టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతి కార్ల తయారీ సంస్థకు ఒక ప్రత్యేకమైన మోడల్ ఉంటుంది. అలాంటి వాహనాలు సదరు వాహన తయారీ సంస్థకే ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడతాయి. నిజాని బ్రాండ్ పేరు కన్నా అలాంటి పాపులర్ వాహనాల పేర్లో ప్రజల గుండెల్లో ఎక్కువగా నిలిచిపోతాయి.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

మనదేశంలో సాధారణంగా ఎమ్‌పివి అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే మోడల్ టొయోటా ఇన్నోవా. భారత ఎమ్‌పివి విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న టొయోటా ఇన్నోవా కారుకి పోటీనిచ్చేందుకు మార్కెట్లోకి అనేక కొత్త మోడళ్లు పుట్టుకొచ్చాయి. కానీ, ఏ ఒక్క మోడల్ కూడా ఇన్నోవాను ఓడించలేకపోయింది.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

అలాంటి ఓ ఎమ్‌పివిలలో ఒకటి టాటా ఆరియా. భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎమ్‌పివి ప్రాజెక్ట్ ఇది. ఎమ్‌పివి విభాగంలో టొయోటా ఇన్నోవా వేగానికి బ్రేకులు వేసేందుకు టాటా మోటార్స్ ఈ ఆరియా మోడల్‌ను ప్రవేశపెట్టింది. విశాలమైన ఇంటీరియర్స్, విలాసవంతమైన ఫీచర్లతో కంపెనీ ఈ కారుని అందించింది.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

కేవలం ఆరేళ్లలో టాటా ఆరియా మార్కెట్ నుండి తొలగిపోయింది. ఆ తర్వాత కంపెనీ దీని స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు హెక్సా అనే మోడల్‌ను ప్రవేశపెట్టింది. కానీ, టాటా హెక్సా ఎమ్‌పివి కూడా ఈ రేసులో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

మార్కెట్లో ఒక కారు వైఫల్యం చెందడానికి అనేక కారణాలు ఉంటాయి. డిజైన్, పెర్ఫార్మెన్స్, ఇంజన్, మైలేజ్, ఫీచర్లు, ధర ఇలాంటి అనేక అంశాలు ఒక కారు విజయాన్ని ప్రభావితం చేయడంలో కీలకంగా ఉంటాయి. టొయోటా ఇన్నోవాకు పోటీగా 2010లో టాటా అరియాను ప్రవేశపెట్టారు.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

నిజానికి, టాటా అరియా ఈ విభాగంలో దాని ప్రత్యర్థుల కంటే చాలా తెలివిగా డిజైన్ చేయబడిందని చెప్పాలి. అరియా ఎమ్‌పివిని టాటా మోటార్స్ యొక్క ఎక్సోవర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి తయారు చేశారు. ఈ కారను తొలిసారిగా 2008 జెనీవా మోటార్ షోలో కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించారు.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

మొదట్లో ఈ కారుపై మార్కెట్లో మంచి అభిప్రాయం ఏర్పడినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా ఇది కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. ఎమ్‌పివి విభాగంలో ఎన్నో ఆశలతో విడుదలైన టాటా ఆరియా, అతికొద్ది సమయంలోనే మార్కెట్ నుండి తొలగిపోయింది. ఈ పోటీలో టాటా అరియా, టొయోటా ఇన్నోవా మార్కెట్‌కి చేరువ కూడా కాలేకపోయింది.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

టాటా ఆరియా మార్కెట్లోకి వచ్చిన కొంత కాలం తర్వాత, కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను పెంచేందుకు ఇందులో ఓ ఫేస్ లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే, చిన్నపాటి డిజైన్ మార్పులు చేర్పులు చేసి 2014లో కంపెనీ ఈ మోడల్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. కానీ, అది కూడా ఎందుకు ఉపయోగపడలేదనే చెప్పాలి.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

టాటా ఆరియా ఫేస్‌లిఫ్ట్‌పై కస్టమర్లు పెట్టుకున్న ఆశలన్నంటినీ కంపెనీ అడియాశలు చేసింది. గత 2014లో వచ్చిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కంపెనీ ఆశించిన మార్పులను తీసుకురాలేకపోయింది. అయితే, ఆ సమయంలో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఆరియాలో కంపెనీ ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మునుపటి ఇంజన్‌ను రీట్యూన్ చేసి మరింత ఎక్కువ పవర్‌తో విడుదల చేసింది.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

టాటా ఆరియా 2.2 లీటర్ డైకార్ డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. అయితే, కస్టమర్లు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి టాటా ఆరియా రియర్ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమయ్యేది. అంతేకాకుండా, ఈ ఎమ్‌పివి కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించేంది.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

ఇందులో ఫేస్‌లిఫ్టెడ్ పొందిన ఇంజన్ గరిష్టంగా 147 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది. ఈ కారులో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రతి లైన్‌కు 3 వేర్వేరు బ్లోవర్లతో కూడిన ఏసి వెంట్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఆక్స్ ప్లగ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్లను కలిగి ఉండేది.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా మొదలైన ఫీచర్లు లభ్యమయ్యేవి. టాటా ఆరియాలో ఇన్ని అద్భుతమైన లక్షణాలున్నప్పటికీ, ఇది మార్కెట్లో నిలదొక్కుకోలేకపోవటానికి ప్రధాన కారణం దాని బిల్డ్ క్వాలిటీ మరియు అధిక ధరనే చెప్పాలి.

టొయోటా ఇన్నోవాకి సవాల్ విసిరేందుకు వచ్చిన టాటా ఆరియా ఎందుకు ఓడిపోయింది?

అంతేకాకుండా, టాటా మోటార్స్ బ్రాండ్‌కు ప్రస్తుతం ఉన్న విశ్వసనీయత అప్పట్లో ఉండేది కాదు. నిజానికి ఇప్పుడు టాటా మోటార్స్ అందిస్తున్న కార్లు డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఒకవేళ, ఇప్పటి పరిస్థితుల్లో టాటా మోటార్స్ తమ ఆరియాను మోడ్రన్ డిజైన్ లాంగ్వేజ్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చినట్లయితే, అది ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. మీరేమంటారు?

Most Read Articles

English summary
Why Did Tata Aria Looses The Race With Toyota Innova In MPV Segment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X