మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

దశాబ్ధాల కాలంగా కార్లు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. కార్ల తయారీదారులు కూడా కస్టమర్ల అవసరాన్ని మరియు వారి బడ్జెట్ ను బట్టి కార్లను తయారు చేయడం మొదలు పెట్టాయి. సాధారణంగా, కార్లను అవి కనిపించే ఆకారాన్ని బట్టి హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎమ్‌పివి, ఎస్‌యూవీ, స్పోర్ట్స్ కార్, సూపర్ కార్, కూప్ మొదలైన విభాగాలుగా విభజిస్తారు.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

అయితే, ఇటీవలి కాలంలో కార్ కంపెనీలు కొన్ని కొత్త డిజైన్లతో కూడిన కార్లను కొత్త విభాగాల్లో ప్రవేశపెడుతున్నాయి. అలా పుట్టుకొచ్చిందే క్రాసోవర్ విభాగం. హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ మరియు ఎస్‌యూవీ డిజైన్ ను కలగలపి రూపొందించినదే ఈ క్రాసోవర్ బాడీ టైప్. దీని ముందు డిజైన్ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ మాదిరిగా ఉంటుంది మరియు వెనుక డిజైన్ వాలుగా ఉండి, ఎస్టేట్ వ్యాగన్ మాదిరిగా ఉంటుంది.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

మనదేశంలో క్రాసోవర్ ట్రెండ్ ఒకప్పుడు బాగానే సాగింది. ఆ ట్రెండ్ ముగిసిన తర్వాత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం పుట్టుకొచ్చింది. హ్యాచ్‌బ్యాక్ పరిమాణంలో ఉండి, పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ స్థానంలో ఉన్న 5-సీటర్ ఎస్‌యూవీలను కార్ కంపెనీలు కాంపాక్ట్ ఎస్‌యూవీలుగా విభజించాయి. ఈ విభాగంలో Ford EcoSport, Renault Kiger, Nissan Magnite మరియు Maruti Suzuki Vitara Brezza మొదలైనవి ఉన్నాయి.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

ఓ వైపు కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్రెండ్ కొనసాగుతుంటే, ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగాన్ని ప్రవేశపెట్టాయి. ఇవి కాంపాక్ట్ ఎస్‌యూవీల కన్నా ఎక్కువగా పొడవుగా ఉండి, ఫుల్ సైజ్ 7-సీటర్ ఎస్‌యూవీల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటాయి. ఈ విభాగంలో Kia Sonet, Hyundai Creta, Skoda Kushaq, Renault Duster, Nissan Kicks మరియు Volkswagen Taigun వంటి మోడళ్లు ఉన్నాయి.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

ఇక.. ఇప్పుడు కొత్తగా వచ్చింది మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్. ఇది పరిమాణంలో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా ఉంటుంది. కాకపోతే, స్టాండర్డ్ హ్యాచ్‌బ్యాక్ ల కన్నా ఎత్తుగా ఉండి, చూడటానికి చిన్న సైజు ఎస్‌యూవీ మాదిరిగా కనిపిస్తుంది. ఈ విభాగంలో ఇప్పటికే Maruti Suzuki Ignis మరియు Mahindra KUV100 కంపెనీలు తమ మైక్రో ఎస్‌యూవీలను విక్రయిస్తుండగా, కొత్తగా Tata Motors మరియు Hyundai కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

ఇందులో భాగంగానే Tata Punch తమ మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించగా Hyundai తమ Casper మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. దీంతో ఇప్పుడు ఈ విభాగంలో రానున్న రోజుల్లో మరిన్ని కొత్త మోడళ్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అసలు మైక్రో ఎస్‌యూవీలు ఏంటే ఏమిటి? అవి ఆటోమొబైల్ మార్కెట్ ను ఎలా ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకుందాం రండి.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

మైక్రో ఎస్‌యూవీ అంటే ఏమిటి?

