మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమ్‌పివిలలో ఒకటిగా ఉంది. టొయోటా ఇన్నోవా వంటి మోడళ్లతో పోటీ పడుతూ, సరసమైన ధరకే అందుబాటులో ఉన్న ఈ మోడల్ ఇటు క్యాబ్ డ్రైవర్లకు అటు పెద్ద కుటుంబాలకు చాలా అనువుగా ఉంటుంది. అమ్మకాల పరంగా కూడా ఎమ్‌పివి విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా మొదటి స్థానంలో ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

మారుతి సుజుకి ఎర్టిగా మొత్తం ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ అనేక మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎర్టిగాలో సిఎన్‌జి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కథనంలో ఎర్టిగా ఎమ్‌పిలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ఏ వేరియంట్ కొనుగోలు చేస్తే మంచిదనే విషయాలను తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి ఎర్టిగా - ఇంజన్

మారుతి సుజుకి ఎర్టిగా 1.5-లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పి శక్తిని మరియు 138 న్యూటన్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లీటరుకు 19.01 కిలోమీటర్ల మైలేజీని మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లీటరుకు 17.99 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

ఇకపోతే, ఇందులోని సిఎన్‌జి వేరియంట్ కూడా ఇదే ఇంజన్‌తో లభిస్తుంది. కాకపోతే, దీని పవర్, టార్క్ గణాంకాలు మాత్రం తక్కువగా ఉంటాయి. సిఎన్‌జి వేరియంట్ ఎర్టిగా 92 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్ కిలోకు 26.08 కిమీ మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

మారుతి సుజుకి ఎర్టిగా ఎల్‌ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.7.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ వేరియంట్లో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

సేఫ్టీ ఫీచర్లు:

 • డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్
 • ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్
 • ఈబిడితో కూడిన ఏబిఎస్
 • రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
 • సీట్ బెల్ట్ రిమైండర్
 • హైస్పీడ్ అలెర్ట్
 • ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
 • ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్
 • ఫంక్షనల్ ఫీచర్లు:

  • 60:40 స్ప్లిట్ సెకండ్ రో సీట్
  • టిల్ట్ స్టీరింగ్
  • అన్ని వరుసలలో సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు
  • రెండవ వరుసలో స్లైడ్ చేసి, వాల్చుకునే సీట్
  • మూడవ వరుసలో 50:50 స్ప్లిట్ సీట్లు
  • చల్లబరచే కప్ హోల్డర్లు
  • ఫ్రంట్ పవర్ అవుట్‌లెట్
  • డ్రైవర్ సన్‌వైజర్
  • డోర్ పాకెట్స్
  • ఫ్రంట్ అండ్ రియర్ క్యాబిన్ ల్యాంప్స్
  • ఆల్ పవర్ విండోస్
  • డిజైన్, స్టైల్:

   • బాడీ కలర్ బంపర్స్
   • ఎల్ఈడి టెయిల్ లాంప్స్
   • కలర్ ఎమ్ఐడి డిస్‌ప్లే
   • బ్లాక్ సైడ్ మిర్రర్స్
   • బ్లాక్ డోర్ హ్యాండిల్స్
   • ఆర్15 స్టీల్ వీల్స్
   • మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

    మారుతి ఎర్టిగా విఎక్స్ఐ వేరియంట్ల ధరలు రూ .8.56 లక్షల నుండి రూ.9.76 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి. ఇందులో ఎల్ఎక్స్ఐ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లతో పాటుగా క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి.

    సేఫ్టీ ఫీచర్లు:

    • డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
    • యాంటీ-థెఫ్ట్ అలారం
    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
    • హిల్ స్టార్ట్ అసిస్ట్
    • ఎంటర్‌టైన్‌మెంట్:

     • ఆడియో సిస్టమ్
     • యూఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటీ
     • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
     • 4 స్పీకర్లు
     • ఫంక్షనల్ ఫీచర్లు:

      • రియర్ ఏసి వెంట్స్ మరియు పవర్ అవుట్‌లెట్
      • రిమోట్ సెంట్రల్ లాకింగ్
      • పవర్ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్
      • ప్యాసింజర్ సైడ్ వానిటీ మిర్రర్
      • రియర్ ఆర్మ్‌రెస్ట్
      • స్ప్లిట్ లగేజ్ బోర్డు
      • డిజైన్, స్టైల్:

       • క్రోమ్ గార్నిష్ (ఎక్స్టీరియర్/ఇంటీరియర్)
       • చక్రాలపై వీల్ కవర్లు
       • సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు
       • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్
       • బాడీ కలర్ సైడ్ మిర్రర్స్
       • మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

        మారుతి సుజుకి ఎర్టిగా జెడ్‌ఎక్స్ఐ వేరియంట్ల ధరలు రూ.9.39 లక్షల నుండి రూ.10.59 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇందులో విఎక్స్ఐ వేరియంట్లో లభించే ఫీచర్లతో పాటుగా క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి.

        ఫంక్షనల్ ఫీచర్లు:

        • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
        • ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్
        • పుష్-బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ
        • ఆటోమేటిక్ ఏసి
        • మూడవ వరుసలో పవర్ అవుట్‌లెట్
        • ఫ్రంట్ సీట్ బెల్ట్ హైట్ అడ్జస్ట్‌మెంట్
        • డిజైన్, స్టైల్:

         • డాష్‌బోర్డ్ మరియు డోర్‌పై వుడెన్ ట్రిమ్స్
         • వెనుక వైపు క్రోమ్ ఇన్సెర్ట్
         • ఆర్15 అల్లాయ్ వీల్స్
         • క్రోమ్ డోర్ హ్యాండిల్స్
         • మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

          మారుతి సుజుకి ఎర్టిగా జెడ్‌ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ ధర రూ.9.91 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇందులో జెడ్ఎక్స్ఐ వేరియంట్లో లభించే ఫీచర్లతో పాటుగా క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి. అవి:

          రియర్ పార్కింగ్ కెమెరా

          • 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
          • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో
          • లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్
          • మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఏ వేరియంట్ కొంటే మంచిది? ఎందుకు?

           మరియు ఏ వేరియంట్ కొంటే మంచిది?

           మారుతి సుజుకి ఎర్టిగా యొక్క జెడ్‌ఎక్స్ఐ వేరియంట్ రూ.9.39 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. ధర మరియు ఫీచర్ల పరంగా చూసుకుంటే, ఈ వేరియంట్ ధరకు తగిన విలువను అందిస్తుంది. మరియు దాదాపుగా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఒకవేళ కాస్తంత బడ్జెట్ గురించి ఆలోచించే వారికైతే, కావల్సిన బేసిక్ ఫీచర్లతో రూ.8.56 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విఎక్స్ఐ వేరియంట్ అనువుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Which Variant To Buy In Maruti Suzuki Ertiga MPV? Variant-wise Features, Specs, Price And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X