అప్పుడే ప్రారంభమైన 2022 Maruti Baleno డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా?
'మారుతి సుజుకి ఇండియా' (Maruti Suzuki India) తన అప్డేటెడ్ 'మారుతి సుజుకి బాలెనో' (Maruti Suzuki Baleno) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను విడుదలచేసింది. దీని ప్రారంభ ధర రూ. 6.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదే సమయంలో ఇందులోని టాప్ స్పెక్ ధర రూ. 9.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కంపెనీ ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్‌లను ప్రారంభించింది, కావున కొనుగోలుదారులు దీనిని కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌లో రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో డెలివరీలు ప్రారంభమయ్యాయని తెలిసింది. మారుతీ సుజుకి ఫిబ్రవరి 8న తన బుకింగ్‌ను ప్రారంభించింది. ఇప్పటికి కంపెనీ దాదాపుగా 25,000 యూనిట్ల బుకింగ్లను స్వీకరించినట్లు తెలిసింది.

2022 మారుతి బాలెనో సిగ్మా, డెల్టా, డెల్టా (AMT), జీటా, జీటా (AMT), ఆల్ఫా, మరియు ఆల్ఫా (AMT) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కొత్త మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉన్నాయి.
| Variant | Existing Baleno | New Baleno | Change |
| Sigma MT | ₹6,14,000 | ₹6,35,000 | ₹21,000 |
| Delta MT | ₹7.01,000 | ₹7,19,000 | ₹18,000 |
| Zeta MT | ₹7,70,000 | ₹8,09,000 | ₹39,000 |
| Alpha MT | ₹8,46,000 | ₹8,99,000 | ₹53,000 |
| Delta AGS | ₹8,21,000 | ₹7,69,000 | ₹52,000 |
| Zeta AGS | ₹8,90,000 | ₹8,59,000 | ₹31,000 |
| Alpha AGA | ₹9,66,000 | ₹9,49,000 | ₹17,000 |

2022 బాలెనొ మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే, లుక్స్ బీజ్ (Luxe Beige), ఓపులంట్ రెడ్ మరియు పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కొత్త బాలెనొ మంచి డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలో ఫ్రంట్ గ్రిల్ పెద్దదిగా ఉంటుంది, దాని హెడ్‌లైట్లు మునుపటి కంటే పల్చగా ఉంటాయి, కావున ఇది బోల్డ్ లుక్‌ని ఇస్తుంది. దీని బంపర్‌కు కొత్త డిజైన్ కూడా ఇవ్వబడింది. కొత్త స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు వెనుక వైపున ఇవ్వబడతాయి. అయితే ఇందులోని కొత్త అల్లాయ్ వీల్స్ దీని డిజైన్ మరింత మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇది అప్డేటెడ్ ఇంటీరియర్ డిజైన్ కూడా పొందుతుంది. దీని క్యాబిన్‌లోని కొత్త డ్యాష్‌బోర్డ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉపయోగించబడింది. మీరు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్‌ను కూడా పొందుతారు. అంతే కాకుండా 360-డిగ్రీ కెమెరా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ భారీ 9-ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. క్లైమేట్ కంట్రోల్ నాబ్ రీడిజైన్ చేయబడింది మరియు స్టీరింగ్ వీల్ డిజైర్ నుండి తీసుకోబడింది.

దీనితో పాటు, ఇది హెడ్స్ అప్ డిస్ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆర్క్‌మిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వంటివి కూడా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న బాలెనొ ఇప్పుడు అప్డేట్ మోడల్ గా విడుదలైంది. అయితే ఇప్పుడు ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది. ఈ 2022 బాలెనొ దేశీయ విఫణిలో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, హోండా జాజ్, మరియు అప్‌డేట్ కానున్న టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మాన్యువల్‌తో 22.35 కిమీ మరియు ఆటోమాటిక్ తో 22.94 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ బరువు ఇప్పుడు 70 కిలోలు పెరిగింది, కావున బాలెనొ బరువు ఇప్పుడు 1,410 కేజీల వరకు ఉంటుంది.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ యొక్క ఈ బ్రాండ్ యొక్క అప్డేటెడ్ మోడల్ తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోందని ఆశిస్తున్నాము. అయితే ఇది రానున్న కాలంలో మరిన్ని అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








