టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్ కోసం 'హెచ్‌బిఎక్స్' అనే కోడ్‌నేమ్‌తో ఓ మినీ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఈ టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూ టెస్టింగ్‌లో ఉండగా కెమెరాకు చిక్కింది. ఈ స్పై చిత్రాలలో ఇందులోని ఇంటీరియర్ డీటేల్స్ వెల్లడయ్యాయి.

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

తాజాగా, లీకైన టాటా హెచ్‌బిఎక్స్ స్పై చిత్రాలను గమనిస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు బదులుగా డబులు డిన్ మ్యూజిక్ సిస్టమ్‌ను ఉపయోగించారు. దీనిని బట్టి చూస్తుంటే, ఈ టెస్టింగ్ వాహనం మిడ్-లెవల్ వేరియంట్‌గా తెలుస్తోంది.

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

ఇందులో ఆడియో సిస్టమ్ కోసం స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్‌ కూడా ఉన్నాయి. అలాగే, అన్ని డోర్లపై పవర్ విండోస్ కూడా ఉన్నాయి. అయితే, ఇందులో క్రూయిజ్ కంట్రోల్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. టాటా హెచ్‌బిఎక్స్‌లో ముందు మరియు వెనుక సీట్ల కోసం సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఫీచర్ కూడా అందుబాటులో లేదు.

MOST READ:కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

ఈ లేటెస్ట్ స్పై చిత్రాలలో టాటా హెచ్‌బిఎక్స్ యొక్క ఏసి వెంట్లలో పియానో-బ్లాక్ ఇన్సర్ట్‌లు మరియు ఏ పిల్లర్‌లో అమర్చిన ట్వీటర్లు ఉన్నాయి. ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్‌ను కూడా పియానో ​​బ్లాక్‌లో ఫినిష్ చేయబడి ఉన్నాయి.

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

ఇవి చూడటానికి టాటా అల్ట్రోజ్‌లోని డిజైన్లకు సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. వెనుక సీట్లలోని హెడ్‌రెస్ట్‌లు సర్దుబాటు కావు, కానీ ఇందులో బూట్ స్పేస్ కోసం ప్రత్యేకంగా పార్శిల్ ట్రే లభిస్తుంది.

MOST READ:లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

టాటా హెచ్‌బిఎక్స్ ఎక్స్టీరియర్ డిజైన్‌కు సంబంధించినంతవరకు, మునుపటి స్పై చిత్రాలు మరియు వీడియోలు అనేక సూచనలు ఇస్తాయి. ఇందులో నిటారుగా ఉండే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను మరియు ట్రై యారో డిజైన్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్‌ను కూడా గమనించవచ్చు.

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

ఈ వాహనంలో ప్రత్యేకమైన డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. వెనుక వైపు డోర్ హ్యాండిల్స్ సి-పిల్లర్‌లో కలిసిపోయినట్లుగా ఉంటాయి. ఇంకా ఇందులో పదునైన ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ కూడా ఉంటుంది.

MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

వీటికి అదనంగా, టాటా హెచ్‌బిఎఖ్స్ క్రాస్ఓవర్ అప్పీల్‌ను మరింత పెంచడానికి దాని చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ కూడా ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికొస్తే, టియాగో, టిగోర్ మరియు ఆల్ట్రోజ్ (నాన్-టర్బో) వాహనాల్లో ఉపయోగించే అదే 1.2-లీటర్ పెట్రోల్ న్యాచురల్ ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించే అవకాశం ఉంది.

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

ఈ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్‌లో కంపెనీ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ:ఆటోపైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

టాటా హెచ్‌బిఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్!

టాటా హెచ్‌బిఎక్స్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన తర్వాత దీనిని 'హార్న్‌బిల్' అనే పేరుతో విక్రయించే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి ఇగ్నిస్, మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి మరియు ఫోర్డ్ ఫ్రీస్టైల్ వంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది.

Source: GaadWaadi

Most Read Articles

English summary
Upcoming Tata HBX Compact SUV Interiors Revealed In Spy Pics, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X