వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

భారతదేశంలో పాత కార్ల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత, పురాతన (వింటేజ్) కార్ల కోసం పాలసీ యొక్క తుది ముసాయిదాకు న్యాయ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ కొత్త ముసాయిదా విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది, అనంతరం దానిని చట్టంగా రూపొందించడం జరుగుతుంది.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

పురాతన కార్ల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్లను కేటాయించేందుకు కొత్త నియమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రతిపాదిత విధానం వలన పాతకాలపు కార్ల యజమానులకు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. పురాతన వాహనాల యజమానులు ఈ కార్లను స్క్రాపేజ్ విధానం నుండి మినహాయించాలని చేసిన డిమాండ్స్ ఫలించాయి.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

మనదేశంలో 50 ఏళ్లు పైబడిన కార్లను మాత్రమే పాతకాలపు వాహనాలుగా (వింటేజ్ వెహికల్స్)గా పరిగణిస్తారు. కొత్త విధానం ప్రకారం, ఇలాంటి పురాతన వాహనాలను పబ్లిక్ రోడ్లపై ఇతర కార్ల మాదిరిగా క్రమం తప్పకుండా ఉపయోగించలేరు.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

ఈ కొత్త నిబంధనలు, పాతకాలపు కారు యజమానులకు తమ ప్రత్యేక వాహనాలను ప్రత్యేకమైన సందర్భాలలో లేదా ప్రత్యేకమైన సమయంలో మాత్రమే బయటకు తీసుకురావడానికి అనుమతిస్తాయి. అలాగే, ఈ కొత్త నిబంధనలు పాతకాలపు కార్లను వాణిజ్య వాహనాలుగా ఉపయోగించడాన్ని కూడా పరిమితం చేస్తాయి.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

అంటే, ఇకపై పురాతన (వింటేజ్) కార్లను వివాహాలు వంటి సందర్భాల్లో ఉపయోగించడం లేదా అద్దెకు ఇవ్వడం కూడా జరగదు. పాత కార్ల యజమానులు ఈ రెండు పరిమితులకు లోబడి తమ వాహనాలను ఉపయోగించుకోవచ్చు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే, సదరు కారు యజమానిపై ప్రభుత్వం చట్ట పరంగా చర్యలు తీసుకుంటుంది.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

అదే సమయంలో, అన్ని పురాతన కార్లకు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ ప్లేట్లు లభిస్తాయి. అయితే, ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల నుండి ఎలా భిన్నంగా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. ఇది చట్టంగా మారిన తర్వాత అధికారులు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించే అవకాశం ఉంది.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, పాతకాలపు కారు యజమాని తన వాహనం యొక్క పాత సంఖ్యను ఇప్పటికే రిజిస్టర్ చేయబడితే దానిని నిలుపుకోగలుగుతారు, లేదా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పాతకాలపు కారును రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకుంటే వారి పురాతన వాహనానికి కొత్త మరియు ప్రత్యేకమైన VA సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వబడం జరుగుతుంది.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

రిజిస్ట్రేషన్ మార్క్ యొక్క ఫార్మాట్ 'XX VA YY ****' మాదిరిగా ఉంటుంది. ఇందులో VA అంటే పాతకాలపు అని, XX అనేది స్టేట్ కోడ్‌ను, YY అనేది రెండు అక్షరాల సిరీస్‌ను మరియు '****' అనేది స్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కేటాయించిన 0001 నుండి 9999 వరకు గల సంఖ్యలలో ఒక దానిని సూచిస్తుంది.

వింటేజ్ కార్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్స్; పనికిరాని పాత వాహనాలు స్క్రాప్!

పురాతన వాహనాలను కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం రూ.20,000 ఫీజు వసూలు చేయనున్నారు. ఆ తదుపరి రీ-రిజిస్ట్రేషన్ కోసం రూ.5,000 ఖర్చు అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ 10 సంవత్సరాల కాలానికి చెల్లుతుంది. పాతకాలపు కార్ల నమోదు కోసం అన్ని దరఖాస్తులు ప్రభుత్వ 'పరివహన్' పోర్టల్‌లో అనుమతించబడతాయి.

Most Read Articles

English summary
Vintage Cars In India To Get New Special Registration Plates, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X