2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

2022 ఆగష్టు 10 న భారతీయ మార్కెట్లో విడుదల కానున్న '2022 హ్యుందాయ్ టూసాన్' (2022 Hyundai Tucson) బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం రెండు వారాల కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

జులై 18 న బుకింగ్స్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటికి 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు కంపెనీ తెలిపింది. ఇది అతి తక్కువ కాలంలోనే కంపెనీ పొందిన ఆకర్షణీయమైన బుకింగ్స్, రానున్న రోజుల్లో ఈ బుకింగ్స్ సంఖ్య మరింత పెరుగుతుంది. కంపెనీ ఈ కొత్త కారు యొక్క ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ ధర తెలియకుండానే మంచి బుకింగ్స్ పొందింది.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

2022 హ్యుందాయ్ టూసాన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్ లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్ కంపెనీ సిగ్నేచర్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతుంది. ఇప్పటికే కంపెనీ యొక్క అల్కాజర్ మరియు i20 N-లైన్ మోడల్‌లు విక్రయించబడుతున్నాయి.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

2022 హ్యుందాయ్ టూసాన్ రెండు వేయియంట్స్ లో రానున్నట్లు సమాచారం. అవి ప్లాటినం మరియు సిగ్నేచర్ వేరియంట్స్. ఇది మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ SUV ఇప్పుడు ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 154 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ పొందుతుంది. అదే సమయంలో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 184 బిహెచ్‌పి పవర్ మరియు 417 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

2022 హ్యుందాయ్ టూసాన్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింది భాగంలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం కంట్రోల్స్ మరియు ఓ టచ్ ప్యానెల్ కూడా ఉంటుంది.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

ఇందులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వెనుకవైపు రిక్లైన్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు ఉంటాయి. అన్ని సీట్లు లెథెరెట్ అప్‌హోలెస్ట్రీలో ఉంటాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, 8-స్పీకర్లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ మరియు మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ సీట్ వంటి మరిన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

2022 హ్యుందాయ్ టూసాన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. కావున దీని ముందు భాగంలో కొత్త 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌‌తో కూడిన ఫ్రంట్ బంపర్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ తో అద్భుతంగా ఉంటుంది.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

అంతే కాకూండా ఈ SUV ముందు భాగంలో, పారామెట్రిక్ జ్యువెల్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్‌ ఉంటుంది. హెడ్‌లైట్‌లు నిలువుగా పేర్చబడి గ్రిల్‌కి ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో సెంట్రల్ ఎయిర్ డ్యామ్ మరియు సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ చూడవచ్చు. రియర్ ఫ్రొఫైల్ లో ఎస్‌యూవీ వెడల్పు అంతటా ఉండే టెయిల్‌లైట్‌ ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

2022 హ్యుందాయ్ టూసాన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఎబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-హోల్డ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

2022 హ్యుందాయ్ టూసాన్: విడుదల కాలేదు, ధర కూడా తెలియదు.. ఇప్పటికే 3,000 బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2022 హ్యుందాయ్ టూసాన్ మార్కెట్లో విడుదల కావడానికి ఇక ఎన్నో రోజులు లేదు. కంపెనీ ఈ కొత్త SUV ని విడుదల చేసిన సమయంలోనే ధరలను కూడా వెల్లడిస్తుంది. అప్పటి వరకు ఈ SUV గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ పాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, August 8, 2022, 10:05 [IST]
English summary
2022 hyundai tucson gets 3000 bookings in two weeks details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+