2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

భారతదేశంలో 2021 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త వెహికల్స్ విడుదలయ్యాయి. అయితే ఇక ఈ సంవత్సరం చివరి నెలలో అడుగుపెట్టబోతున్నాము. కావున 2021 డిసెంబర్ నెలలో కూడా విడుదలయ్యే కొన్ని వాహనాలను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (2021 Volkswagen Tiguan):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) యొక్క కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ SUV ని విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. అయితే కంపెనీ ఈ కొత్త SUV ని 2021 డిసెంబర్ 7 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఉత్పత్తి భారతదేశంలో కూడా ప్రారంభించబడింది. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త కారును తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్ లో కూడా లిస్ట్ చేసింది మరియు ఆసక్తి ఉన్న కస్టమర్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

భారతదేశంలో ఈ జర్మన్ బ్రాండ్ తమ 'ఇండియా 2.0' స్ట్రాటజీలో భాగంగా ఈ ఫేస్‌లిఫ్టెడ్ 5-సీటర్ టిగువాన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టబోతోంది. ఈ స్ట్రాటజీలో భాగంగా, ఫోక్స్‌వ్యాగన్ భారతదేశం కోసం ప్రకటించిన నాలుగు ఎస్‌యూవీలలో కొత్త 2021 టిగువాన్ (Volkswagen Tiguan) ఫేస్‌లిఫ్ట్ కూడా ఒకటి. ఇది మునుపటి మోడల్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఫీచర్లు మరియు రీఫైన్ చేయబడిన బిఎస్6 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వస్తోంది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

కొత్త టిగువాన్ 2020లో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఈ SUV భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో ప్రారంభించిన తర్వాత, ఈ ప్రీమియం SUV రాబోయే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ టక్సన్ మరియు సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

ఆడి ఈ-ట్రాన్ జిటి (Audi e-Tron GT):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ కార్ ఆడి ఈ-ట్రాన్ జిటి (Audi e-Tron GT) ని విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త కారు యొక్క టీజర్‌ను కూడా విడుదల చేసింది. అంతే కాకుండా ఈ కారు కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా స్వీకరించడం ప్రారంభించింది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆడి ఇ-ట్రాన్ జిటి ఎలక్ట్రిక్ కారును కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు. ఆడి ఇ-ట్రాన్ జిటి ఎలక్ట్రిక్ కారుని, కంపెనీ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో విక్రయిస్తోంది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

అంతర్జాతీయ మార్కెట్‌లో Audi e-Tron GT రెండు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఈ వేరియంట్లలో స్టాండర్డ్ మరియు ఆర్ఎస్ పర్ఫామెన్స్ వంటికి ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఆడి ఇ-ట్రాన్ జిటి సెడాన్‌లో ఏ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నారనే దానిపై కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. కానీ దీనికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడవుతుంది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి (BMW iX Electric SUV):

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW, త్వరలో భారతదేశంలో BMW iX ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ సంవత్సరం చివరి నాటికి దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంటుంది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డిసెంబర్ 13న భారత మార్కెట్‌లో అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంటుంది. BMW iX ఎలక్ట్రిక్ SUV అనేది కొత్త, మాడ్యులర్, స్కేలబుల్ టూల్‌కిట్ ఆధారంగా కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి అవుతుంది, ఇది భవిష్యత్తులో రానున్న BMW మోడల్‌లకు కూడా ఆధారం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఐదవ తరం ఈ-డ్రైవ్ టెక్నాలజీని పొందుతుంది, ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. ఈ కారు 600 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది.

2021 డిసెంబర్‌లో భారత్‌లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

డిసెంబర్ నెలలో విడుదలయ్యే ఈ కొత్త కార్ల యొక్క డెలివరీలు 2022 సంవత్సరంలో డెలివరీలు చేసే అవకాశం ఉంటుంది. అయితే 2022 వ సమత్సరంలో మరిన్ని కొత్త ఉత్పత్తలు భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి ప్రజాదరణ అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Upcoming car launches december 2021 tiguan e tron gt bmw ix electric details
Story first published: Monday, November 29, 2021, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X