Just In
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- News
కరోనాతో ఏపీ సచివాలయ ఉద్యోగి మృతి... మిగతా ఉద్యోగుల్లో భయాందోళన...
- Movies
రిలీజ్‌కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- Sports
రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే
కరోనా మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాహదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది, కావున వాహనదారుల యొక్క డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్‌సి మొదలైన డాక్యుమెంట్స్ యొక్క గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాధారణంగా ఈ గడువు 2021 మార్చి 31తో ముగుస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అందించిన ఉత్తర్వుల మేరకు ఈ గడువు ఇప్పుడు 2021 జూన్ 30 వరకు పొడిగించింది. ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్లకు ఈ పొడిగింపు వర్తిస్తుందని రవాణ శాఖ పేర్కొంది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ పొడిగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మార్చి 30, జూన్ 9, ఆగస్టు 24, డిసెంబర్ 27 అని డాక్యుమెంట్ పొడిగింపు జరిగింది. ఇప్పుడు మరో సారి కూడా వాహనదారులు ఈ సౌలబ్యాన్ని అందించడం జరిగింది.
MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

మోటారు వాహన చట్టం 1988 మరియు సెంట్రల్ వెహికల్ రూల్స్ 1989 కింద ఉన్న అన్ని పత్రాలకు అవకాశం ఇవ్వబడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, దీని కారణంగా అనేక ప్రభుత్వ రవాణా కార్యాలయాలు మూసివేయవలసిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో ప్రజల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోబడింది.

వాహదారులు కరోనా చెందవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో పాటు ఆన్‌లైన్ రెన్యూవల్ ఆప్సన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఉత్తర్వును అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
MOST READ:భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా, మీరు డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పుడు మీదగ్గరే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల, రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు డిజిటల్ రూపంలో కూడా చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు తీసుకుంది.

డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రం ఇప్పుడు ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవచ్చు. పోలీసులు తనిఖీ చేసేటప్పుడు లేదా అవసరమైనప్పుడు ట్రాఫిక్ పోలీసులకు వీటిని చూపించవచ్చు. అంటే, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ డాక్యుమెంట్ ఎంపి ట్రాన్స్‌పోర్ట్ లేదా డిజిలాకర్ అప్లికేషన్‌లో స్టోర్ చేసుకున్నట్లయితేనే ఇది చెల్లుబాటు అవుతుంది.
MOST READ:మీకు తెలుసా.. మారుతి సుజుకి బాలెనోతో 22 గంటల్లో 1,850 కిమీ ప్రయాణం.. కొత్త రికార్డ్ కైవసం

వాహననానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ విధంగా కాకుండా, మరేదైనా డిజిటల్ రూపంలో ఉంచితే, అవి చెల్లుబాటు కాదు. దేశంలో చాలా చోట్ల వెహికల్ డాక్యుమెంట్స్ ప్రింట్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురవుతున్నారని ఇటీవల చాలా ప్రాంతాల నుండి వార్తలు వచ్చాయి.

ఇటువంటి సమస్యను నివారించడానికి డిజిలాకర్ అమలులోకి వచ్చింది. ఇందులో సేవ్ చేసిన డాక్యుమెంట్స్ పూర్తిగా చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. కావున వాహనదారులు దీనిని వినియోగించుకోవచ్చు.
MOST READ:కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు