Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా (Skoda) మరియు జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) సంస్థలు రెండూ కలిసి భారతదేశం కోసం సిద్ధం చేసుకున్న 'ఇండియా 2.0' ప్రాజెక్టులో భాగంగా రెండు మిడ్-సైజ్ ఎస్‌యూవీలను విడుదల చేసిన సంగతి తెలిసినదే. వీటిలో స్కోడా కుషాక్ (Skoda Kushaq) మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) కార్లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఒకే ప్లాట్‌ఫామ్ (MQB-A0-IN) పై రూపొందించబడ్డాయి.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

ఒకే ప్లాట్‌ఫామ్ పై రూపుదిద్దుకున్న కారణంగా, ఈ రెండు కార్లలో ఒకేరకమైన ఇంజన్స్, ఫీచర్స్ మరియు పరికరాలను ఉపయోగించారు. వీటిలో స్కోడా కుషాక్ ముందుగా మార్కెట్లో విడుదలైంది. జూన్ 28, 2021న స్కోడా కుషాక్ రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 23, 2021వ తేదీన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మార్కెట్లో విడుదలైంది. టైగన్ ఎస్‌యూవీ ప్రారంభ ధర కూడా రూ. 10.49 లక్షలే (ఎక్స్-షోరూమ్) కావడం గమనార్హం.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

అయితే, అమ్మకాల పరంగా చూసుకుంటే, తన పెద్దన్న స్కోడా కుషాక్ ను ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఓవర్‌టేక్ చేస్తోంది. గడచిన అక్టోబర్ 2021 నెలలో స్కోడా ఆటో ఇండియా మొత్తం 2,413 కుషాక్ ఎస్‌యూవీలను విక్రయించింది. కాగా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గత నెలలో మొత్తం 2,551 యూనిట్ల టైగన్ ఎస్‌యూవీలను విక్రయించి, కుషాక్ ను ఓవర్‌టేక్ చేసింది. ఈ రెండు ఎస్‌యూవీలు కూడా ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతాయి.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

నిజానికి, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలు ప్రత్యర్థులు కావు. ఎందుకంటే, ఇవి రెండూ కూడా ఒకే గ్రూప్ నుండి అమ్మువుడవుతున్న రెండు వేర్వేరు కార్లు. కాబట్టి, ఈ రెండింటిలో ఏది లీడ్‌లో ఉందో నిర్మాణ సంస్థలు పెద్దగా పట్టించుకోవు. మొత్తంగా చూసుకుంటే, గడచిన నెలలో ఈ రెండు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు కలిపి 5,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

స్కోడా ఆటో అందిస్తున్న కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, దేశీయ విపణిలో యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ. 10.49 లక్షల నుండి రూ. 17.59 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ప్రారంభంలో కంపెనీ ఈ మోడల్‌ను 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో విడుదల చేసింది. ఆ తర్వాత, ఇందులో మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది కంఫర్ట్ లైన్, హైలైన్, టాప్‌లైన్ మరియు జిటి అనే నాలుగు ట్రిమ్ లలో మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 17.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యంలో ఉన్నాయి. కంపెనీ ఈ ఎస్‌యూవీని రెండు ఇంజన్ ఆప్షన్లతో (1.0 లీటర్ టిఎస్ఐ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ) అందిస్తోంది.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ రెండూ కూడా ఒకే నిర్మాణం మరియు పరికరాలను కలిగి ఉండి, చూడటానికి వేర్వేరుగా కనిపించే రెండు విభిన్న ఎస్‌యూవీలుగా ఉంటాయి. ఇంజన్ మరియు టెక్నాలజీ పరంగా ఈ రెండు మోడళ్లు ఒకేలా ఉన్నప్పటికీ, కుషాక్ తో పోలిస్తే, టైగన్ ఎస్‌యూవీ మరింత మెరుగైన స్టైలింగ్ మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

ఫీచర్ల విషయానికి వస్తే, స్కోడా కుషాక్ ఎస్‌యూవీలో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, కనెక్ట్ టెక్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, ఇన్-కార్ వై-ఫై మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో కూడిన 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, సేఫ్టీ విషయానకి వస్తే ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు వైపర్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

ఇక టైగన్ ఎస్‌యూవీలో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్ల సీట్లు, టచ్ సెన్సిటివ్ బటన్‌లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు యాంబియెంట్ లైటింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో హిల్-హోల్డ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ యాంకర్లు మొదలైనవి ఉన్నాయి.

Volkswagen Taigun vs Skoda Kushaq: అన్ననే ఓవర్‌టేక్ చేసిన తమ్ముడు!

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ రెండు ఎస్‌యూవీ ఒకరేకమైన ఇంజన్ ఆప్షన్స్ తో వస్తాయి. కాబట్టి, వీటి పవర్, టార్క్ గణాంకాలు కూడా ఇంచు మించు ఒకేలా ఉంటాయి. వీటిలోని 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో మరియు 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 5, 2021, 16:14 [IST]
English summary
Volkswagen taigun overtakes skoda kushaq in october 2021 sales report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+