మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ గురించి కార్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో వ్యాగన్ఆర్ కూడా ఒకటి. దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా భారత స్మాల్ కార్ ప్రియులను ఆకర్షిస్తున్న ఈ 'టాల్ బాయ్' కార్ ఇప్పుడు కొత్త అవతార్‌లో మునుపటి కన్నా మెరుగైన డిజైన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. అందులో కూడా 1.0 లీటర్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వ్యాగన్ఆర్ మొత్తం 12 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ కూడా ఉంది. సిఎన్‌జి వెర్షన్ వ్యాగన్ఆర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే, ఇందులో 14 వేరియంట్లు ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

అయితే, ప్రధానంగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎల్ఎక్స్ఐ బేస్ వేరియంట్ కాగా, విఎక్స్ఐ మిడ్ వేరియంట్ మరియు జెడ్ఎక్స్ఐ టాప్-ఎండ్ వేరియంట్. మరి ఈ వేరియంట్లలో ఏది బెస్ట్ వేరియంట్, ఎందులో ఎక్కువ ఫీచర్లు లభిస్తాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

వ్యాగన్ఆర్ - ఇంజన్ ఆప్షన్స్:

బడ్జెట్, మైలేజ్‌కు ప్రాధాన్యతనిచ్చే వారి కోసం మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో 1.0 లీటర్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పి శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ 21.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో 21.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

ఇకపోతే, ఇందులో కొంచెం శక్తివంతమైన అడ్వాన్స్డ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో 20.52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కాగా, సిఎన్‌జి వెర్షన్ వ్యాగన్ఆర్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది ఇది కేజీ సిఎన్‌జికి 32.52 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 1.0 లీటర్ ఇంజన్ ఎల్ఎక్స్ఐ మరియు ఎల్ఎక్స్ఐ (ఓ) ధరలు వరుసగా రూ.4.80 లక్షలు మరియు రూ.4.87 లక్షలుగా ఉన్నాయి. ఈ వేరియంట్లలో లభించే ఫీచర్లు ఇలా ఉన్నాయి:

సేఫ్టీ ఫీచర్లు:

 • డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్
 • ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ (ఆప్షనల్)
 • ఈబిడితో కూడిన ఏబిఎస్
 • రివర్స్ పార్కింగ్ సెన్సార్
 • సీట్ బెల్ట్ రిమైండర్
 • హై స్పీడ్ అలెర్ట్
 • ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్ మరియు లోడ్ లిమిటర్ (ఆప్షనల్)
 • సెంట్రల్ లాకింగ్
 • ఫంక్షనల్ ఫీచర్లు:

  • ఫ్రంట్ పవర్ విండోస్
  • ఫ్రంట్ పవర్ అవుట్లెట్
  • ఫిక్స్డ్ ఫ్రంట్ అండ్ రియర్ హెడ్‌రెస్ట్‌లు
  • అన్ని డోర్లపై డోర్ పాకెట్స్
  • ఎమ్ఐడి, మైలేజ్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ
  • డ్రైవర్ సన్‌ వైజర్
  • ఫ్రంట్ క్యాబిన్ లాంప్స్
  • పార్సెల్ ట్రే (సిఎన్‌జి వేరియంట్లో మాత్రమే)
  • స్టైల్:

   • బాడీ కలర్ బంపర్స్
   • బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు డోర్ హ్యాండిల్స్
   • ఆర్13 చక్రాలు
   • మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

    మారుతి సుజుకి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ 1.0 లీటర్ ఇంజన్ ధర రూ.5.13 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్లలో పైన తెలిపిన ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో లభించే ఫీచర్లు అదనంగా క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి, అవి:

    సేఫ్టీ ఫీచర్లు:

    • డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
    • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
    • సేఫ్టీ అలారం
    • ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్
    • ఫోన్ డాక్
    • యూఎస్‌బి, ఆక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ
    • ఫ్రంట్ స్పీకర్
    • ఫంక్షనల్ ఫీచర్లు:

     • రిమోట్ సెంట్రల్ లాకింగ్
     • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
     • టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్
     • రియర్ పవర్ విండోస్
     • 60:40 స్ప్లిట్ రియర్ సీట్
     • రియర్ పార్శిల్ ట్రే
     • ప్యాసింజర్ సన్‌వైజర్‌పై వానిటీ మిర్రర్
     • మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

      మారుతి సుజుకి వ్యాగన్ఆర్ జెడ్‌ఎక్స్ఐ 1.2 లీటర్ ఇంజన్ ధర రూ.5.83 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్లలో పైన తెలిపిన విఎక్స్ఐ వేరియంట్‌లో లభించే ఫీచర్లు అదనంగా క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి, అవి:

      సేఫ్టీ ఫీచర్లు:

      • రియర్ డీఫాగర్
      • రియవర్ వైపర్ మరియు వాషర్
      • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
      • ఇన్ఫోటైన్‌మెంట్:

       • 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
       • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో
       • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
       • ఫంక్షనల్ ఫీచర్లు:

        • టాకోమీటర్
        • ప్యాసింజర్ సీట్ క్రింది భాగంలో దాగి ఉండే ట్రే
        • బ్యాక్ పాకెట్స్
        • ఎలక్ట్రల్లీ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్
        • మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

         మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వైట్, సిల్వర్, గ్రే, ఆరెంజ్, బ్రౌన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే, ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ పెట్రోల్-సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

         మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

         మరి వీటిలో ఏ వేరియంట్ కొంటే బెస్ట్?

         ఒకవేళ మీరు మీ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుని సరైన వేరియంట్‌ను ఎంచుకోవాలనుకుంటే, మీరు వ్యాగన్ఆర్ 1.0 విఎక్స్ఐ (ఓ) వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మార్కెట్లో దీని ధర రూ.5.20 లక్షలుగా ఉంది.

         అయితే, మీరు కొంచెం మీ బడ్జెట్‌ను పెంచుకోగలిగినట్లయితే వ్యాగన్ఆర్ 1.2 లీటర్ విఎక్స్ఐను ఎంచుకోవచ్చు. దీని ధర రూ.5.48 లక్షలుగా ఉంది.

         ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో కూడిన వేరియంట్ కావాలనుకునే వారికి వ్యాగన్ఆర్ 1.2 లీటర్ జెడ్ఎక్స్ఐను ఎంచుకోవచ్చు. దీని ధర రూ.5.83 లక్షలుగా ఉంటుంది. ఇవన్నీ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే వేరియంట్లు.

         మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? - ఫుల్ డీటేల్స్

         ఒకవేళ మీరు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన వేరియంట్ కొనాలని చూస్తున్నట్లయితే, మీరు వ్యాగన్ఆర్ ఆటోమేటిక్ యొక్క 1.2 లీటర్ విఎక్స్ఐ (ఓ) ఏజిఎస్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మార్కెట్లో దీని ధర రూ.6.05 లక్షలు.

         అలా కాకుండా, ఇందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో కూడిన ఆటోమేటిక్ వేరియంట్ కావాలనుకుంటే, మీరు వ్యాగన్ఆర్ 1.2 లీటర్ జెడ్ఎక్స్ఐ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో దీని ధర 6.33 లక్షలుగా ఉంటుంది.

         మీరు సిఎన్‌జి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే, ఇందులో వ్యాగన్ఆర్ 1.0 ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) సిఎన్‌జి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ.5.20 లక్షలుగా ఉంది. (*గమనిక: పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ - జులై 16, 2021వ తేదీ నాటికి).

Most Read Articles

English summary
Which Variant To Buy In Maruti Suzuki WagonR? Variant-wise Features, Price And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X