210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

ప్రముఖ దేశీయ యుటిలిటి వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు 'ఎక్స్‌యూవీ' (XUV) బ్రాండ్ పేరు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ బ్రాండ్ పేరుతో కంపెనీ తొలిసారిగా ఎక్స్‌యూవీ500 మోడల్ ని, ఆ తర్వాత ఎక్స్‌యూవీ300 మోడల్ ని ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ రెండు మోడళ్లు కూడా మంచి విజయాలను సాధించాయి.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

కాగా, ఇప్పుడు ఇదే బ్రాండ్ పేరుతో వచ్చిన లేటెస్ట్ మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) కూడా అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఈ మోడల్ కోసం కంపెనీకి ఇప్పటికే 50,000 యూనిట్లకు పైగా బుకింగ్ లు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఎక్స్‌యూవీ700 విజయం తరువాత, కంపెనీ ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ900 (Mahindra XUV900) పేరుతో ఓ ఫుల్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

మహీంద్రా ఈ పెద్ద ఎస్‌యూవీని ఇంటర్నల్‌గా డబ్ల్యూ620 అనే కోడ్‌నేమ్‌ తో అభివృద్ధి చేస్తోంది మరియు ఈ మోడల్ 2024 లో విక్రయించబడుతుందని భావిస్తున్నారు. మహీంద్రా ఇప్పటికే XUV900 అనే పేరును ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు కూడా చేసుకుంది. తాజా నివేదికల ప్రకారం, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ900 శక్తివంతమైన 210 బిహెచ్‌పి 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ తో వస్తుందని సమాచారం.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

మునుపటి నివేదికల ప్రకారం, మహీంద్రా నుండి రాబోయే కొత్త ఎక్స్‌యూవీ900 కూప్ స్టైల్ క్రాసోవర్‌ బాడీ టైప్ ను కలిగి ఉంటుందని వెల్లడైంది. అంతేకాకుండా, ఇది ప్రస్తుత ఎక్స్‌యూవీ700 లో ఉపయోగించిన చాలా అండర్‌పిన్నింగ్‌ లను కూడా పంచుకుంటుందని తెలుస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ900 కూప్ కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ ఏరో కాన్సెప్ట్ ప్రొడక్షన్ మోడల్ మాదిరిగానే ఉంటుందని అంచనా.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

మహీంద్రా ఎక్స్‌యూవీ ఏరో కాన్సెప్ట్ ను తొలిసారిగా 2016 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. అయితే ఆ సమయంలో కంపెనీ ఈ మోడల్ ను కనీసం 2000 యూనిట్లను 20 లక్షల రూపాయల భారీ ధరకు విక్రయించాల్సి ఉన్నందున ఈ ప్రాజెక్ట్‌ ను రద్దు చేసింది. ఆ సమయంలో, ఇది చాలా కష్టమైన విషయం. కానీ, ఇప్పుడు ఎస్‌యూవీ మార్కెట్ చాలా విస్తరించింది, ఈ విభాగంలోకి వచ్చిన అనేక కొత్త మోడళ్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

ఇటీవలి కాలంలో చిన్న ఎస్‌యూవీల నుండి ఖరీదైన ఎస్‌యూవీల వరకూ అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మహీంద్రా తమ ఎక్స్‌యూవీ900 ప్రాజెక్ట్ కు మరోసారి గ్రీన్ లైట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్‌యూవీ900 ఖచ్చితంగా మొదటి మూవర్ ప్రయోజనాన్ని పొందుతుంది ఎందుకంటే ఇది అత్యంత సరసమైన ఎస్‌యూవీ కూప్ మోడల్ అవుతుంది.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

మహీంద్రా ఎక్స్‌యూవీ900 ను బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ లైనప్ లో ఎక్స్‌యూవీ700 మోడల్ కి ఎగువన ఉంచడం జరుగుతుంది మరియు ఇది మహీంద్రా యొక్క కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ గా మారుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ ఏరో కాన్సెప్ట్, రోల్స్ రాయిస్ కార్లలో కనిపించే డోర్స్ మాదిరిగా, కోచ్ డోర్స్ మరియు ఫ్రేమ్‌లెస్ డోర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

