విడుదలకు ముందే కొత్త టీజర్‌తో మీ ముందుకు వచ్చిన 2022 Maruti Baleno: వివరాలు
భారత మార్కెట్లో ఈ కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి (Maruti Suzuki) యొక్క 2022 మారుతి బాలెనో (2022 Maruti Baleno) కూడా ఉంది. ఈ కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో ఈ నెల 10 న అధికారికంగా విడుదల కానుంది. అయితే కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేసింది. అదే సమయంలో 2022 మారుతి బాలెనో యొక్క కొత్త టీజర్ విడుదలయ్యింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 మారుతి బాలెనో అధికారికంగా దేశీయ మార్కెట్లో విడుదల కాకముందే ఒక టీజర్ విడుదల చేయబడింది. ఇందులో 2022 బాలెనో యొక్క ముందు భాగాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు ఆధునిక అప్డేట్స్ తో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇందులో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు మాత్రమే కాకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండే అవకాశం ఉంది. అంతే కాకూండా ఇది మంచి ఎక్స్టీరియర్ డిజైన్ కూడా పొందుతుందని ఆశిస్తున్నాము.

2022 మారుతి బాలెనోలో మెరుగైన స్టీల్‌తో తయారు చేయబడిన కొత్త బాడీ ప్యానెల్‌లు ఇన్‌స్టాల్ చేయబడింది. ఇప్పుడు ఈ మోడల్ యొక్క ముందు భాగం చాలా వరకు కొత్తగా ఉంటుంది. ఇందులో మెష్ గ్రిల్ తో పాటి హెడ్‌లైట్స్ మరియు వెనుక భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి వాటిని పొందుతుంది. వీటితో పాటు ఇది పెద్ద బంపర్, విశాలమైన ఎయిర్ డ్యామ్ మరియు రౌండ్ ఫాగ్ లైట్లను పొందుతుంది.

మారుతి బాలెనో యొక్క బానెట్ కూడా రీడిజైన్ చేయబడింది. ఇది మునుపటితో పోలిస్తే చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. వెనుక భాగంలో రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, L-ఆకారపు టైల్‌లైట్ క్లస్టర్ మరియు LED ఇంటర్నల్‌లు మరియు కొత్త బంపర్ ఇవ్వబడ్డాయి. సైడ్ ఫ్రొఫైల్ లో కొత్త అల్లాయ్ వీల్స్ కనిపించినప్పటికీ, డిజైన్ అలాగే ఉంచబడింది. మొత్తం మీద బాలెనొ చాలా వరకు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి, చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇక ఇందులోని ఇంటీరియర్ విషయానికి వస్తే, దీని క్యాబిన్‌లో కొత్త డ్యాష్‌బోర్డ్ ఉంటుంది, అంతే కాకుండా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ కోసం, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు సుజుకి కనెక్ట్ ఆప్సన్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా హెడ్స్ అప్ డిస్ప్లే, వి-షేప్ ఎయిర్-కాన్ వెంట్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది.

మార్కెట్లో ఇప్పటికే ఉన్న బ్రెజ్జా మరియు ఎర్టిగా వంటివి మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. కావున ఈ కొత్త 2022 బాలెనొ కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది బహుశా 4 స్టార్ రేటింగ్ లేదా 5 స్టార్ రేటింగ్ పొందే విధంగా తయారుచేయబడే అవకాశం ఉంటుంది. కొత్త 2022 బాలెనొ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్ మరియు కెమెరా, హై స్పీడ్ వార్నింగ్ వంటి వాటిని పొందుతుంది.

మారుతి బాలెనో భారతదేశంలో ఒకే ఇంజన్ ఆప్సన్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ బాలెనో యొక్క ఇంజిన్‌ను మార్చలేదు. కావున మొదటిది 1.2-లీటర్ ఇంజన్, ఇది 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఆడిస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు CVT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో కంపెనీ కొత్త గేర్‌బాక్స్ ఆప్షన్‌ని తీసుకువస్తుందా లేదా అనేది చూడాలి.

బాలెనో భారతదేశపు మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అని మారుతి సుజుకి కంపెనీ పేర్కొంది. ఇది మార్కెట్లో అత్యంత వేగంగా 1 మిలియన్ అమ్మకాలను దాటింది. ఇది కంపెనీకి చాలా ముఖ్యమైన ఉత్పత్తి, దీని కారణంగా కంపెనీ నిరంతరం కొత్త అప్‌డేట్‌లను అందిస్తోంది.

మారుతి సుజుకి కంపెనీ ఇంకా ఈ కొత్త 2022 బాలెనొ యొక్క ధరను అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే కంపెనీ దీని ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించింది. మొత్తానికి మారుతి సుజుకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి బాలెనో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను అనేక అప్‌డేట్‌లతో త్వరలోనే తీసుకురానుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం కూడా త్వరలోనే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








