కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

ఈ ఏడాది టాటా పంచ్ కారుతో చిన్న కార్లకు గట్టి పంచ్ ఇచ్చిన టాటా మోటార్స్ వచ్చే ఏడాది కూడా అనేక కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేయనుంది. డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గడం మరియు కొత్త కాలుష్య నిబంధనల వలన వాటి తయారీ ఖర్చు కూడా పెరగడంతో, టాటా మోటార్స్ కొత్త సంవత్సరంలో ప్రధానంగా సిఎన్‌జి కార్ల తయారీపై దృష్టి పెట్టబోతోంది. కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో కొత్తగా సిఎన్‌జి వేరియంట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని ఇతర మోడళ్లను కూడా టాటా మోటార్స్ 2022లో మనకు పరిచయం చేయబోతోంది. అవేంటో తెలుసుకుందాం రండి.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

1. టాటా సఫారీ మరియు హారియర్ పెట్రోల్ (Tata Safari and Tata Harrier Petrol Versions)

టాటా మోటార్స్ ఈ ఏడాది మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త మోడళ్లలో టాటా సఫారీ ఎస్‌యూవీ కూడా ఒకటి. పాత తరం సఫారీ పేరును తీసుకొని, కొత్త తరం హారియర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ రూపొందించిన 7-సీటర్ సఫారీ ఎస్‌యూవీ మార్కెట్లో మంచి సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈ మోడల్ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తోంది. కాగా, కంపెనీ ఇందులో ఓ కొత్త పెట్రోల్ వెర్షన్ ను కొత్త సంవత్సరంలో విడుదల చేసే అవకాశం ఉంది.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

సఫారీతో పాటుగా టాటా హారియర్ మోడల్ లో కూడా కంపెనీ ఓ పెట్రోల్ ఇంజన్ ను పరిచయం చేయనుంది. టాటా మోటార్స్ తమ పెట్రోల్ వెర్షన్ హారియర్ మరియు సఫారీ ఎస్‌యూవీలను భారత రోడ్లపై పరీక్షిస్తున్నట్లు సమాచారం. 2022లో ఈ రెండు ఎస్‌యూవీలు కొత్త పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి రానున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికల కోసం చూస్తున్న వినియోగదారులకు హారియర్ మరియు సఫారిలో కొత్త పెట్రోల్ ఇంజన్ ఎంపిక అందించబడుతుంది.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

అయితే, ఈ రెండు SUV లలో ఏ రకమైన పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడుతుందనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం, వీటిలో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని మాత్రం తెలుస్తోంది. కంపెనీ దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. డీజిల్ మోడళ్ల మాదిరిగానే ఈ పెట్రోల్ ఇంజన్ కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల కావచ్చని సమాచారం.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

2. టాటా పంచ్ సిఎన్‌జి (Tata Punch CNG)

చిన్న కారు మార్కెట్లో పంచ్ తో పెద్ద ధమాకా సృష్టించిన టాటా మోటార్స్ కొత్త సంవత్సరంలో ఈ కారును సిఎన్‌జి రూపంలో తీసుకువచ్చే అవకాశం ఉంది. టాటా పంచ్ ఇప్పటికే దాని సరసమైన ధర మరియు విశిష్టమైన డిజైన్ కారణంగా వినియోగదారుల నుండి గొప్ప ఆదరణను పొందుతోంది. అయితే, దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, మైలేజీకి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల కోసం కంపెనీ ఈ కారులో ఓ CNG వేరియంట్ ను తీసుకురావాలని యోచిస్తోంది.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

టాటా పంచ్ యొక్క CNG వేరియంట్ ఇటీవల టెస్టింగ్ దశలో కనిపించింది. కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్ ప్రవేశపెట్టబోయే సిఎన్‌జి మోడళ్లలో Tigor మరియు Tiago లు కూడా ఉన్నాయి. ముందుగా ఇవి రెండూ మార్కెట్లోకి రానున్నాయి. ఆ తర్వాతి సిఎన్‌జి వెర్షన్ టాటా పంచ్ విడుదలయ్యే అవకాశం ఉంది. టాటా పంచ్ ప్రస్తుతం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. ఇది గరిష్టంగా 86 Bhp శక్తిని మరియు 113 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

3. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ (Tata nexon EV Facelift)

టాటా మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈవీలో కూడా కంపెనీ ఓ అప్‌డేటెడ్ వెర్షన్ ను కొత్త సంవత్సరంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ 2022 మధ్య భాగం నాటికి మార్కెట్లోకి విడుదల చేయబడుతుందని సమాచారం. కొత్త రిఫ్రెష్డ్ Tata Nexon EV పెద్ద బ్యాటరీ మరియు పెరిగిన రేంజ్‌తో వస్తుందని సమాచారం. లాంగ్ రేంజ్ కోసం టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఈవీలో పెద్ద 40kWh బ్యాటరీని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

ఈ కొత్త లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీని ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న స్టాండర్డ్ Nexon EV తో పాటుగా విక్రయించే అవకాశం ఉంది. టాటా నెక్సాన్ EV యొక్క విజయానికి ప్రధాన కారణం, దాని ధరకు తగిన విలువగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కంపెనీ ఈ కారులో చిన్న బ్యాటరీ (30.2kWh) ప్యాక్ ని మాత్రమే అందిస్తోంది. ఫలితంగా, ఇది మన మార్కెట్‌లోని చాలా ఎలక్ట్రిక్ కార్ల కంటే తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి కొత్త అప్‌డేటెడ్ నెక్సాన్ ఈవీ చక్కటి ఆప్షన్ గా ఉంటుంది.

కొత్త సంవత్సరంలో Tata Motors నుండి కొత్తగా రాబోయే కార్లు..

4. టాటా టియాగో మరియు టిగోర్ సిఎన్‌జి (Tata Tiago and Tigor CNG Variants)

టాటా మోటార్స్ చాలా కాలంగా దేశంలో CNG మోడళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొత్త టాటా టియాగో మరియు టిగోర్ యొక్క CNG ఆధారిత మోడళ్లు అనేక సందర్భాల్లో భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించబడ్డాయి. టాటా మోటార్స్ యొక్క డీలర్‌షిప్‌లు కూడా ఈ రెండు CNG వేరియంట్‌ల కోసం బుకింగ్ లను స్వీకరించడం కూడా ప్రారంభించాయి. టాటా టియాగో మరియు టిగోర్ యొక్క CNG వేరియంట్‌లు జనవరి 2022 మధ్యలో లేదా చివరి నాటికి విడుదల చేయబడుతాయని సమాచారం.

Most Read Articles

English summary
Upcoming tata cars in 2022 details tiago tigor punch cng models and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X