భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

ఒకప్పుడు మనదేశంలో సెడాన్ కార్లదే పైచేయిగా ఉండేది. అయితే, కార్ల విషయంలో కస్టమర్ల ఆసక్తి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. యువత ఎక్కువగా హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీ టైప్ కార్లను ఇష్టపడుతుండటంతో, సెడాన్లకు ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో కార్ మేకర్లు కూడా ఇప్పుడు ఎక్కువగా ఎస్‌యూవీ టైప్ కార్లపైనే దృష్టి సారించారు.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీ పరిమాణం భారీగా పెరిగింది. ప్రస్తుతం, మార్కెట్లో 4-సీటర్ నుండి 9-సీటర్ కాన్ఫిగరేషన్ వరకూ వివిధ రకాల ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. వాటి పరిమాణాన్ని బట్టి ఈ ఎస్‌యూవీలను మైక్రో, సబ్-కాంపాక్ట్, కాంపాక్ట్, మిడ్-సైజ్ మరియు ఫుల్-సైజ్ ఎస్‌యూవీలుగా విభజించారు. ఈ విభాగంలో కార్ కంపెనీల వ్యాపారం కూడా జోరుగానే సాగుతోంది. అయితే, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మళ్ళీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

వచ్చే ఏడాదిలో భారత మార్కెట్లో అనేక కొత్త సెడాన్ కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. నిజానికి సెడాన్ కార్లు చూడటానికి చాలా క్లాసీగా, లగ్జరీ అప్పీల్‌ను ఇస్తాయి. అయితే, వీటి పొడవాటి బాడీ డిజైన్ కారణంగా, కొత్తగా తొలిసారి కారును కొనే వారు సెడాన్ కార్లను ఎంచుకోవడం లేదని తెలుస్తోంది. వాటికి, బదులుగా చిన్నగా మరియు సిటీ రోడ్లపై లేదా పల్లె ప్రాంతాల్లో సులువుగా నడపడానికి వీలుండే హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ వంటి కార్లను కొనుగోలు చేస్తున్నారు.

వచ్చే ఏడాది మార్కెట్లో సందడి చేయనున్న ఆ సరికొత్త సెడాన్ కార్ల వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

1. స్కోడా ​​స్లావియా (Skoda Slavia)

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో నుండి రానున్న మిడ్-సైజ్ సెడాన్ స్కోడా స్లావియా. ఇది ప్రస్తుత స్కోడా రాపిడ్ సెడాన్ మోడల్‌ కు ప్రత్యామ్నాయంగా కానీ లేదా దానికి ఎగువన ప్రీమియం సెడాన్ గా కానీ కంపెనీ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సెడాన్ భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు ఇది స్కోడా రాపిడ్ సెడాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇది వచ్చే ఏడాది (2022) లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

స్కోడా ర్యాపిడ్ సెడాన్ ను కంపెనీ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకోనుంది. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా స్కోడా నుండి వస్తున్న రెండవ ఉత్పత్తి ఇది. స్కోడా స్లావియా సెగ్మెంట్‌లో కెల్లా పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది, ఫలితంగా ఈ కారులో మెరుగైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా, కంపెనీ ఈ సెడాన్ ను అనేక లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురానుంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

2. ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ (Volkswagen Virtus)

స్కోడా భాగస్వామి అయిన జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా భారత మార్కెట్లో ఓ కొత్త సెడాన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశీయ మార్కెట్లో దాదాపు 10 ఏళ్లుగా విక్రయించబడుతున్న ఫోక్స్‌వ్యాగన్ వెంటోకు ప్రత్యామ్నాయంగా కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ అనే సెడాన్ ను ప్రవేశపెట్టనుంది. భారతదేశం కోసం స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న MQB-A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ వర్చుస్ సెడాన్ రూపుదిద్దుకోనుంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

