కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

2021 వ సంవత్సరం ముగుస్తోంది. 2022 సంవత్సరం రావడానికి ఇంక ఎన్నో రోజులు లేదు. కావున కొత్త సమత్సరంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో చాలా కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి ఆకర్షణీయమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్లను అందిస్తాయి.

ఇందులో నిస్సాన్, డాట్సన్, హోండా, హ్యుందాయ్ మరియు అనేక ఇతర వాహన తయారీ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు అందిస్తున్న ఆఫర్‌లు కేవలం 2021 డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

హోండా సిటీ (Honda City):

ప్రముఖ కార్ తయారీ సంస్థ 'హోండా కార్స్ ఇండియా' దేశీయ మార్కెట్లో కొనుగోలుదారులను ఆకర్శించడానికి ఈ 2021 చివరి నెలలో అద్భుతమైన అఫర్ అందిస్తోంది. కంపెనీ ఇప్పుడు తన 5వ తరం హోండా సిటీ సెడాన్‌పై గరిష్టంగా రూ. 45,108 వరకు బెణిఫీట్స్ అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ కార్ మోడల్‌లోని అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది. కావున కొనుగోలుదారులు దీనిని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

కంపెనీ అందిస్తున్న ఈ అఫర్ లో రూ. 7,500 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 8,108 వరకు యాక్ససరీస్ ఉన్నాయి. అంతే కాకుండా కారు మార్పిడిపై రూ. 15,000 తగ్గింపు కూడా అందుతోంది. అదనపు ప్రయోజనాలలో రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 9,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 8,000 కార్పొరేట్ డిస్కౌంట్ వంటికి ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలని చూసేవారికి ఇది అద్భుతమైన అవకాశం.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 NIOS):

దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ కూడా తన గ్రాండ్ ఐ10 నియోస్‌పైన గరిష్టంగా రూ. 50,000 వరకు ఆఫర్‌లను అందిస్తుంది. ఈ బెణిఫీట్స్ కేవలం టర్బో వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఈ వేరియంట్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లపై 25,000 వరకు ప్రయోజనాలు ఇవ్వబడుతున్నాయి.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

అయితే కంపెనీ యొక్క స్పోర్ట్స్ పెట్రోల్ డిటి వేరియంట్‌పై ఎలాంటి స్పెషల్ ఆఫర్‌లను అందించడం లేదు. కావున కొనుగోలుదారులు తప్పకుండా దీనిని గమనించాలి. ఇక CNG మోడల్ పైన కూడా కంపెనీ దాదాపు రూ.17,300 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఇవన్నీ కూడా కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ ఆఫర్ ఈ నెల చివరివరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

రెనాల్ట్ డస్టర్ (Renault Duster):

దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకుసాగుతున్న వాహన తయారీ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియా ఈ నెలలో తన డస్టర్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 50,000 వరకు ఎక్స్చేంజ్ బెణిఫీట్స్, రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

రెనాల్ట్ డస్టర్ కస్టమర్‌లు బ్రాండ్ నుండి రూ. 1.10 లక్షల వరకు స్పెషల్ లాయల్టీ బెణిఫీట్స్ కూడా పొందుతుంది. అంతే కాకూండా స్క్రాప్‌పేజ్ ప్రోగ్రామ్ కింద స్క్రాప్ చేయడంపై రూ. 10,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. రెనాల్ట్ డస్టర్ కొనేవారికి ఇది అద్భుతమైన అవకాశం.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

నిస్సాన్ కిక్స్ (Nissan Kicks):

2021 చివరి నెలలో తన కార్లపైన ఆఫర్లను అందిస్తున్న కంపెనీలలో నిస్సాన్ కంపెనీ ఒకటి. కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలలో రూ. 15,000 క్యాష్ బెనిఫిట్స్, రూ. 70,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5,000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ మరియు రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ అందిస్తాయి.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లను గురించి కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలిపింది. నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ SUV యొక్క 1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్‌పై కొనుగోలుదారులు రూ. 45,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 10,000 క్యాష్ బెనిఫిట్స్ మరియు రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. కిక్స్ ఆన్‌లైన్ బుకింగ్‌పై రూ. 5,000 బోనస్ మరియు రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి 2021 డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

మహీంద్రా అల్టురాస్ జి4 (Mahindra Alturas G4):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ అయిన మహీంద్రా కంపెనీ కూడా ఈ సంవత్సరం చివరి నెలలో తన మహీంద్రా ఆల్టురాస్ SUV కొనుగోలుపై 81,500 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ ఆఫర్ మరియు రూ. 20,000 వరకు ఇతర ఆఫర్లు ఉన్నాయి.

ఈ SUV యొక్క ఈ ప్రయోజనాలు డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. కావున మీకు దగ్గరలో ఉన్న మహీంద్రా యొక్క అధికారిక డీలర్‌షిప్‌ను సందర్శించి దీనిగురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఓ లుక్కేసుకోండి

2022 నూతన సంవత్సరంలో కొత్త కార్లు కొనాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం మరియు అద్భుతమైన అవకాశం కూడా.. కావున కొత్త కారు కొనాలనుకునే వారు ఈ ఆఫర్లను పొందుతూ కొత్త కార్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్స్ కేవలం పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Year end car discount offers honda city hyundai grand i10 renault duster more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X