మళ్ళీ ప్రారంభమైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ ; వివరాలు
ప్రముఖ వాహన తయారీదారు ఫోక్స్‌వ్యాగన్ తన టి-రాక్ ఎస్‌యువిని గత ఏడాది మార్చిలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యువిని విడుదలైన అతి తక్కువ కాలంలోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. ఈ కారణంగా కంపెనీ ఈ టి-రాక్ ఎస్‌యువి బుకింగ్స్ నిలిపివేసింది. కానీ కంపెనీ ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ యొక్క బుకింగ్స్ తిరిగి ప్రారంభించింది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ భారత మార్కెట్లో చాలా తొందరగా అమ్ముడైంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో దీనికి వినియోగదారుల నుంచి ఎటువంటి స్పందన ఉందొ మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో దాని కొత్త బ్యాచ్ కస్టమర్ల డిమాండ్ మేరకు తీసుకురాబడింది, అదేవిధంగా బుకింగ్స్ కూడా ప్రారంభించబడింది.

ఫోక్స్‌వ్యాగన్ యొక్క కొత్త బ్యాచ్ డెలివరీని ఏప్రిల్ 2021 నుండి ప్రారంభమవుతాయి. టి-రాక్ ఎస్‌యువిని భారత మార్కెట్లోకి సిబియు మార్గం ద్వారా తీసుకురానున్నారు. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం కంపెనీలు సంవత్సరానికి కేవలం 2500 యూనిట్లను మాత్రమే దిగుమతి చేసుకోగలవు. గత సంవత్సరం, టి-రాక్ యొక్క 1000 యూనిట్లు దిగుమతి చేయగా, అవి త్వరలో అమ్ముడయ్యాయి.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ మొదటిసారిగా 2020 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ప్రవేశపెట్టబడింది. ఆ సమయంలోనే వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ కారణంగా కంపెనీ దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఎస్‌యువికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ, స్థానిక ఉత్పత్తి గురించి ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ డిజైన్ మరియు ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఎస్‌యువి యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇందులో హెక్సాగోనల్ గ్రిల్, ఎల్ఈడి హెడ్ లైట్ మరియు ఎల్ఇడి డిఆర్ఎల్ ఉన్నాయి. ఈ కారులో కంపెనీ డ్యూయల్ టోన్ బంపర్‌లను ఉపయోగించింది మరియు ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్‌లు కూడా ఇవ్వబడ్డాయి.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ లో 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని కలిగి ఉంది. ఇది కాకుండా ఈ కారులో ప్రీమియం లెదర్ అప్హోల్స్ట్రే కూడా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీ-ఎంట్రీ మరియు ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

టి-రాక్ ఎస్‌యువి 1.5-లీటర్ బిఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌లో దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డిఎస్‌జి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. ఈ ఎస్‌యువి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అంతే కాకుండా ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








