓ అప్‌డేటెడ్ వెర్షన్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. ఈ ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్‌లలో భాగంగా, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్స్ లో కూడా పలు మార్పులు ఉన్నాయి.

Most Read Articles

English summary
Toyota unveiled tacoma pickup truck based tacozilla camper details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X