సంచలన ధర వద్ద విడుదలైన '2022 హ్యుందాయ్ టూసాన్': పూర్తి వివరాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2022 హ్యుందాయ్ టూసాన్' (2022 Hyundai Tucson) భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. దేశీయ మార్కెట్లో ఈ ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 27.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

Recommended Video

భారత్‌లో విడుదలైన 2022 Hyundai Tucson | వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హ్యుందాయ్ టూసాన్' రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవి ఒకటి ప్లాటినం కాగా, మరొకటి సిగ్నేచర్. ఈ కొత్త ఎస్‌యువి గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విడుదలైన 2022 టూసాన్, లాంగ్-వీల్‌బేస్ మోడల్. కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్ లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

2022 టూసాన్ ఆధునిక 'సెన్సుయస్ స్పోర్టినెస్' డిజైన్ కలిగి ఉంది. కావున ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా కొత్తగా మరియు ఆకర్షణీయంగా ఉంది. ఇందులో LED DRL దాని కింద LED హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంది. అదే సమయంలో ఇది పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు ముందు భాగంలో స్కిడ్ ప్లేట్‌ వంటి వాటిని కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

సైడ్ ప్రొఫైల్ 'Z' షేప్ డిజైన్ పొందుతుంది. అదే సమయంలో 18-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ కూడా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో డ్యూయల్ T-షేప్ LED టెయిల్-లైట్స్ ఉన్నాయి, ఇవి LED లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి. మొత్తం మీద దీని ఆకర్షణను మరింత పెంచడంలో క్రీజులు మరియు లైన్లు కూడా చాలా దోహదపడతాయి.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్ పైన సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌లు మరియు దిగువన బేజ్ ప్లాస్టిక్‌ పొందుతుంది. అంతే కాకుండా ప్రీమియం అనుభూతిని మరింత పెంచడానికి ఇందులో లెదర్ అపోల్స్ట్రే కూడా అందుబాటులో ఉంది. ఈ SUV పరిణామం మరియు పొడవైన వీల్‌బేస్ కారణంగా ఇది క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

డ్యాష్‌బోర్డ్‌లో 10.25-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దాని చుట్టూ పియానో ​​బ్లాక్ యాక్సెంట్‌లు ఉన్నాయి. అదే సమయంలో ఇందులో 10.25-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉంది. సెంటర్ కన్సోల్‌లో ఆటోమేటిక్ గేర్ లివర్ అలాగే కొన్ని ఫిజికల్ బటన్‌లు ఉన్నాయి. ఇవి హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఇతర ఫంక్షన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

అంతే కాకుండా ఇందులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరాలు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, అలెక్సా & గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రిక్లైనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

హ్యుందాయ్ టూసాన్ మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో 5 మోనో టోన్‌ కలర్స్ కాగా, మిగిలిన రెండు డ్యూయెల్ టోన్ కలర్స్. మోనోటోన్ కలర్స్ లో పోలార్ వైట్, ఫాంటమ్ బ్లాక్, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ మరియు గ్రే ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో వైట్/బ్లాక్ మరియు రెడ్/బ్లాక్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

హ్యుందాయ్ టూసాన్ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. కావున దీని పొడవు 4,630 మిమీ, వెడల్పు 1,865 మిమీ, ఎత్తు 1,665 మిమీ మరియు వీల్‌బేస్‌ 2,775 మిమీ వరకు ఉంటుంది. 2022 టూసాన్ బూట్ స్పేస్ 620 లీటర్లు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

2022 టూసాన్ గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఇప్పుడు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) పొందుతుంది. కావున ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్‌లు మరియు రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ తన విభాగంలో మొదటిసారిగా ఇందులో ADAS టెక్నాలజీ ప్రవేశపెట్టింది.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

2022 హ్యుందాయ్ టూసాన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

ఇందులోని పెట్రోల్ ఇంజిన్ 6,200 ఆర్‌పిఎమ్ వద్ద 156 పిఎస్ పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 192 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జత చేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజిన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 186 పిఎస్ పవర్ మరియు 2,000 - 2,750 ఆర్‌పిఎమ్ వద్ద 416 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్సన్ లేదు.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

కొత్త 2022 టూసాన్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-డీసెంట్ కంట్రోల్, హిల్-అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ మరియు సరౌండ్-వ్యూ మానిటర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ టూసాన్: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2022 హ్యుందాయ్ టూసాన్ విడుదలకు ముందే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఇది మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. 2022 టూసాన్ మార్కెట్లో జీప్ కంపాస్ , సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2022 hyundai tucson launched in india price features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X