స్కోడా స్లావియా మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ రెండూ సెడాన్లు కూడా ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారు కానున్న నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించే ఇంజన్లు, పరికరాలు మరియు లభించే ఫీచర్లలో చాలా సారూప్యతలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే, ఈ రెండు కంపెనీలు తయారు చేసిన స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలు ఇదే స్ట్రాటజీపై రూపొందిన సంగతి తెలసినదే. ఈ కారు కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

3. హోండా సిటీ హైబ్రిడ్ (Honda City Hybrid)

జపనీస్ కార్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో తమ సిటీ సెడాన్ కారును రెండు జనరేషన్ మోడళ్లలో విక్రయిస్తోంది. వీటిలో ఒకటి ఫేస్‌లిఫ్ట్ కు ముందు వచ్చిన 4వ తరం మోడల్ మరియు రెండవది ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన 5వ తరం మోడల్. సరసమైన ధరకే సిటీ కారును విక్రయించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ 4వ తరం మోడల్ అమ్మకాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ మోడల్ చాలా పరిమిత వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

కాగా, కొత్తదనం కోరుకునే కస్టమర్ల కోసం కంపెనీ తమ 5వ తరం సిటీ సెడాన్ ను అందిస్తోంది. ఈ సెడాన్ ఆధారంగా కంపెనీ ఇందులో ఓ హైబ్రిడ్ వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త హోండా సిటీ హైబ్రిడ్ సెడాన్ 2022 మధ్యలో విడుదల కావచ్చని అంచనా. సిటీ హైబ్రిడ్ సెడాన్‌లో 1.5-లీటర్, స్టార్టర్ జనరేటర్ (ISG) అట్కిన్సన్-సైకిల్ పెట్రోల్ ఇంజన్ మరియు ఓ ఎలక్ట్రిక్ మోటారు ఉంటాయి. ఈ హైబ్రిడ్ సెటప్‌తో, కొత్త హోండా సిటీ సెడాన్‌ను పూర్తి EV (ఎలక్ట్రిక్) మోడ్‌లో కొన్ని కిలోమీటర్ల దూరం నడపవచ్చు.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

4. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ (Mercedes-Benz C-Class)

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ విక్రయిస్తున్న సి-క్లాస్ సెడాన్ లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ బ్రాండ్ తమ ఆరవ తరం మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెడాన్ ను గత ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ కారులో చేసిన అతి ముఖ్యమైన అప్‌డేట్స్ లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా, సరికొత్త హెడ్‌లైట్స్ డిజైన్ మరియు 25 అదనపు పొడవుతో కూడిన వీల్ బేస్ మొదలైనవి ఉన్నాయి.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

అంతేకాకుండా, కంపెనీ ఈ కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారులో బటన్ల సంఖ్యను కూడా తగ్గించబడింది. ఇప్పుడు ఈ కారులోని టెంపరేచర్ కంట్రోల్ తో సహా కొన్ని ఫీచర్లు టచ్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. అయితే, ఇందులో దాని మునుపటి తరం మోడల్ మాదిరిగానే, ఏఎమ్‌జి (AMG) పెర్ఫార్మెన్స్ వేరియంట్ కూడా భారతదేశంలో ప్రారంభించబడనుంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ కారు ధర సుమారు రూ. 45 లక్షల నుండి రూ. 55 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

5. టొయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ (Toyota Camry Facelift)

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ క్యామ్రీలో కంపెనీ అప్‌డేటెడ్ వెర్షన్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి, క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్ కారు లైఫ్‌టైమ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్‌తో గతేడాది అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. ఈ ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్‌లలో భాగంగా, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త సెడాన్లు: సిటీ హైబ్రిడ్ నుండి ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ వరకూ..

ఇంటీరియర్స్ లో 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో పాటు అనేక ఇతర అప్‌గ్రేడ్స్ ను కూడా మనం ఆశించవచ్చు. ఈ కారులో కేవలం కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. వచ్చే ఏడాది (2022) మధ్యలో టొయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో ఇది సుమారు రూ. 40 లక్షల ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Upcoming sedans in india honda city hybrid to volkswagen virtus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X