రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2022 మారుతి బ్రెజ్జా' (2022 Maruti Brezza) రేపు (2022 జూన్ 30) అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. దేశీయ విఫణిలో విడుదలకానున్న ఈ కొత్త 2022 బ్రెజ్జా ఎస్‌యూవీకు సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ యొక్క పరిమాణానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం, 2022 విటారా బ్రెజ్జా ఎస్‌యూవీ మొత్తమ్ 10 వేరియంట్స్ లో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో 7 మాన్యువల్ వేరియంట్‌లు (LXI, LXI (O), VXI, VXI (O), ZXI, ZXI (O), మరియు ZXI+) కాగా, మిగిలిన 3 ఆటోమేటిక్ వేరియంట్‌లు (VXI, ZXI మరియు ZXI+). ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతాయి.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

కంపెనీ ఈ కొత్త ఎస్‌యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కొనుగోలుదారులు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో గాని రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీన్ని బట్టి చూస్తే కొత్త 2022 బ్రెజ్జా తప్పకుండా విపరీతమైన ప్రజాదరణ పొందుతుందని అనిపిస్తుంది.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

కంపెనీ వెల్లడించిన సమాచారాన్ని బట్టి 2022 మారుతి బ్రెజ్జా పొడవు 3,995 మిమీ వెడల్పు 1,790 మిమీ మరియు ఎత్తు 1,685 మిమీ వరకు ఉంటుంది. ఇక వీల్‌బేస్ విషయానికి వస్తే ఇది 2,500 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

ఇక ఈ కొత్త SUV యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, కంపెనీ 2022 వితారా బ్రెజ్జా 6 మోనోటోన్ కలర్స్ లో మరియు 3 డ్యూయెల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. మోనోటోన్ కలర్ ఆప్సన్స్ లో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ స్ప్లెండిడ్ సిల్వర్, మెటాలిక్ మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, ఎక్సుబరెంట్ బ్లూ మరియు పెర్ల్ బ్రేవ్ ఖాకీ వంటివి ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో సిజ్లింగ్ రెడ్ & బ్లాక్, వైట్ & ఖాకీ బ్రేవ్ మరియు బ్లాక్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

2022 మారుతి సుజుకి బ్రెజ్జాలో ఎల్ఈడీ హెడ్‌లైట్, ట్విన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు ముందు భాగంలో సుజుకి యొక్క పెద్ద లోగో ఫ్రంట్ గ్రిల్‌లో ఇవ్వబడింది. కార్ యొక్క టెయిల్ సెక్షన్ యారో డిజైన్‌లో ఫాగ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందే అవకాశం ఉంది. సైడ్ ప్రొఫైల్ 16-ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

ఈ కొత్త ఎస్‌యువి 1.5-లీటర్, కె12సి పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ 101.6 బిహెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ ఈ ఎస్‌యువిని CNG వెర్షన్ లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

ఇప్పుడు కొత్త బ్రెజ్జా మునుపటి కంటే మెరుగైన డ్యాష్‌బోర్డ్‌ను పొందుతుంది. అంతే కాకుండా ఇది లేటెస్ట్ హెడ్స్-అప్ డిస్ప్లే మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్‌తో పాటు 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా కలిగి ఉంటుంది. వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 12 వోల్ట్ సాకెట్ మరియు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

2022 బ్రెజ్జా ఇప్పుడు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తో అందుబాటులోకి రానుంది. ఇందులో స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండనున్నాయి. కావున ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి తన 2022 బ్రెజ్జా ను రేపే మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే ఇప్పటికే ఈ ఎస్‌యువి గురించి చాలా సమాచారం అందించింది, కానీ ధరను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ధర మరియు ఇతర వివరాలు రేపు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. కొత్త 2022 బ్రెజ్జా గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Article Published On: Wednesday, June 29, 2022, 14:49 [IST]
English summary
2022 maruti brezza to be launched in india tomorrow details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+