భారత మార్కెట్లో Compass Trailhawk విడుదల చేసిన Jeep: ధర & వివరాలు
అమెరికన్ వాహన తయారీ దిగ్గజం జీప్ (Jeep) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త 'కంపాస్ ట్రైల్హాక్' (Compass Trailhawk) విడుదల చేసింది. ఈ కొత్త 2022 జీప్ కంపాస్ ట్రైల్హాక్ (2022 Jeep Compass Trailhawk) ప్రారంభ ధర రూ. 30.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త కారు ధర దాని స్టాండర్డ్ కంపాస్ టాప్-స్పెక్ మోడల్ అయిన ఎస్ వేరియంట్ కంటే రూ. 1.38 లక్షలు ఎక్కువ. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ 'కంపాస్ ట్రైల్హాక్' గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

2022 జీప్ కంపాస్ ట్రైల్హాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియు గ్రిల్ కలిగి ఉంది. అంతే కాకూండా ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఇందులో షార్ప్‌గా కట్ బంపర్లు ఉంటాయి. ఇది కొత్త బోనెట్ డెకాల్, చిన్న 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 225/65 R17 సెక్షన్ టైర్లను పొందటమే కాకుండా.. రియర్ రెడ్ హుక్, స్కఫ్ ప్లేట్ మరియు ఫెండర్లపై కొత్త ట్రయల్ రేటింగ్ బ్యాడ్జ్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా దీనిని మరింత దూకుడుగా కనిపించేలా చేస్తాయి.

ఇంకా ఇందులోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది చాలావరకు దాని పాత మోడల్ ని గుర్తు చేస్తుంది. దీని లోపల అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఉండే కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ మరియు సీట్లపై ఉన్న 'ట్రైల్హాక్' లోగోలు దీనిని మరింత ఆధునికంగా చూపిస్తాయి. ఇందులో 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు 10.25-ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి.

ఈ 2022 జీప్ కంపాస్ ట్రైల్హాక్ కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED ఫాగ్ ల్యాంప్స్, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, 360-డిగ్రీ కెమెరా మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని కూడా పొందుతుంది. దీనితో పాటు ఇందులో వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

ఈ కొత్త జీప్ రైడ్ ఎత్తు ఒక అంగుళం పెంచబడింది, కావున ఇది ఇప్పుడు 205 మిమీ వద్ద ఉంటుంది. రీ-ప్రొఫైల్ ఫ్రంట్ బంపర్‌తో పాటు, 30 డిగ్రీల మెరుగైన అప్రోచ్ యాంగిల్‌ను ఇస్తుంది. ఇది ఎటువంటి రోడ్డుపై అయిన సజావుగా ముందుకు సాగె విధంగా రూపొందించడం జరిగింది. ట్రైల్హాక్ పూర్తి అండర్బాడీ ప్రొటెక్షన్ ప్లేట్లు, మెరుగైన సైడ్‌వాల్ రక్షణ కోసం చిన్న 17-ఇంచెస్ రిమ్‌లు, మడ్ ప్లస్ స్నో టైర్ వంటి వాటిని పొందుతుంది.

2022 జీప్ కంపాస్ ట్రైల్హాక్ ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్కలిగి ఉంటుంది. ఇది 170 బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టం కూడా ప్రామాణికంగా కలిగి ఉంటుంది.

కంపాస్ ట్రైల్హాక్ ఫేస్‌లిఫ్ట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, పానిక్ బ్రేక్ అసిస్ట్, రెడీ అలర్ట్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, రెయిన్ బ్రేక్ సపోర్ట్, సెలెక్ట్ టెర్రైన్ 4x4 సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

ఇదిలా ఉండగా జీప్ కంపెనీ మూడు వరుసల జీప్ మెరిడియన్‌ను కూడా త్వరలో తీసుకురానుంది. కంపెనీ ఈ ఏడాది మేలో ఈ SUV యొక్క ఉత్పత్తిని ప్రారంభించింది. అంతకు ముందే కంపెనీ దీని గురించి అధికారికంగా వెల్లడించింది. కావున ఇది త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. కావున ఇది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత జీప్ కంపాస్ పైన ఉంటుంది.

కొత్త జీప్ మెరిడియన్ కేవలం డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే శక్తినివ్వనుంది. ఇది బ్రెజిలియన్ మార్కెట్లో విక్రయించే జీప్ కమాండర్‌కు చాలా దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. మొత్తానికి ఇది కూడా చాలా అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మొత్తానికి జీప్ కంపెనీ యొక్క 'కంపాస్ ట్రైల్హాక్' భారతీయ మార్కెట్లో విడుదలైంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ఎంతవరకు కంపెనీకి విజయాన్ని చేకూర్చుతుంది అనే విషయాలన్నీ త్వరలోనే తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