ఎక్స్‌యూవీ900 కూప్ మోడల్ ను ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించబడే అవకాశం ఉంది కాబట్టి, ఎక్స్‌యూవీ700లో ఉపయోగించిన అనేక విడిభాగాలను, ఇంజన్ ఆప్షన్లను ఈ కూప్ మోడల్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అలాగే, కొన్ని బాడీ ప్యానెల్‌లను కూడా ఎక్స్‌యూవీ700తో పంచుకునే అవకాశం ఉంది. అయితే, ఈ రెండింటిలో ప్రధానమైన మార్పులు వాటి వెనుక భాగంలో ఉంటుంది.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

మహీంద్రా ఎక్స్‌యూవీ700 వెనుక డిజైన్ బాక్సీ టైప్ లో ఉంటే, ఎక్స్‌యూవీ900 వెనుక డిజైన్ వాలుగా క్రాసోవర్ మాదిరిగా ఉంటుంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను యూరప్‌లోని మహీంద్రా ఆటోమోటివ్ డిజైన్ యూరోప్ (M.A.D.E) స్టూడియోలో రూపొందించారు.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

మనదేశంలో ఎస్‌యూవీ కూప్ వాహనాలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో బిఎమ్‌డబ్ల్యూ మొదటిసారిగా ఎక్స్6 అని పిలువబడే కూప్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ వాహనం దాని రూపకల్పన కారణంగా మంచి ఆదరణ పొందలేకపోయింది. అలాగే, మెర్సిడెస్ బెంజ్‌ యొక్క జిఎల్‌సి కూప్, జిఎల్‌ఈ కూప్, ఆడి బ్రాండ్ యొక్క క్యూ8 కూప్ మరియు పోర్ష్ బ్రాండ్ యొక్క కయీన్ కూప్ మోడళ్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

కాగా, బిఎమ్‌డబ్ల్యూ ఇప్పుడు కొత్త తరం ఎక్స్6 అనే కూప్ మోడల్ పై పనిచేస్తోంది. మన దేశంలో టాటా మోటార్స్ కూడా ఒమేగా ప్లాట్‌ఫామ్ ఆధారంగా కొత్త ఎస్‌యూవీ కూప్ ని అభివృద్ధి చేయాలనుకుంది. టాటా మోటార్స్ ఈ కారుకి హెచ్2 అనే సంకేతనామం (కోడ్‌నేమ్) ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఎందుకో కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను వదిలివేసింది. మరి భవిష్యత్తులో ఏమైనా తిరిగి పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

కొత్త ఎక్స్‌యూవీ900 కూప్ మోడల్, ప్రస్తుత ఎక్స్‌యూవీ700 మోడల్ మాదిరిగానే అదే ఇంజన్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. కాకపోతే, దీని పవర్ ను కంపెనీ అప్‌ట్యూన్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కారులో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ట్విన్-స్క్రోల్ టర్బోచార్జర్ మరియు 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండొచ్చని సమాచారం. ఇందులోని పెట్రోల్ ఇంజన్ mStallion కుటుంబానికి చెందినది కాగా, డీజిల్ ఇంజన్ mHawk కుటుంబం నుండి వచ్చింది.

210 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్ రానున్న సరికొత్త Mahindra XUV900

డీజిల్ ఇంజన్ల విషయంలో ఎమ్‌హాక్ తర్వాత, మహీంద్రా కొత్త డీజిల్ ఇంజన్‌లను అభివృద్ధి చేయడం ఆపివేస్తుందని సమాచారం. వాటి స్థానంలో మరింత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లు మరియు పెట్రోల్ ఇంజన్‌ ల అభివృద్ధి పై మాత్రమే కంపెనీ దృష్టి సారిస్తుందని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Upcoming mahindra xuv900 to get 210 bhp diesel powertrain details
Story first published: Friday, October 15, 2021, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X