గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన Tata Motors భారత మార్కెట్లో ఇటీవల కొత్త Tata Punch మైక్రో SUV ని ఆవిష్కరించింది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. త్వరలో దేశంలోని అనేక నగరాల్లో టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ SUV కోసం ఎంతోమంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్నారు.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

కంపెనీ నివేదికల ప్రకారం, కొత్త Tata Punch SUV 2021 అక్టోబర్ 20 న భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. అయితే అంతకు ముందే ఈ మైక్రో SUV ని కంపెనీ అనేక నగరాల్లో ప్రదర్శించబడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

ఇదిలా ఉండగా కంపెనీ 2021 అక్టోబర్ 5 నుంచి 8 అరకు PUNCHATHON (పంచథాన్) అనే ఒక కొత్త ఆఫర్ అమలు చేయనుంది. ఇది అనేక ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది. దీని కొత్త Tata Punch గెలుచుకోవచ్చు. అయితే దీని కోసం ఒక చిన్న వీడియో లేదా చిన్న రీల్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత, PUNCHATHON మరియు Tata Motors యొక్క హ్యాష్‌ట్యాగ్‌ను ట్యాగ్ చేయడం ద్వారా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు కొత్త Tata Punch గెలుచుకునే అవకాశం పొందుతారు. దీనికి సంబందించిన మరింత సమాచారం కోసం కంపెనీ యొక్క వెబ్ సైట్ సందర్శించండి.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన ఈ PUNCHATHON లో భాగంగానే, జైపూర్, హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్, రాంచీ, కొచ్చి, లక్నో, పూణే, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై మరియు ఇండోర్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ నగరాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రదర్శించబడుతుంది. ఆ సమయంలో మీరు అక్కడకు వెళ్లి వీడియో చేయవచ్చు.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త టాటా పంచ్ మొత్తం నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, అక్సిఫైడ్ మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

Tata Punch యొక్క కోలతలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. దీని ప్రకారం Tata Punch పొడవు 3,840 మిమీ, 1,800 మిమీ వెడల్పు మరియు 1635 మిమీ ఎత్తు మరియు 2,450 మిమీ వీల్‌బేస్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. ఇది చాలా ఆకర్శణీయంగా ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

Tata Punch మైక్రో SUV 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

Tata మోటార్స్ కొత్త Tata Punch SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందించింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తానికి ఇది అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

గుడ్ న్యూస్.. Tata Punch ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

Tata Punch యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.

Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, Wagon R, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. త్వరలో విడుదల కానున్న కొత్త టాటా పంచ్ SUV దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 5, 2021, 13:05 [IST]
English summary
You can win tata punch for free know how details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+