వచ్చే వారం మీ ముందుకు రానున్న కార్లు.. వాటి వివరాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రభావం దాదాపు చరమ దశకు చేరింది. ఈ తరుణంలో భాగంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో తమ కొత్త వాహనాలను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టాటా మోటార్స్, ఎంజి మోటార్స్ వంటి కంపెనీలు భారతీయ మార్కెట్లో కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.

అయితే మనం ఇప్పుడు ఇక్కడ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్న కొత్త కార్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

Tata Punch (టాటా పంచ్):

Tata Motors యొక్క కొత్త మైక్రో SUV Tata Punch ను ఇటీవల భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్త Tata Punch ఈ నెల 18 న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్శణీయంగా ఉంది.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

Tata Motors ఈ SUV కోసం బుకింగ్స్ కూడా అధికారికంగా ప్రారంభించింది. కావున కొనువులుదారులు కంపెనీ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 లతో బుక్ చేసుకోవచ్చు. Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

MG Astor (ఎమ్‌జి ఆస్టర్):

భారతీయ మార్కెట్లో MG Motor (ఎంజి మోటార్) యొక్క కొత్త MG Astor (ఎంజి ఆస్టర్) ను రూ. 9.78 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. కంపెనీ ఈ SUV యొక్క బుకింగ్స్ కూడా ఈ నెల 21 నుంచి అధికారికంగా ప్రారంభించనుంది. అయితే దీనికోసం మీరు ముందుగా కూడా రిజర్వ్ చేసుకోవచ్చు.

ఎంజి ఆస్టర్ నాలుగు వేరియంట్లు (స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్) మరియు ఐదు ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎంజి ఆస్టర్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16.78 లక్షలు.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎంజి ఆస్టర్ ఎస్‌యూవీని రిజర్వ్ చేసుకున్న వారు నవంబర్ మరియు డిసెంబర్‌లో డెలివరీ పొందుతారు. అయితే ప్రస్తుతం 2021 లో డెలివరీ చేయబడే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. 2022 లో ఈ వెహికల్ ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా ఇప్పుడు ఈ కొత్త SUV యొక్క మొదటి బ్యాచ్ కేవలం 3,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడే అవకాశం కూడా ఉంది.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

Volvo XC90 (వోల్వో ఎక్స్‌సి90):

Volvo India (వోల్వో ఇండియా) తన వోల్వో ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ హైబ్రిడ్ వేరియంట్‌లను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, ఇది 2021 అక్టోబర్ 19 న మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ రెండు కార్లు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో అందించబడతాయి. భారతదేశ పోర్ట్‌ఫోలియోలో వోల్వో మొదటి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్లు. వోల్వో ఎక్స్‌సి 60 ఫేస్‌లిఫ్ట్ 48 వి తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడిన 2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇవి మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.

Tata Punch, Astor & Volvo XC90 గురించి మరిన్ని వివరాలు.. మీకోసం

భారతీయ మార్కెట్లో అనేక కొత్త మోడల్స్ రానున్నాయి, ప్రస్తుతం దేశంలో ప్రారంభమైన పండుగా సీజన్ ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు మంచి అమ్మకాలతో ముందుకు వెళ్ళడానికి ఈ కొత్త మోడల్స్ ఎంతగానో ఉపయోపడతాయి. ఇప్పటికే టాటా పంచ్ మరియు ఎంజి ఆస్టర్ బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ కొత్త కార్ల డెలివరీల కోసం వేసి చూస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, October 16, 2021, 11:34 [IST]
English summary
Upcoming cars launching next week tata punch mg astor volvo xc90 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+