ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ యారిస్ (Yaris) కోసం ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. అదృష్టవశాత్తు, ఇప్పుడు ఈ కారు మనదేశంలో లభ్యం కావడం లేదు. గడచిన సెప్టెంబర్ నెలలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ కారును భారత మార్కెట్లో డిస్‌కంటిన్యూ చేసింది.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

అయినప్పటికీ, థాయ్‌లాండ్ మరియు బ్రెజిల్‌ వంటి మార్కెట్లలో అమ్ముడవుతోంది. లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాల కోసం టొయోటా యారిస్ కారుకి లాటిన్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నిర్వహించిన క్రాష్ టెస్ట్ ఫలితాలను ఏజెన్సీ విడుదల చేసింది. ఇందులో భాగంగా, బ్రెజిల్ మరియు థాయ్‌లాండ్‌లో ఉత్పత్తి చేయబడిన టొయోటా యారిస్ ను క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించారు.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రాష్ టెస్టులో టొయోటా యారిస్ వయోజన ఆక్యుపెంట్ సేఫ్టీలో 41.43 శాతం మరియు పిల్లల ఆక్యుపెంట్ సేఫ్టీలో 63.85 శాతం స్కోరును సాధించింది. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో (యూనిట్ 2019లో పరీక్షించబడింది) మోడల్ అస్థిర నిర్మాణం మరియు అస్థిర ఫుట్‌వెల్ ఏరియా పనితీరును చూపింది.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

ఈ పరీక్షా సమయంలో సైడ్ ఇంపాక్ట్ జరిగినప్పుడు డోర్ ఓపెన్ కావడాన్ని గుర్తించారు. లాటిన్ NCAP సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో డోర్ ఓపెనింగ్, ఇది రెగ్యులేషన్ UN95 వలె అదే కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది, అంటే కారు UN95 పరీక్షలో విఫలమైందని అర్థం. పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ అండ్ వల్నరబుల్ రోడ్ యూజర్స్ టెస్ట్‌లో యారిస్ 61.63 శాతం మరియు సేఫ్టీ అసిస్ట్ టెస్ట్‌లో 41.86 శాతం స్కోరును సాధించింది.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

లాటిన్ అమెరికన్ మార్కెట్ కోసం తయారు చేయబడే యారిస్ సెడాన్ లో కంపెనీ సైడ్ బాడీ మరియు సైడ్ హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ గా అందించదు. అయితే, ఇందులోని హై-ఎండ్ వేరియంట్లలో కంపెనీ కొన్ని ఆప్షనల్ పరికాలను మరియు సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. బహుశా వీటిని టెస్ట్ చేసి ఉండే, సేఫ్టీ రేటింగ్ మరోలా ఉండే అవకాశం ఉంది. కానీ, లాటిన్ ఎన్‌క్యాప్ ఏజెన్సీ మాత్రం రెండు ఎయిర్‌బ్యాగ్స్ కలిగిన బేసిక్ వేరియంట్ ను ఎంచుకుంది.

భారతదేశంలో యారిస్ డిస్‌కంటిన్యూ.. కొత్త సెడాన్ రాబోతోంది..

టొయోటా యారిస్ (Toyota Yaris) ఈ బ్రాండ్ నుండి లభించిన అత్యంత ఆకర్షణీయమైన సెడాన్. కానీ, అమ్మకాల పరంగా ఇది అంత ప్రాచుర్యం పొందలేకపోయింది. దీంతో, కంపెనీ గడచిన సెప్టెంబర్ నెలలో ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. కాగా, యారిస్ సెడాన్ స్థానంలో టొయోటా మరో కొత్త మోడల్‌ని జనవరి 2022 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

టొయోటా నుండి రానున్న ఈ కొత్త సెడాన్ మారుతి సుజుకి అందిస్తున్న సియాజ్ (Maruti Suzuki Ciaz) సెడాన్ యొక్క రీబ్యాడ్జ్ మోడల్ గా ఉండబోతోందని సమాచారం. టొయోటా యారిస్ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ వంటి అనేక గొప్ప ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇది ప్రైవేట్ కొనుగోలుదారులలో అంతగా ప్రాచుర్యం పొందలేదు.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

టొయోటా మరియు మారుతి సుజుకి సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, మారుతి సుజుకి అందిస్తున్న కొన్ని కార్లను టొయోటా రీబ్యాడ్డ్ చేసి విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే బాలెనో ఆధారంగా రూపొందించిన గ్లాంజా మరియు విటారా బ్రెజ్జా ఆధారంగా రూపొందించిన అర్బన్ క్రూయిజర్ కార్లను టొయోటా విక్రయిస్తోంది. తాజాగా, ఇప్పుడు ఇదే తరహాలో సియాజ్ ఆధారంగా టొయోటా ఓ కొత్త సెడాన్ ను తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

ప్రస్తుతం టొయోటా విక్రయిస్తున్న రీబ్యాడ్జ్ వెర్షన్ గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ మోడళ్ల మాదిరిగానే సియాజ్ సెడాన్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ కూడా కంపెనీ మారుతి సుజుకి నుండి ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) రూపంలో కొనుగోలు చేసి, ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కొత్త పేరుతో విడుదల చేయవచ్చు.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

కారును పూర్తిగా స్క్రాచ్ నుండి తయారు చేయడం కంటే, ఇలా మారుతి సుజుకి భాగస్వామ్యంతో తయారు చేయడం లాభదాయకమని టొయోటా భావిస్తోంది. టొయోటా కొత్త సెడాన్ పేరును ఇంకా ప్రకటించనప్పటికీ, దీనిని బెల్టా అనే పేరుతో విక్రయించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సియాజ్ మరియు బెల్టా సెడాన్లలో అనేక పరికరాలు మరియు ఫీచర్లు ఒకేలా ఉండే అవకాశం ఉంది.

ఇదొక చెత్త కారు! క్రాష్ టెస్టులో Toyota Yaris కి 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ !!

బాలెనో కారుకి 0-స్టార్ సేఫ్టీ రేటింగ్.. మరి గ్లాంజా పరిస్థితి ఏంటి..?

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తయారు చేసిన బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం లాటిన్ ఎన్‌క్యాప్ ఏజెన్సీ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ కారు సున్న (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, బాలెనో ఆధారంగా టొయోటా తయారు చేస్తున్న రీబ్యాడ్జ్ వెర్షన్ గ్లాంజా కారులో సేఫ్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Most Read Articles

English summary
Toyota yaris gets 1 star safety rating in latin ncap crash test
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X