షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen.. ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా యొక్క అత్యంత విజయవంతమైన కారు ఫోక్స్‌వ్యాగన్ టైగన్. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. కంపెనీ ఈ మిడ్ సైజ్ SUV ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికే 18,000 యూనిట్ల బుకింగ్‌లను పొందగలిగింది. ఇంత డిమాండ్ ఉన్న ఈ SUV ధరను ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పెంచినట్లు తెలిపింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క మొత్తం శ్రేణి ధర ఇప్పుడు రూ. 4,000 వరకు పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత, దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ. 10.54 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. అదే సమయంలో దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 17.54 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

స్కోడా ఆటో కూడా ఇటీవల దాని మిడ్-సైజ్ SUV అయిన స్కోడా కుషాక్ ధరను రూ. 30,000 పెంచిన విషయం తెలిసిందే. దీనితో పోల్చితే ఇప్పుడు వోక్స్‌వ్యాగన్ టైగన్ ధర చాలా తక్కువ మొత్తంలో పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ధరల పెరుగుదల తరువాత ఇది మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో చూడాలి.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

కొత్త Volkswagen Taigun మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి కుర్కుమా ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ మరియు కార్బన్ స్టీల్ గ్రే కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

Volkswagen Taigun అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందుభాగంలో, ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

Taigun SUV ఆల్‌రౌండ్ క్లాడింగ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ఒక ఎల్ఈడీ బార్‌తో ఒక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైస్, డ్యూయల్ టోన్ ORVM వంటివి కూడా ఉన్నాయి.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

Volkswagen Taigun కలర్ ఫుల్ ప్రీమియం ఇంటీరియర్‌లను కలిగి ఉంది. ఇది డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే డాష్‌బోర్డ్ వెండి స్ట్రిప్‌ను అందుకుంటుంది. ఇది ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌తో వస్తుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Taigun SUV లో 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నయి. ఇందులో ఉన్న 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కారు యొక్క స్పీడ్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, ​​ఓడోమీటర్, రేంజ్ లెఫ్ట్‌ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్‌హోల్డర్‌లతో సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసీ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

Volkswagen Taigun అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి ఉన్నాయి.

షాకింగ్ న్యూస్.. Taigun ధరను పెంచిన Volkswagen

Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది. Volkswagen Taigun భారతీయ మార్కెట్లో విడుదలైన తర్వాత Hyundai Creta, Kia Seltos మరియు Skoda Kushaq వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Volkswagen taigun suv price hiked by rs 4000 details
Story first published: Saturday, November 20, 2021, 16:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X