స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లో తమ సరికొత్త బొలెరో నియో ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పటికే బొలెరో పేరుతో ఓ ఎస్‌యూవీని విక్రయిస్తుండగా, తాజాగా బొలెరో నియో పేరుతో కంపెనీ ఈ 7-సీటర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

ఈ నేపథ్యంలో, చాలా మంది బొలెరో మరియు బొలెరో నియో మోడళ్ల ఉన్న ప్రధాన వ్యత్యాసాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. స్టాండర్డ్ బొలెరో మరియు బొలెరో నియో రెండు మోడళ్లు కూడా పూర్తిగా వేర్వేరు.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

స్టాండర్డ్ బొలెరో మరియు బొలెరో నియో పేర్లలో మాత్రమే సారూప్యత ఉంటుంది. వాటి డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ ఆప్షన్లలో ఎలాంటి సారూప్యత ఉండదు. వాస్తవానికి బొలెరో నియో అనేది కొత్త పేరుతో వచ్చిన పాత మహీంద్రా టియూవీ300 ఎస్‌యూవీనే.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

బిఎస్6 కాలుష్య నిబంధనల నేపథ్యంలో మహీంద్రా తమ మునుపటి టియూవీ300 ఎస్‌యూవీ అమ్మకాలను దేశీయ మార్కెట్లో నిలిపివేసింది. ఇప్పుడు కంపెనీ అదే ఎస్‌యూవీని డిజైన్ మరియు ఫీచర్ల పరంగా కొద్దిగా అప్‌గ్రేడ్ చేసి, కొత్త పేరుతో తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇక్కడ మహీంద్రా సింపుల్‌గా తమ పాపులర్ బొలెరో నేమ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

భారత మార్కెట్లో అత్యంత విజయవంతమైన యుటిలిటీ వాహనాల్లో స్టాండర్డ్ మహీంద్రా బొలెరో కూడా ఒకటి. బొలెరోను విజయవంతమైన మోడల్‌గా మార్చడంలో దాని ప్రాక్టికాలిటీ, ఎక్కడికైనా వెళ్ళే సామర్థ్యం మరియు శక్తివంతమైన ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్ యొక్క విశ్వసనీయత కీలక పాత్ర పోషించాయని చెప్పాలి.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

గతంలో మహీంద్రా టియూవీ300 అమ్మకాల పరంగా కంపెనీకి ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టలేదు. ఈ నేపథ్యంలో, ఈ మోడల్‌ని స్వల్పంగా అప్‌గ్రేడ్ చేసి, బొలెరో నియో పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఈ మోడల్‌ని సులువుగా ప్రజల్లోకి తీసుకెళ్లగలమని మహీంద్రా భావిస్తోంది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. నిజానికి స్టాండర్డ్ బొలెరో చూడటానికి పాత జీప్ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కాగా, బొలెరో నియో సింపుల్ బాక్సీ టైప్ ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా పాత స్టాండర్డ్ బొలెరో ఎస్‌యూవీనే చాలా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో vs బొలెరో నియో: వేరియంట్లు

మహీంద్రా బొలెరో నియో మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి: ఎన్4, ఎన్8, ఎన్10 మరియు ఎన్10 (ఓ). కాగా, స్టాండర్డ్ బొలెరో బి4, బి6 మరియు బి6 (ఓ) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. బొలెరో నియో ఎన్10 వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో vs బొలెరో నియో: ధరలు

బొలెరో నియో ఎన్‌4 మరియు ఎన్‌8 వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.48 లక్షలు, రూ.9.99 లక్షలుగా ఉన్నాయి. కాగా, ఎన్10 వేరియంట్ ధర రూ.11 లక్షల లోపు ఉంటుందని అంచనా. ఇక, స్టాండర్డ్ బొలెరో విషయానికి వస్తే, మార్కెట్లో దీని ధరలు రూ.8.63 లక్షల నుంచి రూ.9.61 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో vs బొలెరో నియో: డిజైన్

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీని డిస్‌కంటిన్యూ చేయబడిన టియూవీ300 యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వర్ణించవచ్చు. బొలెరో నియో అసలు మహీంద్రా బొలెరో కంటే కాస్తంత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును మరియు నిటారుగా డిజైన్‌ను కలిగి ఉంటుంది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