మైక్రో ఎస్‌యూవీల గురించి సింపుల్‌గా చెప్పాలంటే, వీటిని చిన్న సైజులో ఎస్‌యూవీలుగా అభివర్ణించవచ్చు. పెద్ద సైజులో ఉండే ఎస్‌యూవీలతో పోల్చినప్పుడు వీటి డిజైన్ చాలా క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, వీటి ఓవరాల్ సిల్హౌట్ మాత్రం బాక్సీ టైప్‌లో ఉండే ఎస్‌యూవీల మాదిరిగానే కనిపిస్తుంది.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

తక్కువ పరిమాణం (పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ)లో వీటిని రూపొందించడం వలన ఈ మైక్రో ఎస్‌యూవీల క్యాబిన్ మరియు బూట్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, చిన్న సైజు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా మెరుగ్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్లలో నలుగురు ప్రయాణీలుకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఐదవ వ్యక్తికి పరిమిత సంఖ్యలో మాత్రం రూమ్ ఉంటుంది.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

మైక్రో ఎస్‌యూవీల తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు మరియు మొదటిసారిగా కారును కొనేవారికి వీటిని అందుబాటు ధరలో ఉంచేందుకు కంపెనీలు కూడా మినిమలిస్టిక్ ఫీచర్లతో వీటిని అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ చిన్న కార్లన్నీ ప్రస్తుతానికి పెట్రోల్ ఇంజన్లను మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిలో డీజిల్ ఇంజన్లకు తావు ఉండకపోవచ్చు.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

మైక్రో ఎస్‌యూవీ వినియోగదారులు ఎవరు?

ఇదివరకు చెప్పుకున్నట్లుగా మొదటిసారిగా కారును కొనుగోలు చేసేవారు లేదా ప్రస్తుతం ఉపయోగిస్తున్న హ్యాచ్‌బ్యాక్ నుండి చిన్నసైజు ఎస్‌యూవీకి మారాలనుకునే వారిని టార్గెట్ గా చేసుకొని ఈ మైక్రో ఎస్‌యూవీలను ప్రవేశపెట్టడం జరిగింది. సరసమైన ప్రైస్ ట్యాగ్ వీటి యొక్క ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఇది యువతను మరియు మిడిల్-క్లాస్ ఫ్యామీలను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

మైక్రో ఎస్‌యూవీ మార్కెట్స్ ఏవి?

నిజానికి మైక్రో ఎస్‌యూవీలు ఇటు రద్దీగా ఉండే నగరాలు మరియు అటు విశాలంగా ఉండే పల్లెటూర్లు రెండింటికీ అనువుగా ఉంటాయి. వీటి కాంపాక్ట్ డిజైన్ కారణంగా, రద్దీగా ఉండే నగర వీధుల్లో సైతం సులువుగా ముందుకు సాగిపోవచ్చు. అంతేకాకుండా, వీటి కాంపాక్ట్ డిజైన్ వలన పార్కింగ్ కూడా సులువుగా ఉంటుంది మరియు ఇవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవు. పెద్ద కార్లతో పోలిస్తే, వీటి మెయింటినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

మైక్రో ఎస్‌యూవీలు అంటే ఏమిటి? అసలు అవెలా పుట్టుకొచ్చాయ్..?

మైక్రో ఎస్‌యూవీలు సక్సెస్ అవుతాయా? ఈ విభాగం యొక్క భవిష్యత్తు ఏమిటి?

ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఎస్‌యూవీలకు గిరాకీ అధికంగా ఉంటోంది. కాబట్టి, ఈ మైక్రో ఎస్‌యూవీలు కూడా మంచి సక్సెస్ ను సాధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో హ్యాచ్‌బ్యాక్ కార్ల స్థానాన్ని రీప్లేస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కారు మార్కెట్లో సక్సెస్ సాధించాలంటే అది దాని డిజైన్, ఫీచర్లు, ధర, బ్రాండ్ ఇమేజ్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరి కొత్తగా రాబోయే మోడళ్లను కస్టమర్లు ఆదరిస్తారో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.

Most Read Articles

English summary
What are the micro suv s and how did this segment formed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X