ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

టోల్ ప్లాజాల వద్ద వాహనాల టోల్ ఫీజు చెల్లించడానికి ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. ఫాస్ట్‌ట్యాగ్ అనేది టోల్ ప్లాజాల్లో నగదు లేకుండా డిజిటల్ లావాదేవీలు జరపడానికి అనుమతిస్తుంది. ఈ విధానం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది వాహనాల యొక్క ఇంధనాన్ని కూడా ఆదా చేయడానికి అనుమతిస్తుంది.

ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

ఈ కారణంగా, ద్విచక్ర వాహనాలు మినహా అన్ని వాహనాలపై ఫాస్ట్‌ట్యాగ్‌ను స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఆదేశించింది. అన్ని వాహనాలు ఫిబ్రవరి 15 నుంచి తప్పని సరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

నివేదికల ప్రకారం ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవడానికి 2021 జనవరి 01 చివరి తేదీగా ప్రకటించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అన్ని వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవడానికి కుదరకపోవడంతో, కేంద్రం ఆ గడువును కాస్త ఫిబ్రవరి 15 కి పొడిగించింది. కేంద్రం ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోయింది.

MOST READ:ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ ప్లాజా గుండా వెళ్లే వాహనాలు రెట్టింపు టోల్ ఫీజు రెట్టింపు చెల్లించాలి. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ ప్లాజా గుండా వెళ్లే వాహనాలకు ఇప్పుడు రెండింతలు వసూలు చేయాలని నిర్ణయించారు. టోల్ ప్లాజాలలో వాహనాల రాకపోకలను తగ్గించడానికి మరియు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరి చేసింది. ఫాస్ట్‌ట్యాగ్‌లు వాహనాలను వేగంగా టోల్ చెల్లించడానికి వీలు కల్పిస్తాయి.

ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

నేషనల్ హైవే అథారిటీ గత కొన్ని నెలలుగా ఫాస్ట్‌ట్యాగ్ వాడకంపై ప్రచారం చేస్తోంది. ఫలితంగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సంఖ్య 2 కోట్లకు పైగా చేరింది. 75% వాహనాలు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లిస్తున్నాయి. వాటిని మొత్తం 100% కి తీసుకురావడానికి ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు టోల్ రేట్లు రెట్టింపు చేయబడ్డాయి.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

టోల్ ప్లాజాలోని నగదు చెల్లింపులు ఇప్పుడు తొలగించబడతాయి. టోల్ ప్లాజాల వద్ద నగదు ఇకపై ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ ప్లాజాలో ప్రవేశించే వాహనాలకు డబుల్ ఛార్జీ వసూలు చేయబడుతుంది. ఈ కఠినమైన నిబంధనలు ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌లను నియమించబడిన బ్యాంక్ ద్వారా మరియు ఆన్‌లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్ రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో కూడిన స్టిక్కర్. దీనికి కూడా మొబైల్ మాదిరిగానే రీఛార్జ్ చేయాలి. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనం టోల్ ప్లాజాను దాటినప్పుడు, ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్నుంచి ఆటోమాటిక్ గా అమౌంట్ తీసుకోబడుతుంది.

MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడం వల్ల టోల్ ప్లాజా వద్ద వాహనాలు వేచి ఉండవలసిన సమయం తగ్గుతుంది, తద్వారా ఇంధనం కూడా ఆదా చేయబడుతుంది. కరోనా నేపథ్యంలో ఈ డిజిటల్ లావాదేవీల కారణంగా సామాజిక దూరంకూడా పాటించినట్లు ఉంటుంది. ఏది ఏమైనా ఫాస్ట్‌ట్యాగ్ వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Vehicles Without Fastag To Pay Double Toll Fees From Today. Read in Telugu.
Story first published: Tuesday, February 16, 2021, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X