2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఇటీవల కాలంలో తన కొత్త ఎక్స్3 (X3) SUV ని భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అయితే మొదట ఇది కేవలం పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే విడుదలయింది. అయితే ఇప్పుడు ఇది డీజిల్ ఇంజిన్ లో కూడా విడుదలైంది. డీజిల్ ఇంజిన్ కలిగిన 2022 BMW X3 ధర రూ. 65.50 లక్షలు. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

2022 BMW X3 డీజిల్ xDrive20d లగ్జరీ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మోడల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 213 కి.మీ వరకు ఉంటుంది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

కంపెనీ విడుదల చేసిన ఈ మోడల్ నేటి నుండి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కంపెనీ దీనిని రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి X3 xDrive30i SportX Plus కాగా మరొకటి X3 xDrive30i M Sport. వీటి ధరలు వరుసగా రూ. 59.90 లక్షలు మరియు రూ. 65.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

బిఎండబ్ల్యు ఎక్స్3 SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ కారు భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడుతోంది మరియు రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 SUV యొక్క పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 252 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ SUV కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకుంటుంది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌తో ఫ్రంట్ కిడ్నీ గ్రిల్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా స్టీరింగ్ వీల్ ప్యాడిల్ షిఫ్టర్‌లు, బ్రేకింగ్ ఫంక్షన్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్‌తో కూడిన ఆటోమేటిక్ డిఫరెన్షియల్ బ్రేక్ (ADB) వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

ఈ కొత్త SUVలో BMW పెర్ఫార్మెన్స్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది, ఇది వీల్స్ వద్ద ఫోకస్డ్ బ్రేకింగ్ ద్వారా వాహనం యొక్క స్థిరత్వాన్ని పెంచుతుంది. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉంటాయి. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, అటెన్షన్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ మరియు క్రాష్ సెన్సార్, ISOFIX చైల్డ్ సీట్ మౌంటింగ్ ఉన్నాయి. ఇది కాకుండా, లోడ్ ఫ్లోర్ క్రింద ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ కూడా అందించబడింది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

ఇక బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ లేఅవుట్ అప్‌డేట్ చేయబడింది. ఇది 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ గేజ్ క్లస్టర్, లేటెస్ట్ ఐడ్రైవ్ కనెక్టివిటీ, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి వాటిని పొందుతుంది.

2022 BMW X3 డీజిల్ మోడల్ కూడా వచ్చేసింది.. ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 యొక్క డీజిల్ కూడా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. BMW X3 మోడల్ దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ జిఎల్‌సి, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, ఆడి క్యూ5 మరియు వోల్వో ఎక్స్‌సి 60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కొత్త లగ్జరీ మోడల్ ఇక ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2022, 17:38 [IST]
English summary
2022 bmw x3 diesel variant launched price features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+