పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో, వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ మైలేజీనిచ్చే చిన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం, భారత మార్కెట్లో అనేక రకాల కాంపాక్ట్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని సెగ్మెంట్లో కెల్లా ఉత్తమ మైలేజీని ఆఫర్ చేస్తాయి. ప్రత్యేకించి హ్యాచ్‌బ్యాక్ బాడీ టైప్ కార్లు వాటి కాంపాక్ట్ డిజైన్ మరియు క్లాస్ లీడింగ్ స్టోరేజ్ స్పేస్ కారణంగా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

చిన్న కుటుంబాలకు మరియు పట్టణ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసే వారికి ఈ హ్యాచ్‌బ్యాక్ బాడీ టైప్ కార్లు అనువుగా ఉంటాయి. మరి ఈనాటి ఈ కథనంలో భారత మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ మైలేజీనిచ్చే హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

1. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ - లీటరుకు 20.52 కి.మీ నుండి కిలోకు 32.52 కి.మీ వరకు

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) అందిస్తున్న కొత్త తరం వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ టాల్ బాయ్ డిజైన్ కలిగి ఉండి, ఓ ఎస్‌యూవీ లాంటి ఫీల్ ను అందిస్తుంది. ఇది భారతీయులకు ఇష్టమైన ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ కారు అద్భుతమైన స్పేస్ ను మరియు కంఫర్ట్ ను అందిస్తుంది మరియు ఆచరణాత్మక ఉపయోగం కోసం అనుకూలంగా ఉంటుంది. అలాగే మారుతి సుజుకి యొక్క విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ కారు విజయానికి మరొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

ప్రస్తుత తరం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) 1.0 లీటర్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో కూడా గమనించవచ్చు. ఈ ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు, అయితే ప్రత్యామ్నాయంగా కంపెనీ సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ ను అందిస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కోసం కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను ఆఫర్ చేస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దీని మైలేజ్ మారుతూ ఉంటుంది.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ - లీటరుకు 20 కి.మీ నుండి లీటరుకు 28 కి.మీ వరకు

చిన్న కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ మరియు అధిక మైలేజ్ కోరుకునే వారికి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (Hyundai Grand i10 Nios) నియోస్ చక్కటి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ఈ చిన్న కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారులోని రెండు పెట్రోల్ ఇంజన్‌లు సగటును లీటరుకు 20 కిమీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తాయి. అదే సమయంలో డీజిల్ వెర్షన్ లీటరుకు 23-28 కి.మీ మైలేజీని అందిస్తుంది.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

2. టాటా అల్ట్రోజ్ - లీటరుకు 18 కి.మీ నుండి 25 కి.మీ వరకు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న భారతదేశపు అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌ టాటా అల్ట్రోజ్ (Tata Altroz) కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఆల్ట్రోజ్ కారులో 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది లీటరుకు 21 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే, ఇందులో మరింత శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ కోరుకునే వారి కోసం 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. ఇది లీటరుకు 18 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందిస్తుంది.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

ఇక డీజిల్ ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ కారులోని డీజిల్ ఇంజన్ లీటరుకు 25 కి.మీ లకు పైగా మైలేజీని అందిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన ఎంట్రీ లెవల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ కూడా ఒకటి.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

3. హ్యుందాయ్ ఐ20 - లీటరుకు 20 కి.మీ నుండి 25 కి.మీ వరకు

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న మరో అద్భుతమైన కారు హ్యుందాయ్ ఐ20 (Hyundai i20). ఇది కూడా గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్ డీజిల్, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లీటరుకు సగటున 20-21 కి.మీ మైలేజీని అందిస్తాయి.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ లీటరుకు 25 కి.మీ లకు పైగా మైలేజీని అందిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ మాదిరిగానే హ్యుందాయ్ ఐ20 కూడా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ లో ప్రవేశపెట్టిన హ్యాచ్‌బ్యాక్ కారు. హ్యుందాయ్ ఐ20 ఈ విభాగంలో టాటా ఆల్ట్రోజ్ మరియు మారుతి సుజుకి బాలెనో వంటి కార్లతో పోటీ పడుతోంది.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

4. మారుతి సుజుకి బాలెనో - లీటరుకు 20 కి.మీ నుండి 24 కి.మీ వరకు

దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు మారుతి సుజుకి స్విఫ్ట్‌లో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను బాలెనో లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఈ పెట్రోల్ ఇంజన్ సగటున లీటరుకు 20-24 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇది ఈ విభాగంలో టాటా ఆల్ట్రోజ్ మరియు హ్యుందాయ్ ఐ20 మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

పెట్రోల్ ధరల గురించి చింతించడం మానేయండి... ఇవిగో టాప్ 5 మైలేజ్ కార్స్..

5. టాటా టియాగో - లీటరుకు 20 కి.మీ నుండి 24 కి.మీ వరకు

భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న మరొక 'ఫన్ టు డ్రైవ్' కారు టాటా టియాగో (Tata Tiago). టాటా టియాగో కూడా భారత మార్కెట్లో లభిస్తున్న సురక్షితమైన కార్లలో ఒకటి. ప్రస్తుతానికి ఈ కారు కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. సమాచారం ప్రకారం, కంపెనీ ఇందులో ఓ సిఎన్‌జి వెర్షన్ ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. టాటా టియాగో పెట్రోల్ వెర్షన్ లీటరుకు సగటున 20 నుండి 24 కి.మీ లకు పైగా మైలేజీని అందిస్తుంది.

Most Read Articles

English summary
Worried about raising fuel prices here is the list of top 5 best mileage hatchbacks in india
Story first published: Sunday, December 26, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X