విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన అప్డేటెడ్ 2022 వితారా బ్రెజ్జాను ఈ నెల 30 న అధికారికంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దీని కోసం కంపెనీ తగిన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త ఎస్‌యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో గాని రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన కేవలం ఒక రోజులోనే ఊహించని రీతిలో ఈ ఎస్‌యువి బుకింగ్లను పొందగలిగింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం బుకింగ్స్ ప్రారంభించిన మొదటిరోజే ఏకంగా 4,500 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని శశాంక్ శ్రీవాస్తవ అధికారికంగా ప్రకటించారు.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

శశాంక్ శ్రీవాస్తవ అందించిన సమాచారం ప్రకారం కొత్త 2022 మారుతి బ్రెజ్జా మంచి స్థాయిలో బుకింగ్స్ పొందింది. అయితే ఇప్పుడు ఈ ఎస్‌యువి కోసం వెయిటింగ్ పీరియడ్ పెరిగింది. ఇప్పటికే పాత మోడల్ బ్రెజ్జా కోసం 20,000 ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నట్లు కూడా అయన తెలిపారు. ఈ వినియోగదారులు కొత్త బ్రెజ్జా కావాలనుకున్నట్లయితే త్వరలోనే వారికి కూడా అందించడం జరుగుతుంది అని తెలిపారు. అయితే కొత్త బ్రెజ్జా కోసం ముందస్తుగా బుక్ చేసుకున్నవారికి ముందుగా డెలివరీలు చేయబడతాయి.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

మారుతి సుజుకి నెలకు గరిష్టంగా 10,000 యూనిట్ల బ్రెజ్జా ఎస్‌యువిలను తాయారు చేయనున్నట్లు తెలిపింది. ఈ లెక్కన కస్టమర్లు కొత్త బ్రెజ్జా ఎస్‌యువి కోసం కనీసం 2 నెలల కాలమైనా వేచి ఉండాల్సి వస్తుంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరగా డెలివరీలను అందించడానికి కంపెనీ ఉత్పత్తిని కూడా మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త 2022 వితారా బ్రెజ్జాకి సంబంధించిన చాలా సమాచారం వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 మారుతి విటారా బ్రెజ్జా మొత్తం నాలుగు వేరియంట్స్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. అవి ఎల్ఎక్స్ఐ (LXI), విఎక్స్ఐ (VXI), జెడ్ఎక్స్ఐ (ZXI) మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ (ZXI+) వేరియంట్స్. ఈ వేరియంట్లన్నీ కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించబడే అవకాశం ఉంది. అదే సమయంలో ఇందులోని విఎక్స్ఐ (VXI), జెడ్ఎక్స్ఐ (ZXI) మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ (ZXI+) వేరియంట్స్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా పొందే అవకాశం ఉంది. అయితే ఎల్ఎక్స్ఐ (LXI) వేరియంట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందే అవకాశం లేదు.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

ఇక కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, కొత్త మారుతి వితారా బ్రెజ్జా 6 మోనోటోన్ కలర్స్ లో లభించగా 3 డ్యూయెల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. మోనోటోన్ కలర్ ఆప్సన్స్ లో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ స్ప్లెండిడ్ సిల్వర్, మెటాలిక్ మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, ఎక్సుబరెంట్ బ్లూ మరియు పెర్ల్ బ్రేవ్ ఖాకీ వంటివి ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో సిజ్లింగ్ రెడ్ & బ్లాక్, వైట్ & ఖాకీ బ్రేవ్ మరియు బ్లాక్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతాయి.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

కంపెనీ ఈ విభాగంలో మరోసారి గొప్ప స్థాయిలో అమ్మకాలను పొందటం కోసం ఈ కొత్త మారుతి బ్రెజ్జాను తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే ఈ 2022 వెర్షన్ మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో ట్విన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అందించబడ్డాయి. ముందు భాగంలో సుజుకి యొక్క పెద్ద లోగో ఫ్రంట్ గ్రిల్‌లో ఇవ్వబడింది. కార్ యొక్క టెయిల్ సెక్షన్ యారో డిజైన్‌లో ఫాగ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందే అవకాశం ఉంది. వీటితో పాటు కంపెనీ ఇందులో కొత్త 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వనుంది. ఇవి డ్యూయల్ టోన్ కలర్‌లో ఉన్నాయి.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 360-డిగ్రీ కెమెరా, ప్యాడిల్ షిఫ్టర్స్, హెడ్స్ అప్-డిస్ప్లే, ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడవుతాయి.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

2022 మారుతి బ్రెజ్జా 1.5-లీటర్, కె12సి పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుంది. ఈ ఇంజిన్ మారుతి ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 లలో కూడా ఉంటుంది. ఈ ఇంజిన్ 101.6 బిహెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ఎస్‌యువి విడుదల చేసిన తరువాత CNG వెర్షన్ లో కూడా అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.

విడుదలకు ముందే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన 2022 మారుతి బ్రెజ్జా: మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న 2022 మారుతి బ్రెజ్జా ఒకేరోజులో మంచి స్థాయిలో బుకింగ్స్ పొందటం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే ఇది మార్కెట్లో విడుదలైన తరువాత ప్రత్యర్థులకు తప్పకుండా గట్టి పోటీ అందించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
2022 maruti brezza 4500 bookings on first day waiting period details
Story first published: Wednesday, June 22, 2022, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X