మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి సుజుకి భారతదేశంలో తమ సేల్స్ నెట్‌వర్క్‌ను అరేనా మరియు నెక్సా అనే రెండు విభాగాలుగా వర్గీకరించిన సంగతి మనందరికీ తెలిసినదే. అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ తమ బడ్జెట్ శ్రేణి మోడళ్లను మరియు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రీమియం రేంజ్ మోడళ్లను మారుతి సుజుకి విక్రయిస్తోంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

వాస్తవానికి, ఈ రెండు డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే వాహనాలు చూడటానికి మాత్రమే భిన్నంగా కనిపిస్తాయి. వాటి లోపల ఉపయోగించే భాగాలన్నీ ఇంచుమించు రెండింటిలోనూ ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు, మారుతి సుజుకి ఎర్టిగా మరియు మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మోడళ్లను తీసుకున్నట్లయితే, ఇవి రెండూ ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

చూడటానికి మాత్రం ఇవి రెండూ విభిన్నంగా కనిపిస్తాయి. ఎర్టిగా ఎమ్‌పివి ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌లలో కంపెనీ స్వల్ప మార్పులు చేసి ఎక్స్ఎల్6 పేరుతో విక్రయిస్తోంది. ఈ రెండు మోడళ్ల మధ్య ధరల వ్యత్యాసం కూడా భారీగానే ఉంటుంది. మరి మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ధరకు తగిన విలువను కలిగి ఉంటుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

దేశీయ విపణిలో మారుతి సుజుకి ఎక్స్ఎల్6 జెటా మరియు ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.9.94 లక్షలు మరియు రూ.10.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటాయి. ఎక్స్ఎల్6 కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి ఎక్స్ఎల్6 ఇంజన్

మారుతి ఎర్టిగాలో ఉపయోగించిన అదే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే మారుతి ఎక్స్ఎల్6 లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

గేర్‌బాక్స్ విషయానికి వస్తే, ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 19.01 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.99 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి ఎక్స్ఎల్6 కొలతలు

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కేవలం 6 సీటర్ కాన్ఫిగరేషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది 4445 మిమీ పొడవు, 1775 మిమీ వెడల్పు, 1700 మిమీ ఎత్తు మరియు 2740 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. కారులో 209 లీటర్ల స్టాండర్డ్ బూట్ స్పేస్ ఉంటుంది. రెండు మరియు మూడవ వరుస సీట్లను మడచుకోవటం ద్వారా దీనిని 692 లీటర్లకు పెంచుకోవచ్చు.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి ఎక్స్ఎల్6 జెటా ధర - రూ.9.95 లక్షలు

సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఈ వేరియంట్‌లో డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, హిల్ హోల్డ్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

అంతేకాకుండా, ఈ వేరియంట్‌లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసి, టిల్ట్ స్టీరింగ్, కీలెస్ ఎంట్రీ, రియర్ ఏసి వెంట్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి ఎక్స్ఎల్6 ఆల్ఫా ధర - రూ.10.53 లక్షలు

సేఫ్టీ ఫీచర్ల పరంగా చూస్తే, ఈ వేరియంట్లో జెటా వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా, రియర్ పార్కింగ్ కెమెరా లభిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, ఆటో ఫోల్డింగ్ అవుట్-సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, సన్ వైసర్ వానిటీ మిర్రర్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. దీని స్టైలింగ్‌ను మరింత మెరుగుపరచడానికి, ఇందులో లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ కూడా లభిస్తుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి ఎక్స్ఎల్6 కలర్ ఆప్షన్లు

మారుతి సుజుకి ఈ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని బ్లూ, ఖాకీ, రెడ్, గ్రే, సిల్వర్ మరియు వైట్ అనే ఆరు కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

ఈ రెండు వేరియంట్లలో ఏది బెస్ట్?

మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6 యొక్క బేస్ వేరియంట్ అయిన జెటా వేరియంట్‌లోనే అనేక ఫీచర్లు లభిస్తున్నాయి. పైగా ఆల్ఫా వేరియంట్‌తో పోల్చుకుంటే, జెటా వేరియంట్ ధర కూడా కాస్తంత తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ జెటా వేరియంట్ ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Which variant is best in maruti suzuki xl6 price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X