ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

కరోనా మహమ్మారి తర్వాత ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం ఆటో రంగం కోసం సవరించిన ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహకం (ప్రోడక్ట్ లింక్డ్ ఇన్షియేటివ్, PLI) పథకాన్ని నేడు (బుధవారం) ఆమోదించింది. దేశీయ వాహనాల తయారీ మరియు ఉపాధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హైడ్రోజన్ ఇంధన వాహనాల ఉత్పత్తిని పెంచడానికి ఆటో రంగం కోసం ప్రభుత్వం దాదాపు రూ. 26,000 కోట్ల విలువైన ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (PLI) పథకానికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ PLI పథకం ద్వారా ఆటో రంగంలో కొత్తగా 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

గత సంవత్సరం, భారత ప్రభుత్వం ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్స్ సెక్టార్ కోసం రూ. 57,043 కోట్ల వ్యయంతో ఐదు సంవత్సరాల కాలానికి గానూ ఈ పథకాన్ని ప్రకటించింది. హైడ్రోజన్ ఇంధన వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి కేంద్రీకరించడానికి క్యాబినెట్ ఈ పథకాన్ని రూ. 25,938 కోట్లకు తగ్గించింది.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

ఈ సవరించిన ప్రోడక్ట్ లింక్డ్ ఇన్షియేటివ్ స్కీమ్ కింద కవర్ చేయబడిన ఆటో కాంపోనెంట్ విభాగాలలో ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అసెంబ్లీ, సెన్సార్లు, సన్‌రూఫ్‌లు, సూపర్ కెపాసిటర్లు, అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ బ్రేకింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు కొల్లైజన్ అలెర్ట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

అయితే, గతేడాది ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్స్ సెక్టార్ కోసం ప్రకటించిన రూ. 57,043 కోట్ల బడ్జెట్ ను రూ. 25,938 కోట్లకు తగ్గించడానికి కారణాన్ని కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. కాకపోతే, ప్రభుత్వం ఇప్పుడు సాధారణ పెట్రోల్ డీజిల్ వాహనాలకు బదులుగా బ్యాటరీ పవర్ తో నడిచే ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

ఇదివరకు ఆటో ఇండస్ట్రీ బాడీ 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్' (సియామ్) ఈ పథకం ప్రకటించిన తర్వాత, పరిశ్రమలో పోటీ పెరుగుతుందని, ఇది ఖచ్చితంగా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను తదుపరి దశ వృద్ధికి నడిపిస్తుందని పేర్కొంది.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

ఇదిలా ఉండగా, ఆటోమేకర్ల ప్రోత్సాహక పథకాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత, సెప్టెంబర్ 15 బుధవారం ఆటో కాంపోనెంట్ మేకర్స్ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. ఆటోమోటివ్ యాక్సిల్ మేకర్ జమ్నా ఆటో షేర్లు తొమ్మిది శాతానికి పైగా పెరిగి మధ్యాహ్ననం నాటికి రూ. 93.70 కు చేరుకున్నాయి. కాగా, వార్రోక్ ఇంజినీరింగ్ 18 శాతం, జిఎన్‌ఏ యాక్సిల్స్ మూడు శాతం, మరియు ప్రికోల్ ఐదు శాతం మేర పెరిగాయి.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి ఆటో పరిశ్రమ, ఆటో కాంపోనెంట్ పరిశ్రమ మరియు డ్రోన్ పరిశ్రమ కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ దేశ ఉత్పాదక జిడిపిలో 35 శాతం వృద్ధికి దోహదపడుతుందని, ఇది ఉపాధి కల్పనలో ప్రముఖ రంగంగా ఉంటుందని మరియు. ప్రపంచ ఆటోమోటివ్ ట్రేడ్ లో భారతదేశ భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

PLI (పిఎల్ఐ) స్కీమ్ అంటే ఏమిటి ?

దేశీయ తయారీని ప్రోత్సహించడానికి మరియు దిగుమతులను తగ్గించడానికి, కేంద్ర ప్రభుత్వం PLI స్కీమ్ ని ప్రారంభించింది. ఆటోమొబైల్ రంగంలో దేశీయంగా తయారయ్యే పరికరాలు మరియు టెక్నాలజీని వినియోగించేలా ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీని కోసం, 2020-21 కేంద్ర బడ్జెట్‌లో, 13 పరిశ్రమ రంగాల కోసం ప్రభుత్వం 1.97 లక్షల కోట్ల రూపాయల PLI పథకాన్ని ప్రకటించింది, ఇందులో ఆటోమొబైల్ రంగానికి దాదాపు రూ. 57 వేల కోట్లు ప్రకటించారు.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించనున్న ప్రభుత్వం..

ఆటోమొబైల్ కాంపోనెంట్స్ విషయంలో చైనీస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ దిశగా భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్స్ తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ మరియు సెమీకండక్టర్ భాగాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

ఈ విషయంలో (సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ మరియు కొన్ని రకాల బ్యాటరీల) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తిగా దేశీయ మార్కెట్ పై ఆధారపడి లేదు. భారతదేశంలో తయారయ్యే వాహనాలలో ఉపయోగించే కొన్ని కీలక భాగాలను చైనా నుండి దిగుమతి చేసుకోవటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) సెక్టార్ లో ప్రపంచ అగ్రగామిగా నిలిచేందుకు చైనాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆటోమొబైల్ పరిశ్రమకు వరాల జల్లు.. పిఎల్ఐ స్కీమ్‌తో భారీ ప్రయోజనాలు

రానున్న రెండేళ్లలో బ్యాటరీల ధరలు తగ్గుతాయని, దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. దీని కోసం మనం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా దేశంలో ఆవిష్కరణ, సమర్థత మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
Union cabinet approves rs 26000 crore pli scheme for auto sector to boost production
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X