విడుదలకు ముందే 10,000 బుకింగ్స్ స్వీకరించిన Volkswagen Taigun; ఎందుకింత డిమాండ్
ప్రముఖ జర్మన్ కార్ తయారీ సంస్థ Volkswagen (ఫోక్స్‌వ్యాగన్) భారతీయ మార్కెట్లో తన Volkswagen Taigun (ఫోక్స్‌వ్యాగన్ టైగన్) 2021 సెప్టెంబర్ 24 న విడుదలచేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే కంపెనీ ఇప్పటికే Taigun యొక్క ప్రీ-బుకింగ్‌లను కూడా అధికారికంగా ప్రారంభించింది. కంపెనీ ఈ కొత్త Taigun విడుదలకు ముందే దాదాపు 10,000 బుకింగ్లను స్వీకరించినట్లు తెలిసింది.

Volkswagen కంపెనీ తన కొత్త Taigun SUV ని నెలకు 5,000 నుంచి 6,000 వరకు విక్రయించాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ తన నెట్ వర్క్ విస్తరిస్తోంది. ఇప్పుడు కొత్త Taigun కంపెనీ యొక్క ఉత్తమమైన మోడల్ అవుతుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

Volkswagen యొక్క Taigun SUV ఇండియా 2.0 వ్యూహంలో భాగంగా కొత్త MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన కంపెనీ యొక్క మొదటి మోడల్. ప్రస్తుతం కంపెనీ దీనిని పూణేలోని చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన స్కోడా కుషాక్ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. Volkswagen మరియు Skoda ఒకే ప్లాట్‌ఫారమ్ ను పంచుకోవడం ద్వారా భారతదేశంలో అనేక కొత్త కార్లను ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా విడుదల కానున్నాయి.

Volkswagen Taigun చాలా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త Volkswagen Taigun యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇందులో ముందు భాగంలో క్రోమ్ ప్లేట్లతో కూడిన పెద్ద గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు 17-ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Volkswagen Taigun యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మల్టీ-ఫంక్షన్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, గ్లోవ్ బాక్స్ మరియు లెదర్ చుట్టబడిన గేర్ లివర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యుఎస్బి ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు అనేక కనెక్టెడ్ ఫీచర్స్ పొందుతుంది.

Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.

Volkswagen Taigun ఎస్‌యూవీ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ ప్రయాణికుల భద్రతకు తోడ్పడుతుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ అండ్ రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వున్నాయి.

కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని వచ్చే నెలలో దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. Volkswagen Taigun భారతీయ మార్కెట్లో విడుదలైన తర్వాత Hyundai Creta, Kia Seltos మరియు Skoda Kushaq వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. Volkswagen ఇటీవల కొత్త లోగోను కూడా స్వీకరించినట్లు సమాచారం.

ఇటీవల కంపెనీ భారతదేశంలోని 150 డీలర్‌షిప్‌లలో కొత్త బ్రాండ్ లోగోను ప్రదర్శించింది. ఒక ప్రకటనలో, కంపెనీ కొత్త లోగో గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా ఉందని మరియు ఇది కంపెనీ ఆవిష్కరణ వ్యూహంపై ఆధారపడి ఉందని పేర్కొంది. కొత్త లోగోతో, కస్టమర్‌లతో సమర్థవంతంగా కనెక్ట్ అవ్వడానికి కంపెనీ తన అన్ని డీలర్‌షిప్‌లలో డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే Volkswagen Taigun వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








