ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

భారతదేశంలో రోడ్డు నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించబడింది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఉన్న సౌకర్యాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు పేలవమైన నాణ్యతను సృష్టిస్తున్నారని గడ్కరీ ఆరోపించారు.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఇందులో ప్రధానంగా హైవేపై నిర్మించిన మరుగుదొడ్ల నాణ్యత చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేను ఏప్రిల్ 1 న సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఉన్న టాయిలెట్స్ లోపభూయిష్టంగా ఉన్న ఫోటోలను తాను చూశానని గడ్కరీ చెప్పారు.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

టాయిలెట్ నిర్మాణంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని, దానిని ఉపయోగించడానికి అనుకూలంగా లేవని గడ్కరీ చెప్పారు. కాంట్రాక్టర్ పేరు తెలియజేయడం తనకు ఇష్టం లేదని, కానీ వారిపై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

MOST READ:సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క మొత్తం పొడవు 82 కి.మీ, ఇందులో 60 కి.మీ ఎక్స్‌ప్రెస్ వే మరియు 22 కి.మీ నేషనల్ హైవే ఉన్నాయి. ఈ ప్రాజెక్టును రూ. 8,346 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ఎక్స్‌ప్రెస్‌వేలలో వాహనాల కదలికను సులభతరం చేయడానికి అంబులెన్స్, క్రేన్లు, పెట్రోల్ పంపులు, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం చాలామంది ప్రజలకు అనుకూలంగా ఉంది. ఈ నిర్మాణ ప్రారంభం తర్వాత చాలామంది ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నాణ్యమైన నిర్మాణం లేదని సామాన్య ప్రజలు కూడా ఫిర్యాదు చేస్తున్నారని గడ్కరీ చెప్పారు. ఢిల్లీ-మీరట్ రహదారి నిర్మాణంలో పాల్గొన్న కంపెనీలు తగిన సౌకర్యాలు నిర్మించడంలో విఫలమయ్యాయని, ఇది ప్రజలకు సమస్యలను కలిగిస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

MOST READ:మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఢిల్లీ నుంచి మీరట్ చేరే ప్రయాణాన్ని 2.5 గంటల నుండి కేవలం 45 నిమిషాలకు తగ్గిస్తుంది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేకు 2018 మేలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పనులు మూడు సంవత్సరాల సమయం పడుతుంది.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో మొత్తం 24 చిన్న, పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 10 ఫ్లైఓవర్లు, 3 రైల్వే బ్రిడ్జిలు, 95 అండర్‌పాస్‌లు మరియు పాదచారులకు ఎక్కువ సంఖ్యలో ఓవర్‌బ్రిడ్జిలు కూడా నిర్మించబడ్డాయి.

MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే నాలుగు వేర్వేరు దశల్లో నిర్మించబడింది. ఇది నిజాముద్దీన్ వంతెన నుండి యుపి సరిహద్దు వరకు మొదటి దశ జరిగింది. రెండవ దశ యుపి సరిహద్దు మరియు దాస్నా మధ్య, మూడవ దశ దాస్నా మరియు హాపూర్ మధ్య మరియు చివరి దశ హపూర్ మరియు మీరట్ వరకు జరిగింది.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఈ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 80 కిమీ నుండి 100 కిమీ వరకు ఉంటుంది. ప్రతి వాహనం యొక్క వేగాన్ని చూపించడానికి ప్రతి 10 కిలోమీటర్లకు డిస్ప్లే స్క్రీన్ ఏర్పాటు చేయబడింది. ప్రయాణీకులను రక్షించడానికి ఎక్స్‌ప్రెస్‌వే అంతటా 4,500 కి పైగా లైట్లు, కెమెరాలు ఏర్పాటు చేశారు.

MOST READ:స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఎక్స్‌ప్రెస్‌వేలో సైకిళ్ళు మరియు పాదచారులకోసం ప్రత్యేక ట్రాక్ కూడా ఉంది. ఎక్స్‌ప్రెస్‌వేలో ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 రోడ్ల వెంట 2.5 మీటర్ల సైకిల్ కారిడార్ మరియు 2 మీటర్ల వెడల్పు గల ఫుట్‌పాత్ ఉన్నాయి.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ తో ఫాస్టాగ్ ఆధారిత మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఏర్పాటు చేశారు. ఇది హైవేపై హై స్పీడ్ ట్రాఫిక్ ని నిర్ధారిస్తుంది.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

ప్రస్తుతం ఫాస్టాగ్ విధానం వల్ల, టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. కావున ప్రయాణికుల సమయాన్ని మరియు ఇంధనాన్ని చాలావరకు ఆదా చేయవచ్చు. అత్యవసర సమయానికి సహాయపడటానికి ఎక్స్‌ప్రెస్‌వే అంతటా ప్రత్యేక వ్యవధిలో ప్రత్యేక అత్యవసర కాల్ బాక్స్‌లు (ఇసిబిలు) వ్యవస్థాపించబడ్డాయి.

Most Read Articles

English summary
Union Transport Minister Unhappy About Poor Quality Construction In Delhi Meerut Expressway. Read in Telugu.
Story first published: Sunday, April 25, 2021, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X