మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్స్ వల్ల ఉపయోగాలు

ఒకప్పుడు దూరప్రయాణం చేయాలంటే గుర్రపు బండ్లు లేదా ఎద్దుల బండ్లు ఉపయోగించేవారు. కొంతమంది సైకిల్స్ కూడా ఉపయోగించేవారు. అయితే కాలక్రమంలో పరిస్థితులు మారాయి, మానవుడు తన అవసరాలకు అనుకూలంగా ఎన్నో కొత్త వాహనాలను సృష్టించుకున్నాడు. ఈ రోజు మానవుడు ఇతర గ్రహాలను సైతం అవలీలగా సందర్శించి వచ్చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఎంత అభివృద్ధి అనేది ఎంతమేరకు జరిగింది అనే విషయం మనకు స్పష్టమవుతుంది.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

ఇంతటి అభివృద్ధిలో ఉన్న ప్రజలకు ఇప్పుడు కార్ల వాడకం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు ప్రాధమిక ఫీచర్స్ తో మొదలైన కార్లు ఈ రోజు లగ్జరీ ఫీచర్స్ పొందుతున్నాయి. కార్లలో వాహనవినియోగదారులకు అనుకూలంగా, అంటే లగ్జరీ కోసం కొన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని భద్రతను దృష్టిలో ఉంచుకుని అందివ్వడం జరిగింది.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

ప్రాధమిక దశ నుంచి ఇప్పటిఅరకు కూడా కొన్ని ఫీచర్స్ అదే విధంగా ఉన్నాయి. ఇవి దాదాపు కార్ వినియోగదారులందరికీ తెలుసు. ఇలాంటి ఫీచర్ గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు, కొంతమంచికి తెలియకపోయి ఉండవచ్చు. అలాంటి ఫీచర్ గురించి మనం ఇప్పుడు, ఇక్కడ తెలుసుకుందాం..

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

కార్లలో సాధారణంగా రివర్స్ లైట్ లేదా బ్యాకప్ లైట్ అంటివి మీరు గమనించి ఉంటారు. ఇది ఒకప్పటి నుంచి ఇప్పటివరకు వస్తూనే ఉన్నాయి. వీటి డిజైన్ లో ఏమైనా మార్పులు ఉండవచ్చు, కానీ ఇవి తప్పకుండా అన్ని కార్లలో తప్పకుండా అందుబాటులో ఉన్నాయి.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

కారులో మీరు గమనించే రివర్స్ లైట్‌ లేదా బ్యాకప్ లైట్ గురించి తెలియని వారికి దీని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని అనుకుంటారు. ఇది ముమ్మాటికీ పొరపాటు. నిజానికి ఇది కారులో ఉండే అత్యంత ముఖ్యమైన ఫీచర్స్ లో ఇది కూడా ఒకటి. మీరు రివర్స్ గేర్‌ను ఎంగేజ్ చేసినప్పుడు, రివర్స్ లైట్/బ్యాకప్ లైట్ ఆన్ అవుతుంది.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

ఈ విధంగా ఆ లైట్ ఆన్ అయినప్పుడు వెనుక వస్తున్న వాహన దారులకు సంకేతాలను అందిస్తాయి. కావున ఆ సమయంలో ఎనుక వచ్చే వాహనదారులు తమ వాహనాన్ని నెమ్మదిగా నడుపుతారు. అప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఒక వేళా ఈ లైట్ లేకపోతే, మీరు బ్రేక్ వేసినప్పుడు లేదా గేర్ ఎంగేజ్ చేసినప్పుడు వెనుక వచ్చేవారికి తెలిసే అవకాశం లేదు, అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

అంతే కాకుండా, రివర్స్ లైట్ మరొక ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. మీ వాహనాన్ని రివర్స్ చేయడానికి బాగా వెలుతురు ఉన్న వాతావరణం అవసరం కాబట్టి మీరు ఎంత రివర్స్ చేయాలి మరియు ఏ కోణంలో ఉండాలి అని కూడా మనకు తెలియజేస్తుంది. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

చీకటిగా ఉన్న ప్రదేశాలలో, రివర్స్ లైట్ వాహనాన్ని ఎక్కడ మరియు ఎంత రివర్స్ చేయాలో మీకు తెలియజేయడానికి తగినంత కాంతిని అందిస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరాలను కలిగి ఉన్న కార్లలో, రివర్స్ లైట్ రాత్రిపూట తగినంత వెలుతురును అందిస్తుంది. వెనుకకు చూసే బదులు మీ స్క్రీన్‌పై చూడటం ద్వారా మీరు వాహనాన్ని ఎంత రివర్స్ చేయాలి మరియు ఎప్పుడు ఆపాలి అనే విషయాలను మీకు స్పష్టంగా తెలియజేస్తుంది.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

కారులోని సేఫ్టీ పరికరాలలో ఈ రివర్స్ లైట్ కూడా చాలా ముఖ్యమైన భాగం. బ్యాకప్/రివర్స్ లైట్ మీ హెడ్‌ల్యాంప్‌లు, హెడ్‌లైట్లు మరియు టర్న్ ఇండికేటర్‌ల వంటి అన్ని సమయాల్లో మంచి స్థితిలో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే ప్రమాదాలను నిలువరించే అవకాశం ఉంటుంది. తక్కువ వెలుతురు ఉన్న వాతావరణంలో భయం లేకుండా మీరు మీ వాహనాన్ని రివర్స్ చేయటానికి ఈ రియర్స్ లైట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని లక్షలమంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. కావున వాహనదారులు కూడా తప్పకుండా కొన్ని నియమాలను విధిగా పాటించి ఈ ప్రమాదాలను పూర్తిగా నిలువరించడానికి సహకరించాలి.

మీకు తెలుసా.. కారులోని రివర్స్ లైట్ వల్ల ఉపయోగాలు.. ఎన్నో..

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం రోడ్డు వ్యవస్థను కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక కొత్త ఎక్స్ప్రెస్ వే కి శంకుస్థాపన చేశారు. ఇది కూడా త్వరలో పూర్తవుతుంది. మొత్తానికి రోడ్డు ప్రమాదాలను రూపుమాపడానికి కఠినమైన చర్యలను తీసుకుంటున్నారు. కావున రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

Most Read Articles

Read more on: #car talk #off beat
English summary
What is reverse light in a car and what is its actual work details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X