Just In
- 51 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 17 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పాత వాహనాలను స్క్రాప్ చేస్తే ఇన్సెంటివ్స్; త్వరలోనే నోటిఫికేషన్
దేశంలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలను స్క్రాప్ చేయాలాని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసినదే. ఇందుకు సంబంధించి స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానాన్ని కేంద్రం ఇటీవలి బడ్జెట్‌లో కూడా ప్రస్థావించింది.

ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రభుత్వ రంగంలో ఉపయోగించే 15 ఏళ్లకు పైబడిన వాహనాలను ప్రభుత్వమే స్వయంగా స్క్రాప్ చేస్తుంది. అయితే, ప్రైవేట్ రంగంలో మాత్రం 15 ఏళ్లకు పైబడి వాహనాలను ఆ తర్వాత కూడా ఉపయోగించాలనుకుంటే, కస్టమర్లు భారీ మొత్తంలో పన్నులను చెల్లించాల్సి రావచ్చు.

అందుకనే, వారి కోసం స్వచ్ఛంద స్క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత వాహనాలను ఉపయోగించే కస్టమర్లు తమ వాహనం పదిహేనేళ్లకు పైబడినది అయితే, వారే స్వచ్ఛంగా స్క్రాప్ చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం కొంత మేర ఇన్సెంటివ్‌ను కుడా సదరు వాహన యజమానికి అందజేయనుంది.
MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

భారతదేశంలో వెహికల్ స్క్రాపింగ్ కోసం విదేశాలలో అందుబాటులో ఉన్నట్లుగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన మెషినరీని కూడా ఇక్కడి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం పాత వాహనాలను స్క్రాపింగ్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాల గురించి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రాబోయే రెండు, మూడు వారాల్లో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా విడుదల చేయవచ్చని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
MOST READ:భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

ఇటీవల దాఖలు చేసిన ఫెడరల్ బడ్జెట్‌లో కూడా పాత వాహనాల స్క్రాపింగ్ విధానాన్ని ప్రకటించారు. దీనిని కంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే తెలిపారు.

గిరిధర్ అరమనే నిన్న (ఫిబ్రవరి 5) న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పాత వాహనాల స్క్రాపింగ్ విధానం కింద రాయితీలను ఖరారు చేసే పని జరుగుతోందని ఆయన అన్నాయిత. అయితే, ఆ రాయితీలు ఏమిటనే విషయాన్ని మాత్రం ఆయన తెలుపలేదు.
MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

ఇలాంటి వాహనాల విషయంలో వ్యక్తిగత వినియోగ వాహనాలపై రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును మరియు వాణిజ్య వాహనాలపై ఎఫ్‌సి (ఎఫ్‌సి - ఫిట్‌నెస్ సర్టిఫికేషన్) ఫీజును కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే పాత వాహనాలను రహదారిపై నడపకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది.

పాత వాహనాలు పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేయటమే కాకుండా, వాటి విషయంలో భద్రత కూడా ప్రధాన సమస్యగా ఉంటుందని గిరిధర్ అరమనే అన్నారు. పాత వాహనాల్లో ఎయిర్‌బ్యాగులు, సీట్ బెల్ట్‌లు వంటి ప్రామాణిక భద్రతా పరికరాలు ఉండవని, అయితే ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న కొత్త వాహనాలలో ఎయిర్‌బ్యాగులు, సీట్ బెల్ట్‌లు వంటి వివిధ భద్రతా పరికరాలను చేర్చడం ప్రభుత్వం తప్పనిసరి చేసిందని ఆయన గుర్తు చేశారు.
MOST READ:తండ్రి దూరమయ్యాక జ్ఞాపకార్థం హార్దిక్ పాండ్యా పంచుకున్న వీడియో, ఇదే

పాత వాహనాలను స్క్రాపింగ్ చేయటం వలన పర్యావరణం మెరుగుపడుతుంది మరియు రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా, కొత్త వాహనాల వినియోగం పెరుగుతుంది. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్న తరుణంలో కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా పలు రాయితీలను అందిస్తోంది.
గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే.