వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం మొదలైంది. ఈ నేపథ్యంలో భాగంగా దాదాపు ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ కార్ తయారీ సంస్థ వోల్వో కూడా సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

వోల్వో కంపెనీ తన ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ముందే ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ యొక్క బుకింగ్స్ 2021 జూన్ నుండి భారతదేశం అంతటా ప్రారంభమవుతుందని వోల్వో ధృవీకరించింది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమై దశలవారీగా జరగనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగానికి సరికొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఉంది. ఈ వోల్వో యొక్క ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, జాగ్వార్ I-పేస్ మరియు ఆడి ఇ-ట్రోన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ రెండూ కూడా త్వరలో వస్తాయని భావిస్తున్నారు.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

కొత్త వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిబియు మార్గం ద్వారా భారత్‌లోకి దిగుమతి చేయనున్నారు. బెల్జియంలోని ఘెంట్‌లోని బ్రాండ్ సౌకర్యం వద్ద ఈ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు. భారతీయ మార్కెట్ కోసం ప్లాన్ చేసిన అనేక ఉత్పత్తులలో ఎక్స్‌సి 40 రీఛార్జ్ మొదటిదని కంపెనీ తెలిపింది.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎలక్ట్రిక్ ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని వోల్వో ధృవీకరించింది. వచ్చే ఏడాది ఎప్పుడైనా మార్కెట్లోకి ప్రవేశించబోయే సి40 రీఛార్జ్ కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్టాండర్డ్ ఐసి-ఇంజన్ పవర్డ్ మోడల్ మాదిరిగానే డిజైన్ మరియు స్టైలింగ్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న పెద్ద తేడాలు ఏమిటంటే, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి గ్రిల్ స్థానంలో బాడీ-కలర్ ప్యానెల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు 31-లీటర్ల చిన్న స్టోరేజ్ ప్లేస్ లభిస్తాయి.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

రాబోయే వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 408 బిహెచ్‌పి మరియు 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్‌యూవీ ఆఫర్. కొత్త వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారతదేశంలో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఇ-ఎస్‌యూవీ అవుతుంది, అయితే ఇది చివరిది కాదు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత ఏవిధమైన స్పందనను చూరగొంటుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 9, 2021, 20:43 [IST]
English summary
New Volvo XC40 Recharge Unveiled In India Ahead Of Launch. Read in Telugu.
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+