స్టాండర్డ్ బొలెరో రగ్గడ్ డిజైన్‌ని కలిగి ఉంటే, బొలెరో నియో సున్నితమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. బొలెరో నియో ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌తో పాటు బెండింగ్ హెడ్‌లైట్‌లు ఉంటాయి, ఇవి స్టాండర్డ్ బొలెరోలో కనిపించవు. దీని వీల్ ఆర్చెస్ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే, ఈ రెండు మోడళ్లలో సైడ్ బాడీ మోల్డింగ్స్ మరియు క్లామ్‌షెల్ బోనెట్ రెండు ఒకేలా ఉంటాయి.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో vs బొలెరో నియో: కొలతలు

కొలతల పరంగా బొలెరో మరయు బొలెరో నియోలో చాలా సారూప్యతలు ఉంటాయి. బొలెరో నియో మరియు స్టాండర్డ్ బొలెరో యొక్క పొడవు మరియు వీల్‌బేస్ వరుసగా 3,995 మిమీ మరియు 2,680 మిమీగా ఉంటాయి. బొలెరో నియో 1,795 మిమీ వెడల్పుగా ఉంటుంది, ఇది స్టాండర్డ్ బొలెరో కంటే 50 మిమీ ఎక్కువ. ఇక పొడవు విషయానికి వస్తే స్టాండర్డ్ బొలెరో, బొలెరో నియో కంటే 63 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో vs బొలెరో నియో: ఫీచర్లు

డిస్‌కంటిన్యూ చేయబడిన మహీంద్రా టియూవీ300తో పోలిస్తే, బొలెరో నియో యొక్క క్యాబిన్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ సీట్ ఆర్మ్‌రెస్ట్, క్రూయిజ్ కంట్రోల్ మరియు రిమోట్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

స్టాండర్డ్ బొలెరో మాదిరిగానే బొలెరో నియో క్యాబిన్‌లో ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించవచ్చు. బొలెరో నియో వీల్‌బేస్ 2680 మిమీ మరియు బూట్ స్పేస్ 384 లీటర్లుగా ఉంటుంది. ఇది 2+3+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. అంటే, ముందు వరుసలో ఇద్దరు, మధ్య వరుసలో ముగ్గురు మరియు వెనుక వరుసలో 2 ఇద్దరు చొప్పున కూర్చోవచ్చు.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో యొక్క క్యాబిన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. పవర్ విండోస్ మరియు రిమోట్ లాకింగ్ మినహా, ఇది సాంప్రదాయ ఆడియో సిస్టమ్ మరియు తక్కువ ఆకర్షణీయమైన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

బొలెరో నియో శక్తివంతమైన బాడీ నిర్మాణం, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ మరియు కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ (సిబిసి) వంటి సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది. కాగా, స్టాండర్డ్ బొలెరోలో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో vs బొలెరో నియో: ఇంజన్

రెండు బొలెరోలు కూడా ఎమ్‌-హాక్ 1.5-లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌లను కలిగి ఉంటాయి. కాకపోతే, ఇవి విడుదల చేసే పవర్, టార్క్ గణాంకాలు భిన్నంగా ఉంటాయి. ద్వారా శక్తిని పొందుతాయి. బొలెరో నియోలో ఎమ్-హాక్ 100 మరియు స్టాండర్డ్ బొలెరోలో ఎమ్-హాక్ 75 ఇంజన్స్ ఉంటాయి.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 260 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో 50 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

స్టాండర్డ్ మహీంద్రా బొలెరోకి మరియు బొలెరో నియోకి మధ్య తేడా ఏంటి?

కాగా, స్టాండర్డ్ బొలెరోలోని ఇదే ఇంజన్ 76 బిహెచ్‌పి శక్తిని మరియు 210 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఎస్‌యూవీలు మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని మరియు ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. ఈ మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీ సాయంతో ఇంజన్ నిర్దిష్ట సమయం కన్నా ఎక్కువ సేపు ఆన్‌లో ఉండి, ఐడిల్‌గా ఉంటే అది ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. తిరిగి క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నాలజీ వలన ఇంధనం ఆదా అవుతుంది.

Most Read Articles

English summary
What Is The Difference Between Standard Bolero And Bolero Neo? Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X