2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్ తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

భారతీయ ఆటో పరిశ్రమలో అతి పెద్ద వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధిపొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ విఫణిలోకి తన అప్డేటెడ్ 'మారుతి విటారా బ్రెజ్జా' (Maruti Vitara Brezza) కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదలచేయనున్నట్లు ఇదివరకే తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ దీని గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంది. గతంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ గురించి తెలిపింది.

ఇప్పుడు ఈ అప్డేటెడ్ మోడల్ ఎన్ని వేరియంట్స్ లో లభిస్తుంది. ఎన్ని కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది అనే వివరాలను వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 మారుతి విటారా బ్రెజ్జా మొత్తం నాలుగు వేరియంట్స్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. అవి ఎల్ఎక్స్ఐ (LXI), విఎక్స్ఐ (VXI), జెడ్ఎక్స్ఐ (ZXI) మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ (ZXI+) వేరియంట్స్. ఈ వేరియంట్లన్నీ కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించబడే అవకాశం ఉంది.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

అదే సమయంలో ఇందులోని విఎక్స్ఐ (VXI), జెడ్ఎక్స్ఐ (ZXI) మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ (ZXI+) వేరియంట్స్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా పొందే అవకాశం ఉంది. అయితే ఎల్ఎక్స్ఐ (LXI) వేరియంట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందే అవకాశం లేదు.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

ఇక కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, కొత్త మారుతి వితారా బ్రెజ్జా 6 మోనోటోన్ కలర్స్ లో లభించగా 3 డ్యూయెల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. మోనోటోన్ కలర్ ఆప్సన్స్ లో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ స్ప్లెండిడ్ సిల్వర్, మెటాలిక్ మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, ఎక్సుబరెంట్ బ్లూ మరియు పెర్ల్ బ్రేవ్ ఖాకీ వంటివి ఉన్నాయి.

డ్యూయెల్ టోన్ కలర్స్ లో సిజ్లింగ్ రెడ్ & బ్లాక్, వైట్ & ఖాకీ బ్రేవ్ మరియు బ్లాక్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతాయి.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

2022 మారుతి సుజుకి బ్రెజ్జాలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు టెయిల్ సెక్షన్ ఇవ్వబడ్డాయి. మారుతి బ్రెజ్జా యొక్క ప్రస్తుత మోడల్‌లో ముందు భాగంలో క్రోమ్ గ్రిల్ ఉంది. హెడ్‌లైట్ ఇప్పుడు స్లిమ్ డిజైన్‌తో ఫ్రెష్ లుక్ ఇవ్వబడింది. ఇది డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్సన్ కూడా పొందుతుందని ఇటీవల వెల్లడైన చిత్రాల ప్రకారం తెలిసింది.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో ట్విన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అందించబడ్డాయి. ముందు భాగంలో సుజుకి యొక్క పెద్ద లోగో ఫ్రంట్ గ్రిల్‌లో ఇవ్వబడింది. కార్ యొక్క టెయిల్ సెక్షన్ యారో డిజైన్‌లో ఫాగ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందే అవకాశం ఉంది. వీటితో పాటు కంపెనీ ఇందులో కొత్త 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వనుంది. ఇవి డ్యూయల్ టోన్ కలర్‌లో ఉన్నాయి.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్ అప్-డిస్ప్లే, ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడవుతాయి.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

2022 మారుతి బ్రెజ్జా 1.5-లీటర్, కె12సి పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుంది. ఈ ఇంజిన్ మారుతి ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 లలో కూడా ఉంటుంది. ఈ ఇంజిన్ 101.6 బిహెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

2022 మారుతి బ్రెజ్జా దేశీయ మార్కెట్లో 2022 జూన్ 30 న అధికారికంగా విడుదలకానుంది. అయితే ఈ కొత్త మోడల్ విడుదలకు ముందే కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారభించింది. కావున కొనుగోలుదారులు రూ. 11,000 చెల్లించి కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్ లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

2022 మారుతి విటారా బ్రెజ్జాలోని వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్.. ఇవే: చూసారా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి కంపెనీ భారతీయ మార్కెట్లోకి మొదటిసారిగా 2016 లో తన వితారా బ్రెజ్జా లాంచ్ చేసింది. కంపెనీ ఇప్పటివరకు దాదాపు 7.5 లక్షల యూనిట్ల బ్రెజ్జాలను మార్కెట్లో విక్రయించింది. అయితే ఇప్పుడు కొత్త బ్రెజ్జా త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. ఈ కొత్త మోడల్ కి దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో త్వరలోనే తెలుస్తుంది.

Source: Rushlane

Most Read Articles

English summary
2022 maruti brezza variant and color option revealed ahead of launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X