Just In
- 13 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 52 min ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 16 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- Sports
'అనుకోకుండా క్రికెటర్ అయ్యా.. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు'
- News
రూ.40 లక్షలు బిల్.. స్టార్ హోటల్లో రాజసం, లగ్జరీ కార్లు.. ఇదీ కిలేడీ కహానీ
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Movies
Naandhi 8 Days Collections: ఒక్కసారిగా పుంజుకున్న నాంది.. నరేష్ మూవీకి ఎంత లాభం వచ్చిందంటే!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!
కేంద్ర ప్రభుత్వం నిన్న 2021 మరియు 2022 బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విడుదల చేశారు. ఈ బడ్జెట్‌లో ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలు, ప్రస్తుతం ఆటో మొబైల్ పరిశ్రమపై ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రకటించబడ్డాయి. ఈ ప్రాజెక్టులలో పాత వాహనాలను నాశనం చేసే ప్రణాళిక కూడా ఉంది.

ఈ ప్రాజెక్టు ప్రకారం ప్రమాదంలో చిక్కుకుని, ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే 20 ఏళ్ల వయసుపైబడిన వ్యక్తిగత వాహనాలు మరియు 15 సంవత్సరాల వయస్సు పైబడిన కమర్షియల్ వాహనాలు పూర్తిగా నిషేదించబడతాయి. కావున ఈ వాహనాలు ఉపయోగంలో ఉండవు.
MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

అంతే కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్త వాహనాల అమ్మకాలను పెంచడానికి కొత్త వాహన సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ కారణంగా కొత్త సంస్థలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. భారతదేశంలో చాలా మంది కార్ల తయారీదారులు ఆటోమొబైల్స్ నుండి ప్రధాన భాగాలను దిగుమతి చేసుకుంటారు. వీటిని భారతదేశంలో సమీకరించి విక్రయిస్తారు.

ఈ విధంగా దిగుమతి చేసుకునే కొన్ని ప్రధాన కార్ ఉపకరణాలకు 15% కస్టమ్స్ టాక్స్ వసూలు చేస్తారు. ఇది భారతదేశంలో కార్ల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల దాదాపు అన్ని వాహనతయారీదారులు తమ వాహనాల ధరలు గణనీయంగా పెంచడం జరిగింది.
MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

చాలా లగ్జరీ కార్ మోడల్స్ భారతదేశంలో అమ్ముడవుతున్నందున ఈ కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో 2021 మరియు 2022 కేంద్ర బడ్జెట్ వాహనాల తయారీలో ఉపయోగించే స్టెయిన్లెస్ స్టీల్ పై కస్టమ్స్ టాక్స్ 7.5% తగ్గించింది.

ఇది కార్ల తయారీదారులకు ఉత్పత్తి ఖర్చులను తగ్గించటానికి వీలు కల్పించింది. అంతే కాకుండా రాబోయే కాలంలో కారు ధరలు తగ్గే అవకాశం ఉందని సూచిస్తుంది. భారతదేశంలో పెట్రోల్ మరియు డీజల్ వాహనాల వాడకాన్ని బాగా తగ్గించడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని కేంద్ర కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది.
MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

ఈ నేపథ్యంలో భాగంగానే కేంద్ర కూడా చాలా డిస్కౌంట్ ప్రకటిస్తోంది. అది మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి, దేశ వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వినియోగించే సూచనలు కనిపిస్తున్నాయి.